గుంటూరు

శరీర దారుఢ్యాన్ని పెంచే క్రీడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్లపాలెం, నవంబర్ 18: విద్యతోపాటుగా విద్యార్థులు క్రీడలలో పాల్గొనటం ద్వారా శారీరక ధారుడ్యం పెం పొందుతుందని ఎంపిపి మాడా వెంకటరత్నం అన్నారు. మండలంలోని యాజలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో కేలో ఇండి యా పోటీలను శుక్రవారం ఎంపిపి ప్రారంభించారు. ఈసందర్భంగా విద్యార్థులకు 100, 400 మీరట్ల రన్నిం గ్, షార్ట్‌పుట్, లాంగ్‌జంప్, ఖో-ఖో, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈపోటీలలో ప్రతిభ కనబరించిన వారిని ఈ నెల 21,22న బాపట్లలో జరుగు నియోజవర్గ స్థాయి పోటీలకు పంపుతామని ఎంపిడిఓ శివకుమారి తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటిసి గుంపుల కన్నయ్య, ఇఓపిఆర్‌డి శరత్‌బాబు, ఎంఇఓ కెవి రమేష్, హెచ్‌ఎం రమాదేవి, ఎంపిటిసిలు తన్నీరు పద్మ, పోతురాజు వెంకటేశ్వరమ్మ, మాడా శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ లౌవ్‌కుమార్, పిఇటిలు సద్గుణరావు, వెంకటేశ్వరరావు, తుమ్మా బుచ్చిరెడ్డి, రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు
స్థానిక శాఖాగ్రంథాలయంలో వా రోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండలంలోని పాఠశాలల విద్యార్థుల కు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. వ్యాసరచనలో ఎస్‌కె షహీనా, పి శిరీష, ఎన్ సా యికృష్ణ యాదవ్, వక్తృత్వంలో ఎస్‌కె నౌషిక్, శివరామకృష్ణారెడ్డి, డి తేజోశ్యామల, చిత్రలేఖనంలో ఎస్‌కె షర్మిల, పి జనార్ధనరెడ్డి, పి అనంతకుమార్ ప్ర థమ, ద్వితీయ, తృతీ య స్థానాలలో నిలిచినట్లు వీరికి 30న ము గింపు సభలో బహుమతులు అందజేస్తామని గ్రంథాలయాధికారి రెబ్బా శ్రీనివాసరావు తెలిపారు.