గుంటూరు

వైభవంగా మంగళాద్రి నృసింహుని ఉత్తరద్వార దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జనవరి 8: ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో స్వామివారి ఉత్తర ద్వారదర్శనం ఆదివారం తెల్లవారుఝాము నుంచి అతివైభవంగా భక్తుల నేత్రపర్వంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు బారులుతీరి ఉత్తర ద్వారంలో కొలువుదీరిని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని అనంతరం ఆలయం లోపల మూలవిరాట్టును దర్శించుకుని దక్షిణావృత శంఖంతో తీర్ధం స్వీకరించారు. తెల్లవారుఝామున స్వామివారికి తిరువంజనోత్సవం నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు గరుడ వాహనంపై నాలుగు గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయ ధ్వనుల మధ్య సత్తర ద్వారదర్శనం చేయించారు. గరుడారూఢుడైన స్వామివారు అభయ, వరద హస్తములతో భక్తులకు మంగళ శాసనాలు తెలియ పరుస్తూ దర్శన మివ్వడం బ్రహ్మానందభూతిని కల్గించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు, భారీ నీటి పారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, శాసన సభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి), ధూలిపాళ్ల నరేంద్రకుమార్ (పొన్నూరు), ఆలపాటి రా జేంద్ర ప్రసాద్ (తెనాలి), భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్‌కె ప్రసాద్ దంపతులు, మాజీమంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, కమిషనర్ టీవీ రంగారావు, అసెంబ్లీ స్పీకర్ కొడెల శివప్రసాద్‌రావు కుమార్తె, డిఆర్‌ఓ కె నాగబాబు, తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, ఎఎంసి చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి, దానబోయిన సుందరరావు యా దవ్, పలువురు అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు విచ్చేసి ఉత్తర ద్వారంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని బంగారు దక్షిణావృత శంఖంతో తీర్ధం స్వీకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మండెపూడి పానకాలరావు, ధర్మకర్తల మండలి సభ్యులు విఐపిలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కృష్ణా, గుంటూరుజిల్లాల నుంచి భక్తులు అసంఖ్యాకంగా తరలి రావడంతో పట్టణ వీధులన్నీ కిక్కిరిశాయి. పెద్దసంఖ్యలో విచ్చేసిన భక్తులు దిగువ సన్నిధిలో ఉత్తర ద్వార దర్శనం, శంఖు తీర్ధం తీసుకుని కొండపై స్వయంభువైన పానకాలస్వామిని, కొండ శిఖర భాగాన గల గండాలయ స్వామిని దర్శించుకున్నారు.
సమాజ వికాసంపై అవగాహనే
జన్మభూమి లక్ష్యం
గుంటూరు, జనవరి 8: పేదలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి నిర్ధేశించిన కుటుంబ వికాసం, సమాజ వికాసంపై చర్చించి ప్రజల్లో అవగాహన కల్పించడమే జన్మభూమి కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ వార్డుకు సంబంధించి ఆదివారం జరిగిన 4వ విడత జన్మభూమి కార్యక్రమంలో కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ వికాసానికి రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి రాష్ట్రంలో సుమారు 43 లక్షల మంది నిరుపేదలకు పించన్లు యిస్తూ జీవన భద్రత కల్పిస్తుందన్నారు. దీనికి గాను సుమారు 6 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే అర్హులైన నిరుపేదలకు తెల్లరేషన్‌కార్డులు మంజూరు చేస్తూ ప్రతి ఒక్కరికీ 5 కేజీల బియ్యం కేజీ ఒక రూపాయి చొప్పున పంపిణీ చేస్తూ ఆహారభద్రత కల్పిస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వారికి బ్యాంకు రుణాలను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. అసంఘటిత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని, ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గుంటూరు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. నగరంలో 903 కోట్ల రూపాయలతో అండర్‌గ్రౌండ్, డ్రైనేజీ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరైందని, త్వరలో అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు కొత్తరేషన్‌కార్డులు, పించన్లు, దీపం, కనెక్షన్లు, సంక్రాంతి కానుకలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పి రంగనాయకులు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దారి గిరి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సంక్షేమ ఫలాలు అందరికీ ఇవ్వాలి

గుంటూరు, జనవరి 8: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆదివారం గుంటూరు రూరల్ చౌడవరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన జన్మభూమి సభలో ముఖ్యఅతిథిగా రావెల పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల విజయవంతానికి ప్రజా సహకారం కూడా ముఖ్యమన్నారు. ప్రజల వాకిటకు ప్రభుత్వ పథకాలు చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రజల సమక్షంలో జన్మభూమి కార్యక్రమాలను నిర్వహిస్తోందని వెల్లడించారు. కమిషనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ అందరికీ ఇళ్లు కార్యక్రమం కింద నగరపాలక సంస్థ పరిధిలో 11,800 గృహాలు మంజూరు చేయాల్సిందిగా ఇప్పటివరు 6,200 కుటుంబాలకు గృహాలు మంజూరయ్యాయని తెలిపారు. చౌడవరం గ్రామానికి 112 ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు. ఒక్కొక్క గృహానికి మూడున్నర లక్షల రూపాయల ఖర్చవుతుందని, ఇందులో రెండున్నర లక్షల రూపాయల వరకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు భరిస్తాయని, మిగిలిన లక్ష రూపాయల్లో 25 వేల రూపాయలు లబ్ధిదారుని వాటా కాగా మిగిలిన 75 వేల రూపాయలు బ్యాంకు నుండి రుణంగా పొందాల్సి ఉంటుందన్నారు. చౌడవరం గ్రామంలో అభివృద్ధి పనుల కోసం 7.30 కోట్లు, వీటిలో 4.60 కోట్లు పనులు పూర్తయినట్లు, మిగిలిన 2.70 కోట్ల పనులు జరగాల్సి ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా రాధామాధవ రసరంజని సంస్థకు చెందిన శ్రీదేవి ప్రదర్శించిన నృత్యం పలువురిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, షేక్ లాల్‌వజీర్, వట్టికూటి హర్షవర్ధన్, తహశీల్దార్ నాగిరెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల చేతుల్లోనే దేశ్రపగతి
గుంటూరు (పట్నంబజారు), జనవరి 8: విద్యార్థుల ప్రగతిపైనే దేశప్రగతి, అభివృద్ధి ఆధారపడి ఉందని విశ్రాంత సిఆర్‌పిఎఫ్ కమాండెంట్ ఎంవి కృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కన్నావారితోటలోని కన్నా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ మహాత్మాగాంధీ కళాశాల ప్రిన్సిపాల్ డిఎఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులు అన్ని అంశాలను క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఆసక్తి కనబర్చాలన్నారు. 2050 నాటికి ఏ దేశానికీ లేని యువశక్తి భారత్‌కు ఉంటుందన్నారు. మనదేశం వ్యవసాయరంగంలోనే కాక వ్యవసాయేతర రంగాల్లో కూడా వృద్ధి సాధిస్తుందన్నారు. అన్ని రంగాల్లో మార్పులు వేగంగా సంభవిస్తున్నాయని, వీటిని గమనించి విద్యార్థులు తమకు అనుకూలంగా మలచుకోవాలన్నారు. ట్రస్ట్ చైర్మన్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకే 2013లో ట్రస్ట్‌ను ఏర్పాటు చేశామన్నారు. ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ, పేదలు నివశించే కాలనీల్లో మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో విజేతలకు ముఖ్యఅతిథి ఎంవి కృష్ణారావు, అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జూపూడి రంగరాజు, ఆలూరు కోటేశ్వరరావు, అమ్మిశెట్టి ఆంజనేయులు, ట్రస్ట్ కన్వీనర్ పడుచూరి వెంకటేశ్వర్లు, తాళ్ల వెంకటేష్‌యాదవ్, తన్నీరు ఆంజనేయులు పాల్గొన్నారు.

జాతీయ స్కేటింగ్ పోటీలకు చేతన్, పవన్
గుంటూరు (స్పోర్ట్స్), జనవరి 8: స్థానిక ఎన్‌టిఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం, భాష్యం విద్యాసంస్థల్లో గత రెండు రోజులుగా జరుగుతున్న స్కేటింగ్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన పారిశ్రామికవేత్తలు అరుణాచల మాణిక్యవేల్, చుక్కపల్లి రమేష్‌లు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ పోటీలకు ఎంపికైన చేతన్‌రెడ్డి, పవన్‌కుమార్‌లను ప్రత్యేకంగా అభినందించారు. నగరంలో స్కేటింగ్ క్రీడకు విశేష ప్రాచుర్యం లభిస్తుందని, స్థానిక ఎన్‌టిఆర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు అనేక రాష్ట్ర, జాతీయ పోటీల్లో పాల్గొని అనేక పతకాలను సాధించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎన్‌టిఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి సంపత్‌కుమార్, రాష్ట్ర స్కేటింగ్ సంఘ కార్యదర్శి థామస్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి నీలిమ, సంయుక్త కార్యదర్శి పి శ్రీకాంత్‌రెడ్డి, శివ, కోశాధికారి భాస్కరరావు, శిక్షకుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాలు
ఆర్థిక స్వావలంబన సాధించాలి
సత్తెనపల్లి, జనవరి 8: వ్యవసాయానికి అనుబంధమైన పొట్టేళ్లు, గేదెలు, కోళ్లు పెంపకం ద్వారానేగాక కుట్టుమిషన్ల శిక్షణ, పచ్చళ్లు తయారు చేయడం వంటి పథకాలపైనే గాక ప్రభుత్వ ఇచ్చే రాయితీలపై అందజేసే తదితర పధకాలను సద్వినియోగం చేసుకొని డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులందరూ ఆర్థికంగా స్వాలంభన సాధించాలని డిఆర్‌డిఎ పిడి షేక్ హభీబ్‌బాషా పిలుపునిచ్చారు. ఆదివారం సభాపతి కార్యాలయంలో మహిళా నాయకురాలు భీమనేని వందనాదేవి అధ్యక్షతన జరిగిన మండల సమైఖ్య అమీక్షా సమావేశంలో హభీబ్‌బాషా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళలకు డైరీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎపి ఎం పున్నారావు, సిబ్బంది శేఖర్, సాంబశివరావు, కనిగిరి వెంకటరెడ్డి, సదాశివరావు, రాజకుమారి, గద్దె అనురాధ తదితరులు పాల్గొన్నారు.
రాష్టస్థ్రాయి వాలీబాల్ విజేతలకు
ఎమ్మెల్యే ప్రశంసలు
చేబ్రోలు, జనవరి 8: రాష్టస్థ్రాయి సబ్ జూనియర్ బాలబాలికల అంతర్ జిల్లాల వాలీబాల్ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానం సాధించిన క్రీడాకారులను ఆదివారం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశంసించారు. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో గత నెల 23 నుండి 25 వరకు ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో గుంటూరు జిల్లా బాలుర జట్టు ప్రథమ స్థానం సాధించింది. వడ్లమూడి సంగం డెయిరీలో విజేతలైన 12 మంది క్రీడాకారులకు ఎమ్మెల్యే నరేంద్రకుమార్ క్రీడాసామగ్రిని అందజేసి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లాను క్రీడాకారుల ఖిల్లాగా మార్చేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని, క్రీడాకారులకు చేయూతనిచ్చేందుకు కృషిచేస్తోందని ఆయనన్నారు. రాష్టస్థ్రాయిలో ప్రథమ స్థానం సాధించేందుకు కృషిచేసిన కోచ్ కె రాజేష్‌ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎన్నారై అజయ్‌చంద్, అంతర్జాతీయ క్రీడాకారులు జె సింగారావు, విజయ్‌చంద్, శాప్ మాజీ డైరెక్టర్ గోపీచంద్ పాల్గొన్నారు.
జాతీయ పోటీలకు లిఫ్టర్ల ఎంపిక

మంగళగిరి, డిసెంబర్ 8: తమిళనాడులోని కోయంబత్తూరులో ఈనెల 12 నుంచి 16 వరకు జరిగే జాతీయ జూనియర్ మరియు మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ 2017 , బెంచిప్రెస్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టులో ఎంపికైన జిల్లా పవర్ లిఫ్టర్ల వివరాలను జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 53 కేజీల విభాగంలో షేక్ మహమ్మద్ గౌస్, 59 కేజీల విభాగంలో ఎస్ మణిరత్నం, 120 కేజీల విభాగంలో జొన్నాదుల ఈశ్వర్‌కుమార్, జూనియర్స్ విభాగంలో పాల్గొంటారు. మాస్టర్స్ 93 కేజీల విభాగంలో పసుపులేటి సురేష్, 105 కేజీల విభాగంలో ఆర్ నటరాజు, గడ్డం రమేష్, 74 కేజీల విభాగంలో సయ్యద్ కరీముల్లా, పార్ధసారధి, డోపింగ్ ఫారాలు పూర్తిచేసి పోటీలకు అర్హత సాధించారని పుల్లేశ్వరరావు తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ రఫి, కోచ్‌లు ఎండి ఖుమురుద్దీన్, ఎం శేషగిరిరావు, ఎస్‌కె సంధాని పేర్కొన్నారు.