కృష్ణ

విజయవాడ కేంద్రంగా నకిలీ నెయ్యి తయారీ సూత్రధారి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.40కోట్ల ఆస్తులు గుర్తింపు
విజయవాడ , నవంబర్ 24: నగరం కేంద్రంగా రాష్టవ్య్రాప్తంగా మార్కెట్‌లో చలామణి చేస్తున్న నకిలీ నెయ్యి తయారీ సూత్రధారిని పటమట పోలీసులు అరెస్టు చేశారు. గత ఎనిమిది సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా కల్తీ నెయ్యి తయారు చేస్తూ కోట్లు కూడబెట్టిన నిర్వహకుడు ఆవుల ఫణీంద్రకుమార్ అలియాస్ ఫణి రెండు రోజుల క్రితం పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇతన్ని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు పటమట సిఐ దామోదర్ తెలిపారు. నగరంలోని భారతీనగర్‌లో కార్యాలయం నడుపుతూ దీనికి అనుసంధానంగా కృష్ణాజిల్లా అడవినెక్కలం వద్ద కల్తీ నెయ్యి తయారీ ఫ్యాక్టరీతోపాటు, సింగ్‌నగర్ పోలీస్టేషన్ పరిథిలోని ఇందిరానాయక్‌నగర్‌లో మరో కల్తీ నెయ్యి తయారీ, ప్యాకింగ్ పరిశ్రమతోపాటు, పసుపు, కారం, దనియాల పొడి, మసాలా పొడులు సైతం నకిలీ తయారు చేస్తున్నట్లు దర్యాపుల్తో వెల్లడైంది. ఇప్పటికే కోట్ల రూపాయలు విలువ చేసే ఫ్యాక్టరీ మిషనరీతోపాటు, ఆస్తులు సీజ్ చేశారు. పరారీలో ఉన్న మరో కీలక నిందితుని కోసం గాలిస్తున్నట్లు సిఐ తెలిపారు. పటమట పోలీస్టేషన్ పరిథిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఐ కల్తీ నెయ్యి కుంభకోణం కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. గుంటూరు శ్రీనివాసనగర్‌కు చెందిన ఆవుల ఫణీంద్రకుమార్ అలియాస్ ఫణి (35) ప్రస్తుతం విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్టేషన్ పరిథిలోని శ్రీనగర్‌కాలనీలో నివాసముంటున్నాడు. తన బావ అనిల్‌కుమార్‌తో కలిసి గతంలో వన్‌టౌన్‌లోని ప్రియగోల్డ్ ఫుడ్స్ కంపెనీలో గుమస్తాగా పని చేశాడు. ఆతర్వాత ఇద్దరూ కలిసి 2007లో మాచవరంలో వంశీ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. ఆతర్వాత క్రమంలో సంస్థను సింగ్‌నగర్‌కు మార్చారు. ఈక్రమంలో నకిలీ నెయ్యి, కారం, పుసుపు, మసాలా పొడులు తయారీకి శ్రీకారం చుట్టారు. మార్కెట్‌లో లభించే బ్రాండెడ్ కంపెనీల పేర్లను అనుకరిస్తూ అలాంటి ప్యాకింగ్‌లు తయారు చేసి శ్రీనివాస, నందగోపాల్, నిందిని, శ్రీదుర్గా, లక్ష్మీ, వైష్ణవి తదితర పేర్లతో నకిలీ నెయ్యి, కారం పొడులు తయారీ చేసి మార్కెట్‌లో విక్రయిస్తూ కోట్లు కూడబెట్టారు. ఈ సొమ్ముతో పలుచోట్ల స్వంతంగా స్థిరాస్తులు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 40కోట్ల వరకు కూడబెట్టినట్లు పోలీసులు తెలిపారు. విజయవాడతోపాటు నూజివీడు, కాకినాడ, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతోపాటు హైదరాబాద్‌తో సహా ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఏజెన్సీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నకిలీ వ్యాపారాన్ని విస్తరింపచేశాడు. నందిగామ కమర్షియల్ ట్యాక్సు డివిజన్ నుంచి ఐశ్వర్య ట్రేడర్స్ పేరుమీద అనుమతులు పొంది అడవినెక్కలంలో కల్తీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఇటీవల టాస్క్ఫోర్స్ ఈ కేంద్రంపై జరిపిన దాడుల్లో కల్తీ కుంభకోణం వెలుగు చూసింది. దీంతో ఇప్పటికే సూపర్‌వైజర్ బొడ్డు లక్ష్మీప్రవీణతోపాటు గుడిసె శ్రీను, మాదుగుల రాజేష్‌రెడ్డిలను అరెస్టు చేసిన పోలీసులు సూత్రధారి ఫణిని అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. పరారీలో ఉన్న బావ అనిల్‌కుమార్‌తోపాటు సురేష్, శ్రావణ్ అనే మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 150మంది ట్రేడర్స్ ఈవ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని సిఐ తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఎస్‌ఐ శేషారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.