గుంటూరు

స్మార్ట్ పల్స్ సర్వేను నూరుశాతం పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కార్పొరేషన్), డిసెంబర్ 20: స్మార్ట్ పల్స్ సర్వేను నూరుశాతం పూర్తిచేయాలని కమిషనర్ నాగలక్ష్మి సర్వే సూపర్‌వైజర్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లతో ఆమె సమావేశమయ్యారు. సర్వేలో నమోదుకాని కుటుంబాల్లో అవగాహన కలిగించేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన సమాచార స్టిక్కర్లను పంపిణీ చేశామని తెలిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు ఆయా వార్డుల్లో రేషన్‌షాపులు, మీ సేవ సెంటర్లు, గ్యాస్ కంపెనీల వద్ద పొందుపర్చాలని సూచించారు. రెండు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్నారు. నగరంలోని విద్యాసంస్థల వివరాలను సూపర్‌వైజర్లకు అందించామని, 500 మంది కంటే తక్కువ విద్యార్థులున్న విద్యాసంస్థలను రోజుకొకటి చొప్పున, 1000 కంటే ఎక్కువ మంది ఉన్న విద్యాసంస్థలను రెండు రోజులకొకటి చొప్పున పల్స్ సర్వేలో పేర్లు నమోదు చేసుకోని విద్యార్థులను భాగస్వాములను చేయాలన్నారు. ఇంకా సర్వే పూర్తికాని వీధులు, గృహాలు ఉంటే నగరపాలక సంస్థలో ఏర్పాటుచేసిన కాల్‌సెంటర్‌కు వివరాలు అందించాలని నాగలక్ష్మి సూచించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌లు ఏసుదాసు, డి శ్రీనివాసరావు, ఎంహెచ్‌ఒ డాక్టర్ నాగేశ్వరరావు, బయాలజిస్ట్ వీర్రాజు, సిటీప్లానర్ ధనుంజయరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సాగర్ కుడి కాల్వకు నీరు విడుదల
విజయపురిసౌత్, డిసెంబర్ 20: నాగార్జునసాగర్ జలాశయం నుండి సాగు, తాగు అవసరాల నిమిత్తం కుడి కాలువ ద్వారా మంగళవారం ఐదోక్రస్ట్ గేట్‌ను ఎత్తి సీఈ వీర్రాజు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఈ వీర్రాజు విలేఖరులతో మాట్లాడుతూ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీరు అవసరం నిమిత్తం, ఆరుతడి పంటల కోసం 15టియంసీల నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాగర్ జలాశయం నుండి కుడి కాలువ ద్వారా గంటకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున పెంచుతూ సాయంత్రానికి ఆరువేల క్యూసెక్కుల నీటిని నిత్యం విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని చెరువులు, కుంటలు నింపుకోవాలని కోరారు. సాగర్ ఆయకట్టు పరిధిలో చివరిభూములకు నీరు అందేలాగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రకాశం జిల్లాలో నీటి కొరతతో పంటలు ఎండిపోతున్న దశలో జలవనరుల శాఖకు ప్రజాప్రతినిధులు కుడి కాలువకు తక్షణమే నీరు విడుదల చేయాలని కోరడంతో మంగళవారం నుండి 22రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిఈ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ఏడీఈలు కేశవరావు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా కృష్ణమ్మ తల్లికి సీఈ వీర్రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.