బిజినెస్

జియో ట్యూబులతో విశాఖ బీచ్ కోతకు అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 7: విశాఖ సాగర తీరంలో బీచ్ కోత నివారణకు విశాఖ పోర్టుట్రస్ట్ సరికొత్త చర్యలు చేపట్టింది. నిన్న, మొన్నటివరకు కోతకు గురైన ప్రాంతాల్లో మట్టిని ఫిల్లింగ్ చేసేవారు. అలలు ఉద్ధృతంగా వచ్చినపుడు మట్టి తిరిగి సముద్రంలోకి కొట్టుకుపోయేది. దీని వల్ల ప్రయోజనం లేదని భావించిన అధికారులు శాశ్వత పరిష్కారానికి చెన్నైకి చెందిన ఎన్‌ఐఒటి నిపుణుల బృందంతో సర్వే జరిపించారు. ఈ బృందం విశాఖ బీచ్‌లో వారం రోజులు పరిశీలించి అలలు ఏ సమయంలో వస్తున్నాయి.. ఎంత తీవ్రతతో వస్తున్నాయి.. ఏ ప్రాంతంలో తీరం కోతకు గురవుతోంది.. గతంలో పరిస్థితి ఎలా ఉండేది.. తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని తీర ప్రాంతంలో కోత నివారణకు పలు సూచనలు చేసింది. ఈ బృందం సూచనల మేరకు జియో ట్యూబ్‌లతో మాత్రమే దీనికి అడ్డుకట్ట వేయగలమని భావించి, ఇందుకు సంబంధించి చర్యలు ప్రారంభించారు. జియో ట్యూబుల్లో ఇసుక నింపి తీరం వెంబడి అమర్చుతారు. దీనివల్ల అలల ఉద్ధృతి తగ్గడమేగాకుండా తీరంలో ఉన్న ఇసుక కోతకు గురికాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా శాశ్వతంగా బీచ్ కోతను నివారించగలమని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది హూదూద్ సమయంలో తీరప్రాంతం కోతకు గురికావడంతో ఆర్కే బీచ్ వెంబడి తీర ప్రాంతంలో ప్రహరీ గోడ కూలిపోయింది. ఆ తరువాత కూడా ఆర్కే బీచ్‌లో కోత ఆగలేదు. మరోపక్క వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అంతర్జాతీయ నావికాదళ విన్యాసాలకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కురుసుర సబ్‌మెరైన్ ఉన్న చోట తీరం మరింత ఎక్కువగా కోతకు గురికావటంతో, ఆ ప్రాంతం నుంచే జియో ట్యూబులను అమర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఏది ఏమైనప్పటికీ బీచ్ కోత నివారణకు అధికారులు చర్యలు ప్రారంభించటంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. (చిత్రం) కోత నివారణకు ఏర్పాటు చేస్తున్న జియో ట్యూబులు