గుంటూరు

డబ్బు తీసుకుని కేసులు తారుమారు చేస్తారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 4: అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆపదలో ఉండి న్యాయం చేయాలని మీ దగ్గరకు వస్తే పురుషుల వద్ద డబ్బులు తీసుకుని కేసులు తారుమారు చేస్తారా, మహిళలకు మీరిచ్చే ధైర్యం ఇదేనా అంటూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి పోలీసు అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. ఆదివారం నగరంలోని మహిళా పోలీసు స్టేషన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీచేశారు. అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న భాగోతమంతా కథలు, కథలుగా చెప్పుకుంటున్నారని అది ప్రత్యక్షంగా చూద్దామని ఇక్కడకు వచ్చానని అన్నారు.
బయట చెప్పెదంతా నిజమేనని అసలు ఏమాత్రం దయ, జాలి లేకుండా వ్యవహరిస్తూ చివరకు తాను చెప్పిన కేసుల్లో కూడా న్యాయం చేయకపోగా డబ్బులు అడిగారంటగదా అంటూ నిలదీశారు. మరి ఇంత కక్కుర్తి ఏంటని కష్టాల్లో ఉండి వచ్చిన వారిని కూడా వదిలిపెట్టరా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదని అన్ని మహిళా పోలీసు స్టేషన్లకు వెళ్లినప్పటికీ ఇంత ఘోరమైన పరిస్థితులు చూడలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్‌లో సిబ్బంది లేకపోవటం కేవలం ఎస్‌ఐ నాగకుమారి మాత్రమే ఉండటాన్ని ఆమె గుర్తించారు. రికార్డులను అడిగి తెప్పించుకుని పరిశీలించారు.
రికార్డుల నిర్వహణ కూడా సక్రమంగా లేకపోవటాన్ని గమనించిన ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా పోలీసు స్టేషన్‌లో ఏ ఒక్కరూ సరిగ్గా పనిచేయటం లేదని చివరకు బైయిల్‌కు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. స్టేషన్‌కు వచ్చిన వారిని అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతున్నారని తెలిసిందని ఈ విషయాలను ఇంతటితో వదలిపెట్టనని హోం మంత్రి, డిజిపిల దృష్టికి తీసుకెళతానని అవినీతి అధికారులను వదిలిపెట్టే ప్రశక్తేలేదని నన్నపనేని స్పష్టం చేశారు.