గుంటూరు

పేదల ఇళ్లస్థలాల క్రమబద్దీకరణకు ప్రభుత్వం సుముఖత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 27: రాష్ట్రప్రభుత్వం గుంటూరు నగరంలోని నిరుపేదల ఇళ్లస్థలాలను రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం సముఖంగా ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇన్‌చార్జి మంత్రి, హోం మంత్రి చినరాజప్ప, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్యచౌదరి హాజరై పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం చినరాజప్ప మాట్లాడుతూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలను కలుపుకుని పనిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులు మాట్లాడుతూ నియోజకవర్గాల్లో 1950 ఇళ్లను వెంటనే నిర్మించాలన్నారు. గతంలో నిర్మించిన మరుగుదొడ్లను వెంటనే బిల్లులు చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ బ్యాంకులతో సంబంధం లేకుండా బిసి, కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కారొర్పరేషన్ల కింద రుణాలను ప్రభుత్వమే ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు 1981 కోట్లు మంజూరు చేసిన కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, పార్లమెంటు సభ్యులకు అభినందనలు తెలియజేశారు. చేనేత కార్మికుల ప్రయోజనాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. నవంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరిగిన జనచైతన్య యాత్రలను జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు సమావేశం కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో 8,48,924 సభ్యత్వాన్ని నిర్వహించి జిల్లాను ప్రథమస్థానంలో నిలిపిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జెఆర్ పుష్పరాజ్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, డొక్కా మాణిక్య వరప్రసాద్, మురుగుడు హనుమంతరావు, ఎండి హిదాయత్, తాతా జయప్రకాష్ నారాయణ, చలమాలశెట్టి రామానుజయ, శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, కొమ్మాలపాటి శ్రీ్ధర్, తెనాలి శ్రావణ్‌కుమార్, వడ్లమూడి పూర్ణచంద్రరావు, మన్నవ సుబ్బారావు, ముమ్మనేని వెంకట సుబ్బయ్య, ఇక్కుర్తి సాంబశివరావు, గంజి చిరంజీవి, మద్దాళి గిరిధర్, కొమ్మారెడ్డి చలమారెడ్డి, మాకినేని పెదరత్తయ్య, శనక్కాయల అరుణ, బోనబోయిన శ్రీనివాసయాదవ్, దాసరి రాజామాస్టారు, చందు సాంబశివరావు, జియావుద్దీన్, కంచర్ల శివరామయ్య మైనేని మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమలపై శే్వతపత్రానికి సిద్ధం

గుంటూరు, డిసెంబర్ 27: ప్రభుత్వం పరిశ్రమలకు అనుమతులు సరళతరం చేసిందని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. అవసరమైతే పరిశ్రమలపై శే్వతపత్రం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. టిడిపి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోకెల్లా ఏపి పెట్టుబడులలో 15 శాతం వృద్ధి సాధించిందని స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, దీనివల్ల ఉద్యోగావకాశాలు 30 శాతం పెరిగాయన్నారు. తిరిగి విశాఖలో జరగనున్న పారిశ్రామికవేత్తల సదస్సునాటికి 50 శాతం ఉపాధి కల్పన జరిగేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రాష్ట్ర వృద్ధిరేటు 12 శాతం ఉందని నిపుణులైన ఐఏఎస్ అధికారులు తేల్చిచెబితే వైసిపి వక్రభాష్యాలు పలకటం సిగ్గుచేటన్నారు. ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. పోలవరం నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించటంతో వైసిపి నేతలకు ముచ్చమటలు పడుతున్నాయని విమర్శించారు. వైఎస్ హయాంలో 25 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రెండున్నరేళ్ల టిడిపి పాలనలో ఆత్మహత్యలు పూర్తిస్థాయిలో తగ్గాయని గుర్తుచేశారు. విద్యుత్ సంక్షోభం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అన్ని ప్రాంతాలకు సకాలంలో నీరందించటం వల్ల దిగుబడులు గణనీయంగా పెరిగాయన్నారు. రైతులకు 24వేల రుణమాఫీకి గాను 11వేల కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ అయ్యాయన్నారు. నదుల అనుసంధానం పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని పునరుద్ఘాటించారు.