రాష్ట్రీయం

అభ్యర్థుల వ్యయ పరిమితి రూ. 2లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిహెచ్‌ఎంసి ఎన్నికలపై కమిషనర్ నాగిరెడ్డి ప్రకటన

హైదరాబాద్, డిసెంబర్ 29: దేశంలో అయిదవ మహానగరంగా పేరుగాంచిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం వివిధ రాజకీయపార్టీల నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయం రూ. 2లక్షలకు మించరాదని వెల్లడించారు. ఇక నామినేషన్ల డిపాజిట్ల మాటకొస్తే ఎస్సీ,ఎస్టీలకు రూ. 2500, ఓసి, బిసిలకు రూ. 5వేలను డిపాజిట్‌గా నిర్ణయించినట్లు వివరించారు. కోర్టు విధించిన జనవరి 31 గడువులోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వార్డుల పునర్విభజన వంటి కీలకమైన ప్రక్రియలు పూర్తి చేసినట్లు తెలిపారు. వార్డుల రిజర్వేషన్ల ప్రకటనే తరువాయి ఎన్నికల ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రేటర్‌లోని మొత్తం 150 డివిజన్లలో ఒక్కోదానికి ఒక రిటర్నింగ్ అధికారి, ఓ వ్యయ పరిశీలకుడ్ని నియమించినట్లు తెలిపారు. మొత్తం లక్ష మంది సిబ్బంది సేవలను ఎన్నికల్లో వినియోగించనున్నట్లు తెలిపారు. గ్రేటర్‌లోని మొత్తం 7750 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఎన్నికలకు గాను పదివేల ఇవిఎంలను వినియోగించనున్నట్లు, అదనంగా మరో రెండు వేల ఇవిఎంలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఇవిఎంల తొలి తనిఖీ పూర్తి చేయటం జరిగిందని వివరించారు. ఈ సారి ఎన్నికలు మరింత పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో మరీ అత్యల్పంగా పోలింగ్ జరిగితే ఆ ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచార వ్యయాన్ని మరో 2 లక్షలు పెంచాలని రాజకీయపార్టీల నుంచి వినతులు, సూచనలు, సలహాలు అందినట్లు, వాటిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.