గుంటూరు

సిసిఐ పత్తి కొనుగోళ్ల అక్రమాలపై సిబిఐ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, నవంబర్ 8: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సిసిఐ పత్తి కొనుగోళ్ల అక్రమాలపై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు తీసుకున్న చర్యలకు సత్తెనపల్లి మార్కెట్‌యార్డు అధికారులు ముగ్గురు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ విషయం సత్తెనపల్లి ప్రాంతంలో మంగళవారం తీవ్ర సంచలనం కలిగించింది. సిసిఐ పత్తి కొనుగోళ్ల విషయంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ఒకేసారి 26 మందిపై సస్పెన్షన్ వేటు వేసింది. సత్తెనపల్లిలో పనిచేసే ముగ్గురిపై వేటుపడడం చర్చనీయాంశం అయింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ యార్డులో ఏర్పాటుచేసిన సిసిఐ కేంద్రం ద్వారా రైతుల వద్ద నుండి 1,99,589 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపారు. అంతేగాక దీనివల్ల 3,132 మంది లాభ పడ్డారని లెక్కలు తేల్చారు. అయితే ఈ వ్యవహారంలో యార్డు సిబ్బంది రైతులను మోసగించి రవాణా చార్జీల పేరుతో అక్రమ వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. యార్డు అధికారులు, బయ్యర్లు కుమ్మకై భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు ఉన్నాయి. రైతుల నుండి ఫిర్యాదులు అందుకున్న విజిలెన్స్ అధికారులు విచారణకు ఆదేశాలు జారీచేశారు. వీటిపై విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన విచారణలో వాస్తవాలు వెలుగుచూడడంతోపాటు, అధికారుల చేతివాటం వంటి విషయాలు బయటపడ్డాయి. విజిలెన్స్ అధికారులు అక్రమార్కులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. రైతుల వద్ద నుండి పత్తిని కేవలం 3 వేలకు కొనుగోలు చేసి దానిని మిల్లుకు 4 వేలకుపై అమ్మగా వచ్చిన సొమ్మును తమ ఖాతాల్లో వేసుకున్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తుది దశకు చేర్చారు. ఈ ముక్కరి అధికాకులపై సిబిఐ అధికారులు తమకొరడాను ఝుళిపించారు. యార్డులో పనిచేస్తున్న ఒక సూపర్‌వైజర్ తనకున్న పలుకుబడిని ఉపయోగించి రైతుల వద్ద నుండి తనకు తోచినరీతిలో అక్రమంగా డబ్బును వసూలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
వేటుపడింది వీరిపైనే....
సత్తెనపల్లి యార్డులో పనిచేస్తున్న కార్యదర్శి ఎఆర్ రహమాన్, సూపర్‌వైజర్లు భాస్కర్‌రెడ్డి, భవానీప్రసాద్‌లను ప్రభుత్వం విధులనుండి సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఈ విషయం బయటకు రావడంతో స్థానిక యార్డు అధికారులు నోరు మెదపడంలేదు. సంబంధిత అధికారులు సమాచారం ఇచ్చేందుకు అందుబాటులోలేరు. సిబిఐ అధికారులు సిసిఐ కార్యాలయానికి వెళ్లి ఆనాడు పనిచేసిని అధికారులను, బయ్యర్లను విచారిస్తున్నట్లు సమాచారం. వీరి దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఎప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని స్థానిక అధికారులు, సిబ్బంది బెంబేలెత్తుతున్నారు. ఈ అక్రమార్కులను ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చునని ఇక్కడ ప్రచారం జరుగుతోంది.