గుంటూరు

కుమార్తె ను చంపి తండ్రి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జనవరి 9: మనస్థాపంతో కూతురి గొంతునులిమి తానూ ఆత్మహత్య చేసుకున్న ఓ తండ్రి ఉదంతం జిల్లా పరిధిలోని చుండూరు మండలం యడవూరు గ్రామంలో జరిగింది. . చుండూరు పోలీసులు, గ్రామస్తుల కధనం ప్రకారం అమృతలూరు మండలం యడవూరు గ్రామానికి చెందిన అంగిరేకుల శ్రీకృష్ణదేవరాయలు (42) భార్య కొంతకాలం క్రితం మృతి చెందటంతో మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలో తానుకూడా మృతి చెందాలనే ఆలోచనకువచ్చి తన కుమార్తె సాయిసంధ్య(7) భవిష్యత్తును స్మరించుకొని కొంతకాలంగా ఆత్మహత్యాయత్నం చేసుకోకుండా వస్తున్నాడు. ఈక్రమంలోనే సోమవారం అమృతలూరు మండలం యడవూరు నుండి చుండూరు మండలం చినపరిమి- యడ్లపల్లి డొంక పొలాల్లోకి కూమార్తెతో వెళ్ళాడు. అక్కడ ఆకస్మాత్తుగా కూతురు సాయిసంధ్య గొంతుకు తాడువేసి నోక్కి చంపాడు. కూతురు చనిపోయిందని నిర్ధారణకు వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు తాను కూడా సమీపంలోని చెట్టుకు తాడుతో ఉరిపోసుకొని మృతి చెందాడు. ఈమేరకు తాను తన భార్య మృతి చెందటంతో మనస్థాపానికి గురైనట్లు, తన కుమార్తెకు అన్యాయం జరుగకుండా తనను కూడా తానే చంపినట్లు సూసైడ్ నోట్‌వ్రాసి పక్కనే పెట్టి చెట్టుకు ఊరేసుకుని మరణించాడు. ఆవైపుకు పొలం పనుల నిమిత్తం వెళుతున్న రైతులు కొందరు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని, ఆ సమీపంలోనే మృతిచెంది పడియున్న చిన్నారి మృత దేహాలను గమనించి చుండూరు పోలీసులకు సమాచారం అందించారు. అయితే తొలుత సంఘటనా ప్రదేశం అమృతలూరు, తెనాలి రూరల్, చుండూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉందనే అనుమానంతో ఆయా స్టేషన్ల పరిధిలోని పోలీసులు సంఘటన జరిగిన స్థలం వద్దకు చేరుకొని తుదకు చుండూరు మండల స్టేషన్ పరిధిగా భావించారు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు చుండూరు పోలీసులు తెలిపారు.

బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నం
తెనాలి, జనవరి 9: ఆరేళ్ల బాలికపై 55 సంవత్సరాలుపైబడిన వృద్ధుడు అత్యాచార యత్నానికి ఒడిగట్టిన సంఘటన దుగ్గిరాలలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన తుపాలకు వెంకటరామయ్య అనే వృద్ధుడు తన ఇంటి సమీపంలోని 6 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారికి మాయమాటలు చెబుతూ వశపరుచుకొని అత్యాయత్నానికి ఒడిగట్టినట్లు చెప్పారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.