రాష్ట్రీయం

ఇదేం పద్ధతి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిఆర్‌ఎస్ కార్యకర్తలపై నిర్భయ కేసు పెడతానని గీతారెడ్డి హెచ్చరిక

హైదరాబాద్, డిసెంబర్ 12: తన పట్ల దురుసుగా ప్రవర్తించి, గాయపరచిన టిఆర్‌ఎస్ కార్యకర్తలపై నిర్భయ కేసు పెడతానని, జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి)కు ఫిర్యాదు చేస్తానని టి.కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి జె గీతారెడ్డి హెచ్చరించారు. జహీరాబాద్‌లో తాను ఒక సమావేశంలో పాల్గొన్నప్పుడు టిఆర్‌ఎస్ కార్యకర్తలు హంగామా సృష్టించారని, తన కాలు తొక్కారని, దురుసుగా ప్రవర్తించారని ఆమె శనివారం విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. ఈ విషయాన్ని తాను అంత సులభంగా వదిలి పెట్టననన్నారు. 1969 సంవత్సరం నుంచి బంగారు తెలంగాణ సాధన కోసం అనేకమంది ప్రాణ త్యాగం చేశారని ఆమె తెలిపారు. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత ప్రతిపక్ష నేతలను భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి పార్టీలో చేర్చుకోవడం భావ్యం కాదని అన్నారు. పార్టీ మారాల్సిందిగా మీకూ ఆహ్వానం వచ్చిందా?, ఎవరైనా ఫోన్ చేశారా? అని ప్రశ్నించగా, తమ పార్టీ నాయకులను టిఆర్‌ఎస్ భయభ్రాంతులకు గురి చేస్తున్నదని, ఇందులో భాగంగానే తనపట్ల దురుసుగా ప్రవర్తించారని, దీనిని బట్టి మీరే అర్థం చేసుకోవాలని ఆమె అన్నారు. 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి పని చేశానని, ఈ సమయంలో పార్టీ ఫిరాయించి తన భవిష్యత్తును, పేరును చెడగొట్టుకోనని తెలిపారు.