జాతీయ వార్తలు

గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దిల్లీ- ఆగ్రాల మధ్య గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే తొలి మినీ హైస్పీడ్ రైలు ‘గతిమాన్ ఎక్స్‌ప్రెస్’కు సోమవారం ఉదయం రైల్వేమంత్రి సురేష్ ప్రభు పచ్చజెండా ఊపారు. దిల్లీ నుంచి ఈ రైలు వంద నిమిషాల్లోనే ఆగ్రా చేరుకుంటుంది. ప్రయాణీకులకు స్వాగతం పలికేలా ఎయిర్ హోస్టెస్‌ల మాదిరి ఇందులో ట్రైన్ హోస్టెస్‌లుంటారు. ఉచితంగా వాటర్ బాటిళ్లు, దినపత్రికలు అందజేస్తారు. వైఫై, బయోటాయిలెట్, పలురకాల వీడియోలు వంటి సౌకర్యాలు ఇందులో ఉంటాయి. తాజ్‌మహల్ మూసి ఉండే శుక్రవారం తప్ప మిగతా ఆరు రోజుల్లోనూ దీన్ని పర్యాటకుల కోసం నడుపుతారు.