గుంటూరు

మతోన్మాద శక్తులను రెచ్చగొడ్తున్న బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 6: భిన్నజాతులు, భిన్నమతాలు కలిగిన భారతదేశం విశిష్ఠతను సంఘ పరివార్ శక్తులు, బిజెపి ప్రభుత్వం మతోన్మాదశక్తులను రెచ్చగొడుతూ, ప్రజల మధ్య భేదాభిప్రాయాలను సృష్టిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సిపిఐ నగర సమితి, దళితహక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా లౌకికవాద పరిరక్షణ కోరుతూ స్థానిక శంకర్‌విలాస్ నుండి లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత మైనార్టీలపై దాడులు పెరిగాయని, చివరకు గోమాంసం భక్షకులంటూ హత్యలు చేసే స్థాయికి నేడు సంఘపరివార్ శక్తులు తెగబడ్డాయన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే దళితులు వివక్షతకు గురవుతున్నారని వారు నివాసముండే ప్రాంతాల్లో తాగునీరు, శ్మశానాలు లేవని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఎ ఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు గని, నూతలపాటి చిన్న, కుమార్‌నాయక్, చెవుల పున్నయ్య, చేపర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే టిడిపి లక్ష్యం
మాచవరం, డిసెంబర్ 6: గ్రామాలను అభివృద్ధి చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. జనచైతన్య కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని వేమవరం , చెన్నాయపాలెం గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్లాది రూపాయలో నిర్మించిన పలు సీసీ రోడ్లు, అదనపు తరగతి గదులు, వైద్య ఉపకేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ గురజాల నియోజకవర్గ అభివృద్ధికి రూ.500కోట్లతో సియంని మెప్పించి నిధులు తెచ్చామని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉపయోగపడేలా చూస్తామన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ తాగునీటి సౌకర్యం కల్పిస్తామని, పేద ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను వారికి చేరేలా చూస్తామన్నారు. చెన్నాయపాలెం గ్రామంలో వైయస్సార్‌సీపీ అధ్యక్షులు జగమోహన్‌రెడ్డి సిమెంటు ప్యాక్టరీ నిర్మాణం చేపడతామని తక్కువ ధరలకే భూములను కొనుగోలు చేసి, ఇంత వరకు ఫ్యాక్టరీ నిర్మించకపోగా మాచర్ల ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డి కలిసి రైతులు, మహిళపై దాడి చేయించారని, గ్రామాల్లో వేట కొడవళ్ళు, నాటుబాంబులతో రైతులకు భయబ్రాంతులను చేసిన ఘనత ఆ పార్టీ నాయకులకే దక్కుతుందన్నారు. పులివెందల రాజకీయాల పల్నాడులో చేస్తే చూస్తూ ఊరుకోమని, జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలని పార్టీ కార్యకర్తలను ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అమర్‌నాధ్, ఏంపీపీ కత్తి సరోజినీ, వినోద్‌రెడ్డి, వై వెంకట్రావు, జె వెంకటేశ్వర్లు, అమీర్‌ఆలీ, కృష్ణ, రామారావు, రామయ్య, చౌదరి తదితరులు పాల్గొన్నారు.