గుంటూరు

ఆధునిక రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 6: విభిన్న కులాలు, మతాలు కలబోత అయిన భారత్‌కు ఏకత్వాన్ని అలవర్చి, దేశ ప్రజలను సమరసత వైపు మళ్లించిన ఆధునిక శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పలు రాజకీయ పక్షాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, వామపక్ష నేతలు కొనియాడారు. డాక్టర్ అంబేద్కర్ 60వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయా రాజకీయ పార్టీల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్‌కు ఘననివాళి అర్పించారు. లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసిపి జిల్లా కార్యాలయంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు డైమండ్‌బాబు, నాయకులు ఎం హనుమంతునాయక్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కొత్తా చిన్నపరెడ్డి, జెడ్పీటీసీ కోటేశ్వరరావు, నసీర్ అహ్మద్, ఏటుకూరు విజయసారధి, కంది సంజీవరెడ్డి, అంగడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. బ్రాడీపేటలోని బిజెపి అర్బన్ కార్యాలయంలో అర్బన్ అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు అధ్యక్షతన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళితమోర్చా నేత వై సుధాకర్‌బాబు, గిరిజన మోర్చా నేత తిరువీధుల జయచంద్ర, పరశా కోటేశ్వరరావు, మహిళా మోర్చ అధ్యక్షురాలు ఎన్ నాగమల్లేశ్వరి, కస్తూరి సైదులు, ఈదర శ్రీనివాసరెడ్డి, చెరుకూరి తిరుపతయ్య, అప్పిశెట్టి రంగారావు, వనమా నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నలబోతు వెంకట్రావ్ ఆధ్వర్యాన స్థానిక లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి రవిశంకర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె భగవాన్‌దాస్, కెసివై రాజేష్‌నాయుడు, ఆవుల రామకోటేశ్వరరావు, కనె్నగంటి మురళి, టి తాతారావు, ఎస్‌కె నజీర్, దానబోయిన శివయ్య, తదితరులున్నారు. పొగాకు బోర్డు కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత 60వ వర్ధంతి కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంప్లాయిస్ జనరల్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు డి బాలస్వామి, ఎ అప్పారావు, ఎక్స్‌టెన్షన్ మేనేజర్ బిఎన్ మిత్ర, ఆక్షన్ మేనేజర్ కె రవికుమార్, సూపరింటెండెంట్ సిహెచ్ మారుతిప్రసాద్, విజిలెన్స్ ఓఎస్‌డి పి రమేష్, అసిస్టెంట్ మేనేజర్ కెవి సుబ్బాయమ్మ, పి మీనాకుమారి, త్రివేణిబాయి, ఎన్ రత్నబాయమ్మ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కో ఆర్డినేటర్ సిరిపురపు శ్రీ్ధర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రాడీపేటలోని కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు కొర్రపాటి చెన్నకేశవులు, జొన్నలగడ్డ ఉదయభాను, నలపాటి గోపి, పిల్లి మేరి, కోడూరు బాబు, బ్రాహ్మణ సంఘ నేతలు వడ్లమూడి రాజా, మల్లాది శ్రీలక్ష్మి, వై శబరి తదితరులు పాల్గొన్నారు. అలాగే కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, నగర కార్యదర్శి జి మరియదాసు, నాయకులు సోమయ్య, హరిబాబు, ఎన్ నీలాంబరం, వి భగవాన్‌దాస్, బి లక్ష్మణరావు, కొండలరావు, మణికుమార్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు నేతృత్వంలో అరండల్‌పేటలోని ఫ్రంట్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఫ్రంట్ నేతలు పాగళ్ల ప్రకాష్, భూపతి సునీల్‌కుమార్, జొన్నలగడ్డ శ్రీకాంత్, ఉప్పలపాటి మునియ్య, జిపి సంకూరి రాజారావు, బోరుగడ్డ విల్సన్, లాం వర్ధనరావు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్దికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
రొంపిచర్ల, డిసెంబర్ 6: గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మంగళవారం మండలంలోని నల్లగార్లపాడు, వడ్లమూడివారిపాలెం గ్రామాలలో ఆయన పర్యటించారు. సుమారు రూ.39 లక్షల రూపాయల వ్యయంతో చేయనున్న పనులకు కోడెల శంకుస్థాపనలు చేశారు. నలగార్లపాడు గ్రామంలో రూ.8.50 లక్షల వ్యయంతో గతంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం పుననిర్మాణ కార్యక్రమానికి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే వడ్లమూడివారిపాలెం గ్రామంలో రూ.30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రక్షిత మంచినీటి పైపులైను, ఇతర మరమ్మత్తులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో స్పీకర్ డాక్టర్ కోడెల మాట్లాడుతూ గ్రామాలలో కమిటీలు వేసుకొని రక్షిత మంచినీటి పథకాలు సక్రమంగా పనిచేసేలా ప్రతి ఒక్కరూ చూడాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ది కార్యక్రమాలలో పోటీ పడాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిడివో కె మాథ్యబాబు, తహశీల్దార్ నాగమల్లేశ్వరరావు, ఎంపిపి మొండితోక రామారావు, మార్కెట్ యార్డు చైర్మన్ మెట్టు వెంకటేశ్వరరెడ్డి, టిడిపి నాయకులు ఇమ్మడిశెట్టి కాశయ్య, కోనేటి శ్రీనివాసరావు, చిరుమామిళ్ల బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.