గుంటూరు

మహిళాభ్యుదయంతోనే దేశ సమగ్రాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), నవంబర్ 18: మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఆధునిక యాంత్రిక యుగంలో మన భారతదేశం అన్ని రంగాల్లో సముజ్వల ప్రగతిని మరింతగా సాధించాలంటే నారీలోకం శక్తివంతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రా మహిళా సభ కళాశాల, హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిడమర్తి నిర్మలాదేవి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని ఎఎల్‌బిఇడి కళాశాల ఆవరణలో 18వ గుంటూరు పుస్తక మహోత్సవంలో భాగంగా అరసం ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన అమరజీవి కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కార సభలో ఈ యేటి సత్కారాన్ని అందుకున్న అనంతరం ఆమె సాహితీ ప్రియులనుద్దేశించి ప్రసంగించారు. సభకు అరసం జాతీయ కార్యదర్శి, సీనియర్ న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. నిర్మలాదేవి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కుటుంబాన్ని, సమాజాన్ని సమున్నతంగా తీర్చిదిద్దిన మహిళ చాలాకాలం వంటింటికే పరిమితమైందని, అయితే దేశం, ప్రపంచంలో వచ్చిన మార్పుల కారణంగా స్ర్తి ఔన్నత్యం, ఆమె పాత్ర బహుముఖంగా విస్తరించిందన్నారు. ఆనాటి మహాకవులతో పాటుగా, గురజాడ, కందుకూరి వీరేశలింగం, శ్రీశ్రీ, కృష్ణశాస్ర్తీ వంటి స్వాభిమాన సహజకవులు స్ర్తి లోకానికి అందించిన సేవలను ఆమె కొనియాడారు. అధ్యక్షత వహించిన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కొండేపూడి శ్రీనివాసరావు బహుముఖీయమైన ప్రజ్ఞాశాలి అని, పోలెండ్ దేశ పునర్నిర్మాణంలో శ్రీనివాసరావు పాత్ర వెలకట్టలేనిదన్నారు. కొండేపూడి జయంత్ 10,116 రూపాయల నగదు, జ్ఞాపికతో నిర్మలాదేవిని సత్కరించగా, కథా రచయిత పెనుమాక నాగేశ్వరరావు, అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ సాహితీ సేవలను కొనియాడారు. సభలో పుస్తక మహోత్సవ కన్వీనర్ శివనాగేశ్వరరావు, అరసం ప్రతినిధి ఎఎంఆర్ ఆనంద్, ప్రముఖ కవి డాక్టర్ పాపినేని శివశంకర్, గూడవల్లి నాగేశ్వరరావు, శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కిటకిటలాడిన ఆంధ్రాబ్యాంకు
దుగ్గిరాల, నవంబర్ 18: దుగ్గిరాల ఆంధ్రాబ్యాంకులో మూడు రోజుల అనంతరం శుక్రవారం నగదు చెల్లింపులు జరుగుతుండటంతో ఖాతాదారులతో కౌంటర్లు కిటకిటలాడాయి. ఖాతాదారులు ఒక్కసారిగా నగదుకోసం పోటీ పడటంతో రద్దీ ఏర్పడింది. ఒక్కొరికి 2500చొప్పున 10లక్షల రూపాయలు చెల్లింపులు జరిపినట్లు మేనేజర్ ఎస్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. మూడురోజులుగా పాతనోట్లు ఖాతాలలో జమ చేసుకునేందుకు కౌంటర్లు పెట్టుకొని కూర్చున్న సిబ్బంది నగదుకోసం వచ్చే ఖాతాదారులకు నగదు చెల్లింపులు లేక పోవటంతో భయాందోళనలకు గురయ్యారు. మూడు రోజుల తరువాత నగదు చెల్లింపులకు ఉపక్రమించటంతో స్థిమితపడ్డారు.