గుంటూరు

సమస్యల సత్కర పరిష్కారమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 18: జిల్లాలో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని జిల్లా సంయుక్త కలెక్టర్ క్రితికా శుక్లా స్పష్టంచేశారు. శుక్రవారం గుంటూరు సంయుక్త కలెక్టర్‌గా కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలను స్వీకరించారు. భర్త హిమాంశు శుక్లా రాష్ట్ర పర్యాటక శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె ఆరు నెలలు శిక్షణ అనంతరం తొలుత చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్‌గా బాధ్యతలను నిర్వహించారు. అనంతరం గుంటూరు సంయుక్త కలెక్టర్‌గా నియమితులయ్యారు. గత నాలుగు నెలలుగా జిల్లా సంయుక్త కలెక్టర్ పదవి ఖాళీగా ఉన్నందున జిల్లా పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆ స్థానాన్ని భర్తీ చేసింది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జెసి క్రితికా మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా రెవెన్యూ, పౌర సరఫరాల అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానని చెప్పారు. అంతేకాకుండా జిల్లాలోని అన్ని మండలాల్లోనూ పర్యటించి, అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలతో సత్సంబంధాలను కొనసాగిస్తామని, తద్వారా ప్రజలు కూడా వారి సమస్యలను తనకు స్వయంగా తెలియజేసే అవకాశం కలుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ప్రతి కార్యక్రమంలోనూ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నందున జిల్లాలో చేపట్టే కార్యక్రమాలను పటిష్ఠంగా అమలు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని తెలిపారు. గుంటూరు పెద్ద జిల్లా అని, ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన జిల్లాలో సంయుక్త కలెక్టర్‌గా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలతో కలిసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని సంయుక్త కలెక్టర్ క్రితికా శుక్లా వెల్లడించారు. జిల్లా రెవెన్యూ అధికారి కొసనా నాగబాబు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, వివిధ శాఖలకు చెందిన అధికారులు సంయుక్త కలెక్టర్ క్రితికా శుక్లాను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.