హైదరాబాద్

పౌరసేవలు.. అభివృద్ధి భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్‌ను సందర్శించిన ఐఏఎస్‌ల బృందం కితాబు వసతులను మరింత మెరుగుపర్చాలన్న కమిషనర్
హైదరాబాద్, డిసెంబర్ 21: దేశంలో నేడు ప్రతి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీలు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఘన వ్యర్థాల నిర్వహణ అని కమిషనర్ డా. బి. జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం మహానగర పాలక సంస్థను 51 మంది ఐఏఎస్‌ల అధికారుల బృందం సందర్శించి. ఇటీవల జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, రెవెన్యూ వసూళ్లలో సాధించిన ప్రగతి, సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోని అన్ని మున్సిపాల్టీల్లో ప్రజలకు కావల్సిన వౌలిక సదుపాయాలైన మంచినీరు, డ్రైనేజీ, సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ తదితర అంశాల కల్పనకు ప్రతి కార్పొరేషన్ కనీసం రూ. 32లక్షలకు వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనాల్లో తేలిందని, దేశంలోని అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ఇంత భారీ స్థాయిలో నిధులు కేటాయింపులు ప్రభుత్వానికి సాధ్యం కాదని, అంతర్గతంగా నిధులు పెంపొందించుకోవటం స్థానిక సంస్థల స్థాయికి మించిందని అన్నారు. పౌర సేవల కల్పనకు గాను పన్నులను పకడ్బందీగా వసూలు చేచయటం ద్వారా అంతర్గతంగా వనరులను పెంపొందించుకోవల్సిన అవసరం ఉందని అన్నారు. నగరాల్లో గృహవసరాలకు ఉపయోగిస్తున్న నీటిని రీ సైక్లింగ్ చేయటం కేవలం 20శాతం మాత్రమే ఉందని, ఈ నీటిని ట్రీట్‌మెంట్ చేయటం ద్వారా ఉద్యానవనాల నిర్వహణ, సోషల్ ఫారెస్టు నిర్వహణకు వినియోగించవచ్చునని సూచించారు. నగరాల్లో భవన నిర్మాణ వ్యర్థాల నిర్మూలన పెద్ద సమస్యగా మారుతోందన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ నగరంలో ఓ కొత్త ప్రయోగాన్ని చేస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణంలో ఉపయోగపడే ఇటుకలు, మట్టి, టైల్స్ తదితర పదార్థాలను తయారు చేసి సీ అండ్ డి ప్లాంట్‌ను నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ విధమైన సీ అండ్ డి ప్లాట్ కేవలం న్యూ దిల్లీలో మాత్రమే ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించేందుకు ఇంటింటికి రెండు డస్ట్‌బిన్లను చొప్పున మొత్తం 44లక్షల బిన్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ఉచితంగా డస్ట్‌బిన్లను పంపిణీ చేయటం దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టలేదని వివరించారు. అభివృద్ధి, వౌలిక వసతుల నిర్వహణతో పాటు పట్టణాల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు మెప్మా ద్వారా తీసుకున్న కార్యక్రమాలు సత్పలితాలను ఇచ్చాయని, ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వం కూడా స్వీకరించిందని వివరించారు. అధికారుల బృందంలోని సీనియర్ ఐఏఏస్ అధికారి రాజస్థాన్‌కు చెందిన రతన్ లహోటి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, రెవెన్యూ, అభివృద్థి తదితర కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు స్పూర్తిదాయకంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ సందర్భంగా నగరంపై కమిషనర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను అధికారులెంతో ఆసక్తితో తిలకించారు.