గుంటూరు

టిడిపితోనే మహిళా సాధికారత సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలకలూరిపేట, నవంబర్ 18: మహిళల అభ్యున్నతి కోసం తెలుగుదేశం ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో చంద్రన్న చేయూత పథకం కింద రెండోవిడత 32,351 మందికి స్వయం ఉపాధి మహిళా గ్రూపులకు 9 కోట్ల 72 లక్షల రూపాయలను అందజేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో నూతన ప్రణాళికలను చేపట్టి మహిళా సాధికారత కోసం కృషిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్ నెల్లూరి సదాశివరావు, పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, యడ్లపాడు మండల అధ్యక్షుడు ముద్దన నాగేశ్వరరావు, టిడిపి నాయకులు రమేష్, తేళ్ల సుబ్బారావు, అంబటి సోంబాబు, బ్రహ్మస్వాములు తదితరులు పాల్గొన్నారు.

శివాలయంలో లక్ష బిళ్వార్చన, కుంకుమార్చన
మంగళగిరి, నవంబర్ 18: శివుని జన్మనక్షత్రం (ఆరుద్ర)ను పురస్కరించుకుని శుక్రవారం స్థానిక శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో అన్నాభిషేకం, లక్ష బిళ్వార్చన, లక్ష కుంకుమార్చన, మహాన్యాసక పూర్వక, ఫలరస, పంచామృత, గంగోదక, ఏకాదశి రుద్రాభిషేక, శివకల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి మహాగణపతిపూజ, అఖండ దీపారాధన, గోపూజ, నవగ్రహ అష్టదిక్పాలక కలశ స్థాపన, రుద్రాభిషేకాలు, మల్లేశ్వర స్వామికి ఏకరుద్ర అన్నాభిషేకం, సాయంత్రం లక్ష కుంకుమార్చన, బిళ్వార్చన, శివపార్వతుల కల్యాణం మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చకులు మహేష్‌కుమార్ శర్మ, శ్యామసుందర శాస్ర్తీ పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి. వాసవి సేవాసమితి అధ్యక్షులు మాజేటి సూర్యవేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.