గుంటూరు

గుంటూరుతో బాలమురళి అనుబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), నవంబర్ 22: కర్ణాటక సంగీత మహా విద్వాంసుడు పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణకు గుంటూరుతో విడదీయరాని అనుబంధం ఉంది. ఒకానొకప్పుడు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా ఆయన నిర్వహించిన కచేరిలు సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్రవేశాయి. ఇప్పటికీ బాలమురళీ గాత్రం గుంటూరు సాహితీ ప్రియుల్లో గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. ఆయన హఠాన్మరణంతో సంగీతప్రియులు, రసాస్వాదకులు, సాహిత్యాభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గాయత్రీ మహిళా సంగీత సన్మండలి, నాగార్జున సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో ఎన్నోసార్లు స్వరరాజుకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కనకాభిషేకం చేశారు. వాగ్గేయకారుడుగా భారతరత్నకు అన్ని అర్హతలు కల్గిన సంగీత సామ్రాట్ బాలమురళీకృష్ణ అని అవగాహన సంస్థ ఉపాధ్యక్షుడు పిఎస్ మూర్తి నివాళులర్పించారు. తెలుగునాట సంగీత ధ్రువతారగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ నిలిచారని ప్రస్తుతించారు. అవగాహన సంస్థతో పాటు నాగార్జున సాంస్కృతిక కేంద్రంలో మంగళవారం సంతాప సభలు నిర్వహించారు.

మరపురాని వ్యక్తి డాక్టర్ ఎంఎస్‌ఎస్
మంగళగిరి, నవంబర్ 22: నియోజకవర్గ అభివృద్ధికి తుది శ్వాస విడిచే వరకు అవిశ్రాంతంగా శ్రమించిన మాజీమంత్రి దివంగత డాక్టర్ ఎంఎస్‌ఎస్ కోటేశ్వరరావు ఈ ప్రాంత ప్రజలు మర్చిపోలేని నేతని మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి నివాళులర్పించారు. టిడిపి సీనియర్‌నేత, మాజీమంత్రి దివంగత డాక్టర్ ఎంఎస్‌ఎస్ కోటేశ్వరరావు 15వ వర్ధంతి సభ మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో జరిగింది. బస్టాండ్ ఎదుట గల ఎంఎస్‌ఎస్ విగ్రహానికి తొలుత చిరంజీవి, పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఎంఎస్‌ఎస్ విగ్రహం వద్ద పార్టీనేతలు జోహారు లర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చిరంజీవి మాట్లాడుతూ మంగళగిరి ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు కృష్ణాజలాలు రప్పించేందుకు ఎంఎస్‌ఎస్ చేసిన కృషి ప్రశంసనీయమని చిరంజీవి అన్నారు. మంగళగిరి వద్ద నిర్మించనున్న ఎయిమ్స్‌లో ఒక ముఖ్య భవనానికి ఎంఎస్‌ఎస్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. పట్టణ టిడిపి అధ్యక్షుడు నందం అబద్దయ్య, కార్యదర్శి వెలగపాటి విలియం, ఎఎంసి చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి, వైస్‌చైర్మన్ మనె్నం రమేష్, రూరల్ మండల టిడిపి అధ్యక్షుడు చావలి ఉల్లయ్య, గుత్తికొండ ధనుంజయరావు, బెల్లంకొండ నరసింహారావు, గాదె పిచ్చిరెడ్డి, పెంచలయ్య, కె శ్రీ్ధర్, బొంతల వెంకటేశ్వర్లు, వక్ఫ్‌బోర్డు మాజీచైర్మన్ ఎండి ఇబ్రహీం, వల్లభనేని సాయిప్రసాద్, గద్దె చంద్రయ్య, దుర్గారావు, గోవాడ రవి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.