తెలంగాణ

యువతి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: మండల కేంద్రమైన నేరేడుగొండలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అఖిల (17) తన గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండడాన్ని శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు కనుగొన్నారు. ఎప్పటిలాగే గురువారం రాత్రి ఆమె నిద్రపోయింది. శుక్రవారం ఉదయం ఎంతసేపటికీ ఆమె లేవకపోవడంతో ఈ విషయం బయటపడింది. వేరే కులానికి చెందిన యువకుడిని ఆమె ప్రేమిస్తోందని స్థానికులు చెబుతున్నారు. గొంతు నులిమి ఆమెను హత్య చేసినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారం నచ్చక కుటుంబ సభ్యులే ఈ అకృత్యానికి పాల్పడ్డారా? లేక విషం తీసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.