గుంటూరు

నది వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటుకు ఇంకెన్ని ప్రాణాలు పోవాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, మార్చి 23: నదిలో ఆత్మహత్యలకు పాల్పడేవారు కొందరైతే సరదాగా స్నానానికి వచ్చి ఊబుల్లో చిక్కుకుని చనిపోయిన వారెందరో ఉన్నారు. ప్రధానంగా సీతానగరంలోని రైల్వేబ్రిడ్జి సమీపంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. విజయవాడకు చెందిన కళాశాల విద్యార్థులు హోలీ రోజున కృష్ణానదికి సరదాగా వచ్చి మృత్యువాత పడటంతో విషయం చర్చనీయాంశమైంది. ఇంకెంత మంది చనిపోతే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తారని ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా విజయవాడకు చెందిన విద్యార్థినుల మృతి, సంబరాలు నేపథ్యంలో కృష్ణాస్నానమాచరించటానికి విచ్చేసి, ఊబుల చెంతకెళ్ళి ప్రమాదాల బారిన పడబోయి తప్పించుకున్న వారెందరో ఉన్నారని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌కి రైల్వేబ్రిడ్జ్‌కి మధ్య కృష్ణానదిలో నీరు అక్కడక్కడా ఉన్నప్పటికీ రైల్వేబ్రిడ్జివైపు వచ్చే మార్గంలో నీళ్లలో ఊబులున్నట్లు స్థానికులు చెపుతున్నారు. కేవలం నదిలో కొద్ది అడుగుల మేరకు వెళ్ళి స్నానమాంచరించాలే తప్ప కొంచెం లోపలికి వెళితే ప్రమాదంలో చిక్కుకున్నట్లే. గత కొద్ది రోజులుగా ఏప్రాంతంలో చూసినా నీటి ప్రమాదాల్లో మరణించినవారిలో అత్యధికులు విద్యార్థులే ఉంటున్నారని, సరదాగా ఈతకు వెళ్ళో, లేక ఊహించని విధంగా ఊబిలో చిక్కో ప్రమాదాల బారిన పడుతున్నందున అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సివుంది. ఇప్పుడే ఇటువంటివి జరిగితే కొద్ది నెలల్లో ప్రారంభంకానున్న కృష్ణాపుష్కరాలకు ఈప్రాంతానికి విచ్చేసే భక్తుల ప్రాణాలకు ఏపాటి రక్షణ ఉంటుందో అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. పైగా అప్పటికి నదిలో నీటి మట్టం కూడా కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నీటిపారుదలశాఖాధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, నదిలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణ రక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మంగళాద్రిలో అంగరంగ వైభవంగా
నృసింహుని రథోత్సవం
మంగళగిరి, మార్చి 23: పానకాల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన దివ్యరథోత్సవం బుధవారం సాయంత్రం మంగళగిరి మెయిన్ బజార్‌లో అంగరంగ వైభవంగా కన్నుల పండువగా జరిగింది. తెల్లవారుఝామున కల్యాణం జరుపుకున్న స్వామి, అమ్మవార్లను 11 అంతస్తుల దివ్యరథంపై ఊరేగించారు. దక్షిణాభిముఖంగా రథారూఢుడై పయనిస్తున్న కల్యాణ నృసింహుని వేలాదిమంది ప్రజలు నేత్రపర్వంగా దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించిన వారికి మరలా జన్మ ఉండదని శాస్త్ర ప్రమాణం. కృష్ణా, గుంటూరుజిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొనడంతో పట్టణ వీధులన్నీ కిక్కిరిసి పోయాయి. పెద్దసంఖ్యలో విచ్చేసిన యువకులు హోలి రంగులు చల్లుకుంటూ స్వామివారికి జయజయ ధ్వానాలతో రథాన్ని ముందుకు లాగాతూ సాగారు. మార్గమధ్యంలో భక్తులు అడుగడుగునా స్వామివారికి పండ్లు, పూలు, టెంకాయలు సమర్పించారు. యువకులు హోలి రంగులు చల్లుకుంటూ రథోత్సవంలో చిందులేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, ఆప్కోచైర్మన్ మురుగుడు హనుమంతరావు, మార్కెట్‌యార్డు చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి, దేవాదాయశాఖ ఎసి కెబి శ్రీనివాస్, ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావు, మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు, ధర్మకర్తలు రథోత్సవానికి ముందు పూజాది కార్యక్రమాలు జరిపి టెంకాయలు కొట్టి ప్రారంభించారు. కాళికాదేవి అవతారం, తీన్‌మార్, డప్పులు, కోలాటం, బాణసంచా పేలుళ్లతో రథోత్సవం వైభవంగా జరిగింది. రథోత్సవానికి కైంకర్యపరులుగా మాడభూషి వేదాంతాచార్యులు వ్యవహరించారు. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున స్వామివారి రథోత్సవం (మంగళగిరి తిరునాళ్లు) జరుపుకోవడం పూర్వంనుంచి ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవానికి వచ్చిన భక్తులకు సూచనలు, సమాచారం ఇస్తూ స్కౌట్స్ అండ్ గైడ్స్, పోలీస్, దేవాదాయశాఖ సిబ్బంది సేవలందించారు. అత్యధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. సిఐ బి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో విస్తృతమైన పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఉదయం స్వామివారి బంగారు గరుడోత్సవం నిర్వహించారు. వాసిరెడ్డి నాగేంద్రప్రసాద్ శాశ్వత కైంకర్యపరులుగా ఉన్నారు. మధ్యాహ్నం బ్రాహ్మణ సమారాధన నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా విచ్చేసిన భక్తులకు వాసవి సేవాసమితి అధ్యక్షుడు మాజేటి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ చేశారు. వివిధ స్వచ్చంద, వ్యాపార సంస్థలు భక్తులకు మంచినీరు, మజ్జిగ, పులిహోర, చక్కెర పొంగలి, లడ్డు ప్రసాదం అందజేశారు.