హైదరాబాద్

జిహెచ్‌ఎంసి ఎన్నికలపై వాడివేడిగా అఖిలపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పునర్విభజన, బిసి ఓటర్ల గుర్తింపుపై విపక్షాల అభ్యంతరం
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
హైదరాబాద్, డిసెంబర్ 5: మహానగర పాలక సంస్థ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతోంది. ఇప్పటికే వివిధ కీలకమైన ప్రక్రియలను పూర్తి చేసిన గ్రేటర్ అధికారులు బిసి ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కారం, ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై శనివారం ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశం వాడివేడిగా జరిగింది. ఇదివరకు మాధిరిగానే విపక్షాలైన కాంగ్రెస్, బిజెపి, టిడిపి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు డివిజన్ల పునర్విభజన సక్రమంగా జరగలేదని, అలాగే బిసి ఓటర్ల గుర్తింపు కూడా శాస్ర్తియంగా కొనసాగలేదని తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతేగాక, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు కూడా డివిజన్ల పునర్విభజన సక్రమంగా జరగలేదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు, మాజీ మంత్రులు మర్రి శశిధర్‌రెడ్డి, దానం నాగేందర్‌లు సమావేశంలో పరోక్షంగా అంగీకరించారు. నేతల అభ్యంతరాలు, సందేహాలను స్వీకరించిన కమిషనర్ జనార్దన్‌రెడ్డి వారినుద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ తుది అంశం వరకు, నోటిఫికేషన్ జారీ అయ్యే వరకు కూడా ఓటరు జాబితాలోని తప్పులను సరి చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని ఓటర్లను తొలగించారని, బిసి ఓటర్ల గణన నిర్వహణపై స్పందిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఓటర్లు, బిసిలు తగిన ఆధారాలతో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చునని సూచించారు. ఎన్నికల్లో బిసిలకు మూడో వంతు సీట్లు రిజర్వు చేయటం జరుగుతోందని, దీనిలో భాగంగా 50 సీట్లను బిసిలకు కేటాయిస్తామని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ జనిభాను పరిగణలోకి తీసుకును వారి వార్డుల రిజర్వేషన్లను నిర్ణయిస్తామని తెలిపారు. బిసి ఓటర్ల గణనను ఇంటింటికి తరిగి చేపట్టామని, ఓటర్ల ఆధారంగా వార్డుల రిజర్వేషన్లను నిర్ణయించనున్నట్లు కమిషనర్ తెలిపారు. బిసి గణన సక్రమంగా, పారదర్శకంగా జరిగేందుకు గాను మొట్టమొదటి సారిగా సంతకంతో పాటు సెల్‌నెంబర్లను సేకరించామని స్పష్టం చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు ఎన్నికల ఏర్పాట్లు తాము పూర్తి చేస్తామని తెలిపారు. బిసి ఓటర్ల తుది జాబితాను సైతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలన్న సూచనను ఎన్నికల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

గందరగోళంగా బిసి ఓటర్ల గుర్తింపు
- మాజీ మంత్రి శశిధర్‌రెడ్డి
బిసి ఓటర్ల గుర్తింపు అయోమయం, గందరగోళంగా జరిగింది. మురళీధర్‌రావు కమీషన్, సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన బిసిల సంఖ్యకు జిహెచ్‌ఎంసి చేపట్టిన బిసి గణనకు చాలా వ్యత్యాసం ఉంది. నేటికీ కూడా సకల కుటుంబ సర్వేలో వెల్లడైన బిసి జనాభా వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచారు. ఇప్పటికైనా సవరించాల్సిన అవసరముంది.
పునర్విభజన సక్రమంగా జరగలేదు
- గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డివిజన్ల పునర్వినజన ప్రక్రియ సక్రమంగా, నిబంధనల ప్రకారం జరలేదు. డివిజన్ల సరిహద్దులు సక్రమంగా పాటించలేదని, కొన్ని డివిజన్లలో ఎక్కువగా, మరికొన్ని డివిజన్లలో చాలా తక్కువ జనాభాతో వీటిని ఏర్పాటు చేశారు. దీనికి తోడు బిసి ఓటర్ల గణనలో చోటుచేసుకున్న పొరపాట్లను వెంటనే సరి చేయాలి.
పోలింగ్ స్టేషన్లలో కనీస వసతులు కల్పించాలి
- తెరాస ఎమ్మెల్సీ ప్రభాకర్
మొత్తం 150 డివిజన్లలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలి. ఎపుడూ ఎన్నికలు జరిగినా, పోలింగ్ స్టేషన్ల ఆవరణలో వృద్దులు, వికలాంగులు, మహిళలకు తగిన సౌకర్యాలుండటం లేదు. ఫలితంగా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. ఈ సారైన జిహెచ్‌ఎంసి అధికారుల ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వౌలిక వసతులను ఏర్పాటు చేయాలి.
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
- తెరాస ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి
జిహెచ్‌ఎంసి ఎన్నికలు పారదర్శకంగా వివాదరహితంగా నిర్వహించాలి. ఎన్నికల సంఘం సూచించే నియమ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయటంతో పాటు సమర్థవంతంగా నిర్వహించినపుడే నగర ప్రతిష్ట పెరుగుతోంది.
ఎన్నికల వాయిదాకు వ్యతిరేకం
-మజ్లిస్ ఎమ్మెల్సీ జాఫ్రి
జిహెచ్‌ఎంసి ఎన్నికలు వాయిదా వేయాలన్న డిమాండ్‌ను తాము వ్యతిరేకిస్తున్నాం. గత కొద్ది దశాబ్దాల నుంచి గమనిస్తే జిహెచ్‌ఎంసి ఎన్నికలు కోర్టు ఆదేశాల మేరకే జరుగుతున్నాయి. అందుకే కోర్టు ఆదేశాల ప్రకారం జరగనున్న జిహెచ్‌ఎంసి ఎన్నికల నిర్వహణను వాయిదా వేయటం కుదరనందున కనీసం పోలింగ్ కేంద్రాల ఎంపికలో ఏర్పడ్డ గందరగోళాన్ని తొలగించాలి.
సందేహాలను నివృత్తి చేయాలి
-బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
జిహెచ్‌ఎంసి ఎన్నికల నిర్వహణలో డివిజన్ల పునర్విభజన, బిసి ఓటర్ల గణన, ఓటర్ల తొలగింపు తదితర అంశాలపై వివిధ రాజకీయపార్టీల నేతలు, ప్రజల్లో ఏర్పడిన సందేహాలన్నింటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులదే! ఆ తర్వాతే ఎన్నికలను నిర్వహిస్తే సబబుగా, న్యాయంగా ఉంటుంది.
అంతా అస్తవ్యస్తం
-టిడిపి ఎమ్మెల్యేలు వివేక్, గాంధీ
జిహెచ్‌ఎంసి ఎన్నికల నిర్వహణలో భాగంగా వార్డుల పునర్విభజన మొదలుకుని, బిసి ఓటర్ల గుర్తింపు ప్రక్రియ వరకు అంతా అస్తవ్యస్తంగానే జరిగింది. పోలింగ్ కేంద్రాలు ఎంపిక కూడా సక్రమంగా జరగలేదు. కొన్ని పోలింగ్ స్టేషన్లలో రెండు డివిజన్ల ఓటర్లు ఓటు వేయాల్సిన విధంగా ఉన్నాయి.
డివిజన్ల పేర్లు ఎందుకు మార్చారు
-సిపిఐ నేత డా.సుధాకర్
పునర్విభజన చేస్తూనే డివిజన్ల పేరు ఎందుకు మార్చారు. గతంలో చేపట్టిన పునర్విభజనలో పెట్టిన పేర్లను విచ్చలవిడిగా మార్చటం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖంగా ఉన్న వీధుల పేర్లను మార్చి, ప్రాధాన్యత లేని, ప్రజలు గుర్తుపట్టని పేర్లను వార్డులకు పెట్టారు.