గుంటూరు

‘ముక్కోటి ఏకాదశి’కి ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), జనవరి 6: మోక్ష ఏకాదశిగా ప్రఖ్యాతిగాంచిన ముక్కోటి ఏకాదశికి తరలివచ్చే అసంఖ్యాక భక్తజన సౌకర్యార్ధం నగరంలోని 52 డివిజన్లలో గల 20 ప్రధాన విష్ణు మందిరాలు సుందరంగా ఇప్పటికే ముస్తాబైనాయి. శుక్రవారం సాయంత్రానికి అన్ని ముఖ్య దేవస్థానాలు, ఆలయాలను రమణీయంగా తీర్చిదిద్దారు. మహరాజ గోపురం, విమాన శిఖరం, గర్భాలయం, ఆలయ ప్రాంగణాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. 36 గంటలకు ముందుగానే లక్ష్మీనారాయణుడు కొలువైయున్న దేవస్థానాల్లో వైకుంఠ ఏకాదశి సంబరం ప్రారంభమైంది. ప్రతి యేటా ధనుర్మాసంలో విచ్చేసే మహాపర్వదినాల్లో విశేషమైనదిగా పేర్కొంటున్న వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఈ నెల 8 ఆదివారం రావడంతో వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్ధం, వారికి శీఘ్రగతిన ఉత్తరద్వారం గుండా వైకుంఠనాధుడిని కనులారా సేవించుకునే అవకాశాన్ని కల్పించడానికి ఆయా దేవస్థానాల అధికారులు, వంశపారంపర్య ధర్మకర్తలు, ఆలయ పాలక మండళ్లు ఏర్పాట్లు పూర్తిచేశాయి. నగరంలోని ఆర్ అగ్రహారంలో కొలువైయున్న 655 సంవత్సరాల నుండి చరిత్ర కల్గిన శ్రీ రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో 8 ఆదివారం తెల్లవారుజామున సరిగ్గా 5 గంటల శుభ సమయంలో ఉత్తరద్వారం గుండా లక్ష్మీనరసింహస్వామి వేంచేసి భక్తులను అనుగ్రహించనున్నారని, ప్రత్యేక కూ లైన్లలను ఏర్పాటుచేసి, తీర్ధప్రసాదాలను భారీగా భక్తజన సహకారంతో అందజేయనున్నామని దేవస్థాన కార్యనిర్వహణ అధికారిణి టి సుభద్ర, ధర్మకర్తలు కె శ్రీరంగనాధ్, కెఎస్ రమేష్, ప్రధాన అర్చకస్వామి నంధ్యాల శ్రీనివాసాచార్యులు తెలిపారు. బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో శ్రీవారి ఉత్తర ద్వారదర్శనం ఏర్పాటు చేశామన్నారు. క్రమశిక్షణతో భక్తులు స్వామిని సేవించుకోవాలని దేవాలయ పాలకమండలి అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య కోరారు. నగరం, నగరానికి సమీపంలోని అన్ని ఆలయాల్లో కూడా వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు దాదాపుగా పూర్తిచేశారు.