అనంతపురం

సత్యసాయి సన్నిధిలో ఘనంగా శివరాత్రి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, మార్చి 7: భగవాన్ సత్యసాయి బాబా సన్నిధిలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రం అఖండ భజన కార్యక్రమంతో శివరాత్రి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ప్రశాంతినిలయం సాయి కుల్వంత్ సభా మందిరంలో దేశ, విదేశీ సాయి భక్తులు పాల్గొని తమ ఆరాధ్య దైవం సత్యసాయి మహాసమాధి చెంత శివరాత్రి వేడుకలను ఎంతో భక్త్భివంతో జరుపుకుంటున్నారు. సత్యసాయి బాబా ప్రతిష్ఠించిన శివలింగానికి రుద్రాభిషేకం, అభిషేక పూజలు నిర్వహించారు. సాయికుల్వంత్ సభామందిరంలో మహాశివరాత్రి పర్వదినం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రత్యేక అలంకరణలతో దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. సాయి విద్యార్థులు మహాశివరాత్రి విశిష్టతను, సత్యసాయి బాబా దివ్య వైభవాన్ని కీర్తిస్తూ వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు సత్యసాయి గత వైభవాన్ని, శివరాత్రి పర్వదిన వేడుకల్లో బాబా మహిమలు, ఆత్మోద్భోవ లింగ సృష్టిని డిజిటల్ స్క్రీన్ ద్వారా వీక్షించి బాబా కృపకు పాత్రులయ్యారు. సత్యసాయి బాబా జన్మించిన పుట్టపర్తిలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.