గుంటూరు

సాగర్ జలాశయానికి మరో నాలుగు టీఎంసీల నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, ఏప్రిల్ 15: శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్ జలాశయానికి మరో నాలుగు టీఎంసీల నీటి విడుదలకు కృష్ణానది జలాల యాజమాన్య మండలి అనుమతించింది. ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పదిరోజులుగా శ్రీశైలం ప్రాజెక్టు రివర్‌స్లూయిట్ గేటు ద్వారా విడుదల చేస్తున్న నీటిని కొనసాగిస్తున్నారు. నాగార్జున సారగ్ ఆయకట్టు పరిధిలోని జిల్లాలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో ఈ నెల మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాల నిమిత్తం 6.5 టీఎంసీల విడుదలకు అనుమతి రావడంతో విద్యుత్ ఉత్పాదన ద్వారా 1.71 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు. ఈనెల ఐదో తేదీ నుండి శ్రీశైలంలోని రివర్‌స్లూయిట్ గేటును పది అడుగుల మేరకు పైకి ఎత్తి 4.7 టీఎంసీల నీటిని గురువారం వరకు విడుదల చేశారు. నేడు మరో నాలుగు టీఎంసీల నీటి విడుదలకు కెఆర్‌ఎంబీ నుండి అనుమతులు రావడంతో సాగర్ జలాశయానికి నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం నీటిమట్టం 790.70 అడుగులకు చేరుకుంది. ఇది 24.67టీఎంసీలకు సమానం. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయానికి 6114 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.