గుంటూరు

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వారంపాటు నిరసన కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, ఏప్రిల్ 16: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈనెల 18నుండి 23వరకు మండల, డివిజన్, కలెక్టరేట్‌ల వద్ద వారంపాడు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాదిగ రిజర్వేషన్ల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని మారీసుపేట ఎమ్మార్పీఎస్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ నాయకుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మరకు రాష్టవ్య్రాప్తంగా 13జిల్లాలలోనూ ఈనెల 18,19,20తేదీలలో మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే 21వ తేదీన డివిజనల్ రెవెన్యూ కార్యాలయాల వద్ద, 23న జిల్లా కలెక్టరేట్ల ముందు మాదిగలను మోసం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసినట్లు చెప్పారు. ఎన్నిలకు ముందుకు మాదిగల్లో పెద్దమాదిగనౌతానని నమ్మించి ఓట్లువేసి గెలిపించుకున్న తరువాత వారిని మోసంచేసి వర్గీకరణ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విధానాలకు వ్యతిరేకంగా ఈనిరసన కార్యక్రమాలు అమలుచేయాలని నిర్ణయించినట్లు వివరించారు. టిడిపి కోసం ప్రాణ త్యాగాలుచేసిన మాదిగలను అరెస్టు చేయించటం, జైళ్ళలో పెట్టించి ఎన్నికలలో టిడిపికి వ్యతిరేకంగా ప్రచారంచేసి పార్టీని ఓడించే ప్రయత్నం చేసిన మాలమహానాడు నాయకులను అందలమెక్కించటం పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు మాదిగలపట్ల వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా వారంపాటు పైకార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమైనట్లు చెప్పారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.