అంతర్జాతీయం

జర్మనీ ఛాన్సలర్ హత్యకు ప్రేగ్ లో కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేగ్: జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌ హత్యకు చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ లో జరిగిన కుట్రను అధికారులు భగ్నం చేసినట్టు తెలుస్తోంది. సాయుధుడైన ఓ వ్యక్తి ఆమె కాన్వాయ్‌లోకి ప్రవేశించేందుకు యత్నించాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు ప్రతినిధి జోసెఫ్ బొకన్‌ను ఉటంకిస్తూ 'మిర్రర్' వార్తా కథనం ప్రచురించింది. మెర్కెల్‌ చెక్‌ రిపబ్లిక్‌ ప్రధాని బోహుస్లావ్‌ సోబోట్కాను కలవడానికి ప్రేగ్ వచ్చారు. ఆమె విమానాశ్రయం నుంచి నగరంలోకి వెళ్తుండగా నల్లని బెంజ్‌ కారు కాన్వాయ్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ ఆ కారు డ్రైవర్‌ ఖాతరు చేయలేదు. కాల్చిపారేస్తామని పోలీసులు హెచ్చరించేసరికి అతడు కారు ఆపి కిందకు దిగాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.