గుంటూరు

బాలికలు సింధూను ఆదర్శంగా తీసుకొని క్రీడలలో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, నవంబర్ 22: జాతీయ, అంతర్జాయ స్థాయిలో రాణిస్తూ దేశం, రాష్ట్రానికి పేరుప్రఖ్యాలు తీసుకువస్తున్న సింధూను నేటి బాలికలు ఆదర్శంగా తీసుకొని క్రీడలలోనూ రాణించాలని ఒన్‌టౌన్ ఎస్‌ఐ రాంబాబు పేర్కొన్నారు. స్థానిక దేవీచౌక్‌లోని షారోన్ హైస్కూల్ వార్షికోత్సవ క్రీడలు మంగళవారం లాంఛనంగా ప్రారంభమైయ్యాయి. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్‌ఐ క్రీడాకారులను వందనం స్వీకరించి, పరిచయం అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు కేవలం విద్యనోనే కాకుండా క్రీడల్లోనూ పాల్గొంటూ శారీరకంగా మానసిక ఉల్లాసాన్ని పొందాలని సూచించారు. నేడు భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ క్రీడాకారులకు ఎంతో గౌరవం లభిస్తోంది భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఉంటాయని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో లూథరన్ యూపి పాఠశాల హెచ్‌ఎం టి రాజకుమారి, స్కూల్ డైరెక్టర్ శ్యామ్‌బెనర్జీ, ప్రిన్సిపాల్ మేరీ బెనర్జీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈసందర్భంగా విద్యార్థులు నిర్వహించి మార్చ్ఫాస్ట్ పలువురిని విశేషంగా ఆకర్షించింది.

క్రీడల ద్వారా దేహదారుఢ్యం, మానసికోల్లాసం
అమరావతి, నవంబర్ 22: ప్రతిఒక్క విద్యార్థి విద్యతో పాటుగా క్రీడలను కూడా అలవాటు చేసుకుంటే దేహదారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, మానసికోల్లాసం లభిస్తుందని ఆర్‌వివిఎన్ కళాశాల కరస్పాండెంట్, సెక్రటరి, వ్యాపారవేత్త చేకూరి జాజిబాబు అన్నారు. మంగళవారం స్థానిక శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో మండల స్థాయి ఖేల్ ఇండియా క్రీడాపోటీల ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఎంఇఒ తెనాలి ఇందిర అధ్యక్షత వహించారు. జాజిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడల కోసం ఎన్నో నిధులు వెచ్చిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సభలో ఎండిఒ వై రాజగోపాల్, హైస్కూల్ హెచ్‌ఎం కొల్లి లక్ష్మీనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు జయరామ్, అనూరాధ, కె సుజాత తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని ఖోఖో, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. మండల స్థాయి పోటీల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలతో పాటు అథ్లెటిక్స్ పోటీలు కూడా నిర్వహించారు. గ్రామాల వారీగా నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎండిఒ రాజగోపాల్ తెలిపారు.