గుంటూరు

చెత్తశుద్ధిపై అధ్యయనానికి జపాన్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కార్పొరేషన్), డిసెంబర్ 16: అమరావతి రాజధాని పరిధిలోని గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి అధ్యాయనం చేసేందుకు జపాన్ బృంద సభ్యులు బుధవారం గుంటూరు నగరానికి విచ్చేశారు. తొలుత నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మిని తన చాంబర్‌లో కలిసి పలు విషయాలపై చర్చించారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో అభివృద్ధిలో భాగంగా కరెంట్, టెలి కమ్యూనికేషన్, ట్రాఫిక్ తదితర అంశాలను అధ్యాయనం చేసేందుకు తాము వచ్చామని, ఇందుకు కావాల్సిన సమాచారాన్ని తమకు అందించాలని కమిషనర్‌ను కోరారు. అలాగే రాజధాని పరిధి ప్రాంతంలో విమానాశ్రయం, చెత్తశుద్ధి కార్మాగారం ఏర్పాటుకు సంబంధించిన విషయాలపై అధ్యాయనం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రసుత్తం గన్నవరం ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారని, గుంటూరులో జర్మనీ సహకారంతో చెత్తశుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. జపాన్ బృంద సభ్యులకు కావాల్సిన సమాచారాన్ని అందించాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జపాన్ అర్బన్ డెవలప్‌మెంట్ చీఫ్ స్పెషలిస్టు నెబుహిరో ఓషిమా, వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్‌ఫర్ట్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

కాల్‌మనీకి కారెవ్వరూ అనర్హులు!

* 40 ఏళ్ల క్రితమే ప్రారంభమైన వడ్డీ సంస్కృతి * పొగాకు, పత్తి, మిరప వ్యాపారాలే టార్గెట్
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, డిసెంబర్ 16: కాల్‌మనీ వ్యాపార వికృతచేష్టలు బహిర్గతం కావడంతో ఉలిక్కిపడ్డ రాష్ట్రప్రభుత్వం ఆనవాళ్లను పసిగట్టేందుకు కొరడా ఝుళిపించింది. పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ రాజకీయ తాబేదారులను పక్కనబెట్టి కేవలం వడ్డీవ్యాపారులపై పంజా విసురుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలపై జరుగుతున్న దాడులు కూడా రాజకీయ కోణంలోనే జరుగుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. అయితే గుంటూరులో 40 యేళ్ల క్రితమే వడ్డీవృక్షం వేళ్లూనుకుంది. వాణిజ్య కేంద్రమైన గుంటూరు జిల్లా పొగాకు, మిర్చి, పత్తి వ్యాపారాలలో రైతులకు ముందుగానే నగదు ఇచ్చి పంటలకు ఖరీదు కట్టే ఆనవాయితీ ఈనాటికి కాదు. వ్యాపారస్తులు లాభాలే ధ్యేయంగా ముందుకెళ్తున్న దశలో రైతులు పండిస్తున్న పంటలకు చెక్కులు చెల్లించి చేజిక్కించుకోవడం వడ్డీవాపారులకు వెన్నతోపెట్టిన విద్యే. మార్కెట్‌యార్డుల్లో నిత్యం జరిగే లావాదేవీలన్నీ వడ్డీవ్యాపారుల కబంధ హస్తాలల్లోనే కొనసాగుతుంటాయి. వడ్డీ క్రీడలో భాగంగా మార్కెట్‌యార్డులో రైతుల నుంచి కొనుగోలు చేసే పత్తి, పొగాకు, మిర్చి పంటలకు వారం, 15 రోజుల తర్వాత నగదు చెల్లింపులు జరుపుతారు. అయితే వడ్డీ వ్యాపారులు మార్కెట్‌యార్డులు ఇచ్చే చెక్కులను రైతుల నుంచి తీసుకుని కమీషన్ పేరుతో కొంత మినహాయించి మిగిలిన డబ్బులను అప్పటికప్పుడే చెల్లిస్తారు. దీని కారణంగానే మార్కెట్‌యార్డు చైర్మన్, డైరెక్టర్ల పదవులకూ డిమాండ్ పెరిగింది. ఆ విధంగా వేళ్లూనుకున్న వడ్డీ విషవృక్షం విస్తృతమై అన్నిరంగాల్లోనూ ఊడలు దింపింది. కాల్‌మనీకీ కారెవ్వరూ అనర్హులన్నట్లు పెన్షనర్లను సైతం వదలకుండా పట్టి పీడిస్తుంది వడ్డీ మాఫియా. గుంటూరు నగరంలో జరిగిన పోలీసుదాడుల్లో పెన్షన్ బుక్‌లు కూడా లభ్యంకావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇచ్చే సమయంలో సవాలక్ష ఆంక్షలతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తుంటారు. దీన్ని అసరాగా చేసుకున్న వడ్డీ వ్యాపారులు రైతు అడిగే నగదును వారి అవసరతను గమనించి వడ్డీ నిర్ణయించి వెంటనే చెల్లింపులు జరుపుతుంటారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు కూడా వడ్డీవ్యాపారులకు వరంగా మారాయి. వర్షాల్లేక వేల ఎకరాల్లో పంటలు వేసిన రైతులు నష్టాలు చవిచూడక తప్పలేదు. దీనికి తోడు బ్యాంకుల్లో రుణమాఫీ కానందున, రుణాలకు ఈ ఏడాది రుణాలు ఆశించిన మేర అందలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో రైతన్నలు వడ్డీవ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకోక తప్పలేదు. నానాకష్టాలు పడి పంటలు వేసినప్పటికీ వర్షాభావం వల్ల పంట చేతికి అందిరాకపోవడంతో తెచ్చిన అప్పులు, తడిసిమోపెడైన వడ్డీలను చెల్లించే మార్గం లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలూ జిల్లాలో కోకొల్లలుగా చోటు చేసుకున్నాయి. కౌలు రైతులు కూడా ఈ కోవలోనే ఆత్మహత్యలు చేస్తుకున్న విషయం అందరికీ తెలిసిందే. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో చిరు వ్యాపారులు వడ్డీవ్యాపారస్తులిచ్చే నగదే పెట్టుబడిగా పెట్టి వ్యాపారాలు సాగిస్తుంటారు. తోపుడుబండ్లు పై వ్యాపారం చేసే వారు కూడా రోజువారీ వడ్డీ ఉచ్చులో కూరుకుంటున్నారు. ఉదయం అసలుగా పుచ్చుకున్న సొమ్మును సాయంత్రానికి 10 నుండి 20 శాతం వడ్డీ జోడించి వడ్డీవ్యాపారుల జేబులు నింపుతున్నారు. రోజువారీ కూలీలను కూడా వడ్డీవ్యాపారులు టార్గెట్ చేసి తమవైపు తిప్పుకుంటున్నారు. ఇలా ఉండగా విజయవాడ తాజా కాల్‌మనీ వ్యవహారంతో రాష్ట్రప్రభుత్వం వడ్డీ వ్యాపారులపై దాడులు నిర్వహిస్తున్నప్పటికీ పట్టుబడుతున్న వారి సంఖ్య నామమాత్రంగా ఉంది. జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించిన పోలీసు దాడుల్లో సుమారు 10 మందిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తుంది. జిల్లావ్యాప్తంగా వడ్డీవ్యాపారులను పోలీసులు పూర్తిస్థాయిలో అదుపు చేయాలని భావించే పక్షంలో, అన్ని పార్టీలకు చెందిన బడావ్యక్తుల వ్యవహారాలు బహిర్గతమయ్యే అవకాశం ఉండటంతో వారిపై చర్యలు తీసుకోవడంలో ఎంతవరకు పోలీసులు కృతకృత్యులవుతారో ఎదురుచూడాల్సి ఉంది.

ఆగివున్న లారీనీ ఢీకొన్న ఆటో...
ఇద్దరి దుర్మరణం
* ఐదుగురికి తీవ్ర గాయాలు
రాజుపాలెం, డిసెంబర్ 16: ఆగివున్న లారీని ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రగాయాలపాలైన దుర్ఘటన మండలంలోని నెమలిపురి సమీపంలోని శ్రీనివాసనగర్ వద్ద చోటు చేసుకుంది. రాజుపాలెం ఎస్‌ఐ అనిల్‌కుమార్ కథనం ప్రకారం... బుధవారం తెల్లవారు ఝామున అప్పి ఆటోలో పిడుగురాళ్ల నుండి నరసరావుపేట వెళ్లడానికి చిరు వ్యాపారస్తులు ఏడుగురు ఎక్కారు. మార్గమధ్యంలోని శ్రీనివాసనగర్‌కు వచ్చే సరికి ఆటో లారీని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న దూదేకుల రాజావలి (55), దూదేకుల చిన్నసైదులు (60) అక్కడికక్కడే మృతిచెందారు. మాదినేని శ్రీనివాసరావు, దేవర నాగయ్య, దేవర మల్లేశ్వరిలతో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఇరు మృతదేహాలను సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ అనిల్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మూడేళ్లలో ఎయిమ్స్ నిర్మాణం పూర్తి
* మంత్రి కామినేని
మంగళగిరి, డిసెంబర్ 16: మంగళగిరి పట్టణ శివారులో 193 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన ఎయిమ్స్‌కు ఈనెల 19న శంకుస్థాపన జరుపుకుని వచ్చే మూడేళ్లలో నిర్మాణ పనులు పూర్తవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. పట్టణ శివారులోని పూర్వపు టీబీ శానిటోరియం ఆస్పత్రి ప్రాంగణంలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన ఏర్పాట్లను బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, అర్బన్ ఎస్సీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఇతర అధికారులతో కలిసి మంత్రి కామినేని పరిశీలించారు. పైలాన్ నిర్మాణాన్ని, సభా ప్రాంగణాన్ని, హెలీపాడ్ ప్రాంతాన్ని, విఐపి మార్గాన్ని, సాధారణ ప్రజలు వచ్చే మార్గాన్ని మంత్రి కామినేని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్యశిబిరం, వాహనాల పార్కింగ్, ఇతరత్రా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి కామినేని విలేఖర్లతో మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ఇక్కడ నిర్మాణం జరుకోనుండటం సంతోహంగా ఉందని, తొలుత 1200 కోట్లు కేటాయించగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేబినెట్‌లో చర్చించి ఈ మొత్తాన్ని 1618 కోట్లకు పెంచారని, మూడేళ్లల్లో పూర్తిచేసి 2018 నుంచి అడ్మిషన్లు జరపాలనే యోచనలో ఉన్నామని అన్నారు. రెండు కొండల మధ్య, రెండు హైవేల మధ్య రైల్వే ట్రాక్‌కు దగ్గరగా ఉన్న ఈ ప్రాంగణం ఎయిమ్స్‌కు ఎంతో అనువుగా ఉందని కమిటీ సభ్యులు పేర్కొన్నారని మంత్రి కామినేని అన్నారు. ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉన్న ఈ ప్రాంతంలో పూర్వం టీబీ శానిటోరియం ఏర్పాటు చేయగా ఇక్కడ స్వచ్చమైన గాలి, వాతావరణం కారణంగా రోగం తగ్గేదని, ఇప్పుడు మంచి మందులు రావడం వలన టీబీ బాధితులు తగ్గిపోయారని, దీంతో ఈ ప్రాంగణాన్ని ఎయిమ్స్‌కు కేటాయించడం జరిగిందన్నారు. 900 పడకలు, వందమంది వైద్య విద్యార్థులు, అన్ని పారామెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్, పబ్లిక్‌హెల్త్ ఇన్‌స్టిట్యూషన్‌లు ఉంటాయని మంత్రి కామినేని వివరించారు. 19వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి జెపి నడ్డా ఎయిమ్స్‌కు శంకుస్థాపన గావిస్తారని మంత్రి కామినేని తెలిపారు. జాయింట్ కలెక్టర్ 2 వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ బి ఎస్‌ఇ రాఘవేంద్రరావు, విద్యుత్, రెవిన్యూ, ఆర్ అండ్ బి, పోలీసు, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, పంచాయితీరాజ్, మున్సిపల్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, బిజెపి నాయకులు జమ్ముల శ్యాంకిషోర్, లక్ష్మీపతి, జగ్గారపు రామ్మోహనరావు, అందే శివశంకర్, మాదల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి

గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 16: రాజకీయ రంగంలో కూడా వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని ఎపి వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలా జోజిబాబు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎపి వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వికలాంగుల ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. ఈ సందర్భంగా జోజిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం వికలాంగుల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ మాదిరిగా ప్రత్యేక సబ్‌ప్లాన్‌ను ఏర్పాటుచేసి నిధులు కేటాయించాలన్నారు. అలాగే రాజధాని పరిధిలో వికలాంగుల భవన్‌కు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ వికలాంగులకు పెన్షన్‌ను అందరికీ సమానంగా ఇవ్వాలన్నారు. త్వరలో వికలాంగుల సమస్యలపై చిత్తూరు జిల్లా నారావారిపల్లె నుండి సైకిల్‌యాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు. సభలో డి ఎల్లయ్య, కెఎం కుట్టు, కొమ్ము రాధాకృష్ణమూర్తి, పెదకూరపాడు మస్తాన్, కె రాంబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

కళాకారులకు, కళలకు రాజధాని అమరావతి
గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 16: సంగీత కళలకు, కళాకారులకు అమరావతి రాజధాని కానుందని ప్రముఖ సినీ నేపథ్య గాయకులు గీతామాధురి, శ్రీకృష్ణలు పేర్కొన్నారు.
బుధవారం స్థానిక బ్రాడీపేటలోని ఓ హోటల్‌లో అమరావతి సాంస్కృతిక వెబ్‌సైట్‌ను టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు, మాజీ మంత్రి శనక్కాయల అరుణలతో కలిసి మాధురి, శ్రీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో ఇప్పటివరకు ఎటువంటి వినోదాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అవకాశం లేదన్నారు. అమరావతి ప్రాంతంలో పర్యాటక, కళలను ప్రోత్సహించే సిఎం పెద్దపీట వేస్తున్నారన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు కళలకు కాణాచి అన్నారు. మాజీ మంత్రి శనక్కాయల అరుణ మాట్లాడుతూ కళాకారులను ప్రజలు ఎప్పుడూ ఎంతో అభిమానంతో ఆదరిస్తూనే ఉంటారన్నారు. అనంతరం ఈవెంట్ మేనేజర్లు కాసుల కృష్ణంరాజు, చందు శ్రీనివాస్ తదితరులు గాయకులు గీతామాధురి, శ్రీకృష్ణలను ఘనంగా సత్కరించారు.

సొంతింటి కల సాకారానికి మోడల్ కాలనీ నిర్మిద్దాం
* కలెక్టర్ దండే
పొన్నూరు, డిసెంబర్ 16: జీవనోపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పేదలు, శ్రామికులు పట్టణాలకు వలస వస్తున్నందునే పట్టణాల్లో పేదరికం పెరిగిందని, ఇల్లు కట్టుకోలేని దుస్థితి నెలకొందని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. పట్టణంలోని పేదలకు గూడు కల్పించే బాధ్యతను స్వీకరించిన ప్రభుత్వం గృహ సముదాయాలను నిర్మించి ఇచ్చే చర్యలను చేపట్టిందన్నారు. బుధవారం పురపాలక సంఘ కార్యాలయంలో అందరికీ ఇల్లు కార్యక్రమంపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పేదలకు సొంతింటి కలను సార్ధకం చేసేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గృహ సముదాయాలను నిర్మిం చి యిస్తున్నాయన్నారు. సదస్సులో పాల్గొన్న స్థానిక శాసనసభ్యుడు డి నరేంద్రకుమార్ మాట్లాడుతూ పట్టణంలో ఇల్లు లేని పేదల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. పట్టణంలోని 2,360 మంది పేదలకు రూ.150 కోట్ల వ్యయంతో హౌసింగ్ కాలనీ నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మం జూరు చేసిందన్నారు. ఆ నిధులను వె చ్చించి మోడల్ కాలనీని నిర్మిస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా జలదర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత అధ్యక్షతన జరిగిన సదస్సులో హౌసింగ్‌శాఖ డైరెక్టర్ నాగేశ్వరరావు, హౌసింగ్ ఇడి సాయినాథకుమార్, డిఇ సాంబశివరావు, తహశీల్దార్ మరణానాయక్, వైస్ చైర్మన్ ఆకుల సాంబశివరావుతో పాటు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

పెయింటింగ్ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం
మంగళగిరి, డిసెంబర్ 16: పట్టణంలోని యాక్సెస్‌బ్యాంక్ మంగళగిరి బ్రాంచి ఆధ్వర్యాన పిల్లలకు నిర్వహించిన పెయింటింగ్ పోటీల్లో విజేతలకు బుధవారం మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. నాగార్జున హైస్కూల్, అరవింద స్కూల్, జెమ్స్ స్కూల్ విద్యార్ధినీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెల్చుకున్న విజేతలకు బహుమతులు అందజేశారు. బ్రాంచి మేనేజర్ దుర్గ హరి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రానికి ముంచి పేరు తేవాలి
సత్తెనపల్లి, డిసెంబర్ 16: జిల్లా క్రీడాకారులనే కాకుండా రాష్ట్రక్రీడాకారులను కూడా ఆర్థికంగా ప్రొత్సహిస్తామని, జిల్లాకి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ విజేతలనుద్దేశించి అన్నారు. స్థానికంగా బుధవారం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. క్రీడల్లోరాణించి వ్యక్తిగతంగా ఉద్యోగ అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కెవి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఏ జిల్లా నిర్వహించనన్ని స్టేట్‌మీట్‌లు గుంటూరు జిల్లా నిర్వహించందని అన్నారు. నిర్వాహకులు క్రీడాకారులకు భోజన ఏర్పాటుతోపాటు క్రీడాదుస్తులు, ప్రయాణ ఖర్చులు, ఏర్పాటుచేసి జిల్లాకు మంచి పేరు తెచ్చారని కొనియడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాయమ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు బి కరిముల్లారావు, జిల్లాస్కూల్‌గేమ్స్ కార్యదర్శి ఎంకె గౌస్ టోర్నమెంట్ అబ్జర్వర్ కె రవి తదితరులు పాల్లొన్నారు.

మే నెలలో 24 గంటల మంచినీటి సరఫరాకు చర్యలు
గుంటూరు (కార్పొరేషన్), డిసెంబర్ 16: ప్రపంచబ్యాంకు నిధులతో చేపడుతున్న సమగ్ర మంచినీటి సరఫరా పథకం పనులను త్వరితగతిన పూర్తి చేసి మే నెలనాటికి నగరంలో 24ఇన్‌టు7 మంచినీటిని సరఫరా చేయాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. సమగ్ర మంచినీటి సరఫరా పనులు వేగవంతం చేసేందుకు బుధవారం తన చాంబర్‌లో రైల్వే, ఇరిగేషన్, నేషనల్ హైవే అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రైల్వే అధికారులతో మాట్లాడుతూ పైపులైన్లు వేసేందుకు రైల్వే అధికారులు సహకారం అందించాలన్నారు. రైల్వే డిపార్టుమెంట్ అధికారులు స్పందిస్తూ రైల్వే ట్రాక్ క్రాసింగ్ ప్రాంతాల అవగాహన కోసం నగరపాలక సంస్థ అధికారులతో కలిసి జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేసి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఇరిగేషన్ అధికారులతో కమిషనర్ మాట్లాడుతూ కృష్ణ రివర్ బండ్ వద్ద పైపులైను నిర్మాణ పనులపై ఉన్న సమస్యను పరిష్కరించేందుకు శనివారం లోగా పర్మిషన్ తీసుకొని పనులు వేగవంతం చేయాలన్నారు. నేషనల్ హైవే అధికారులతో మాట్లాడుతూ సర్వీస్ రోడ్లను దాటుతూ వేసే పైపులైన్ల విషయంలో సంబంధిత అధికారులు సహకరించాలన్నారు. అలాగే ఉండవల్లి వద్ద ఎన్‌సిసి కాంట్రాక్టర్లు చేస్తున్న ఇన్‌టెక్‌వెల్ పనులు, సంగంజాగర్లమూడి వద్ద పైపులైను పనులు, ఫిల్టర్‌హౌస్ పనులు అధిక జాప్యాన్ని గమనించి రోజూవారిగా టార్గెట్ పెట్టుకుని పనులు చేయాలని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులను వేగవంతం చేసి జనవరి 15 కల్లా శ్యామలానగర్, బి ఆర్ స్టేడియం ప్రాంతాల్లో ట్రైల్ రన్ వేయాలని ఆదేశించారు.
సమావేశంలో ఎన్‌ఎహెచ్‌ఐ సర్వేయర్ అజయ్‌కుమార్, రైల్వే డిపార్టుమెంట్ తరపున ఎస్ నాథ్, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ టెక్నికల్ మేనేజర్ విద్యావాణి, ఇరిగేషన్ ఏఈఈ నరేంద్ర, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వడ్డీ వ్యాపారం చేస్తున్న బంగారు దుకాణాలపై పోలీసుల దాడులు

కారంపూడి, డిసెంబర్ 16: అక్రమం గా వడ్డీ వ్యాపారం చేస్తున్న ఫైనాన్స్, బంగారపు దుకాణాలపై కాల్‌మనీ పేరుతో పోలీసులు అర్ధరాత్రి నుండి కారంపూడిలో దాడులు నిర్వహించారు. అమూల్య హోంనీడ్స్, నందిని, షన్ముఖి బంగారు దుకాణాల్లో ఉన్న పత్రాలను, ప్రామిసరీ నోట్లను స్వా ధీనం చేసుకున్నారు. చీటీపాటలకు సం బంధించిన కాగితాలు, రికార్డులు, అగ్రిమెంట్లను స్వాధీన పర్చుకున్నారు. బంగారు దుకాణాల్లో అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చేయడంతో పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు గురజాల డిఎస్పీ నాగేశ్వరరావు తెలిపా రు. మండల కేంద్రమైన కారంపూడిలో అనుమతులు లేకుండా ఆటోఫైనాన్స్, ఎంప్లాయిస్ ఫైనాన్స్‌లు 70 వరకు ఉన్నాయి. అయితే పోలీసుల కాల్‌మనీ దాడులతో తమ షాపులకు తాళాలు వేసి వడ్డీ వ్యాపారులు పరారయ్యారు. రాష్టవ్య్రాప్తంగా జరుగుతున్న కాల్‌మనీ వ్యాపారులపై దాడులతో నల్లధనం భరతం పడతామని డిఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.
ఈ దాడుల్లో రూరల్ సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ నారాయణస్వామి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.