గుంటూరు

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనతోనే ప్రమాదాల నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 19: ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం స్థానిక పోలీసుపెరెడ్ గ్రౌండ్‌లో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 28వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను మంత్రి ప్రత్తిపాటి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జరిగిన ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజలలో అవగాహన కల్పించడంలో ప్రభుత్వంతో పాటు స్వచ్చంధ సంస్థలు కూడా భాగస్వాములై రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలన్నారు. మంత్రి రావెల మాట్లాడుతూ గుంటూరు నగరం అమరావతి రాజధానిలో ఒక భాగమై, నగరంలో ట్రాఫిక్ పెరిగిపోయిందన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు గుంటూరు నగరంలో రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవడంతో పాటు, అధునాతన సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పాటించాల్సిన నియమ నిబంధనలను ప్రజలకు తెలియజెప్పడంలో విద్యార్థులే ప్రచారకర్తల పాత్ర పోషించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం మీ భద్రతే మీ కుటుంబానికి రక్ష-రహదారిపై అప్రమత్తంగా ఉండండి అనే నినాదం తీసుకోవడం జరిగిందన్నారు. తొలుత రవాణాశాఖ రోడ్డు భద్రతపై రూపొందించిన కరపత్రాలను, ఫ్లెక్సీలను మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, అధికారులచే మంత్రి ప్రత్తిపాటి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అద్దంకి, గిద్దలూరు శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, అశోక్‌రెడ్డి, రూరల్ ఎస్‌పి నారాయణ నాయక్, రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ రాజారత్నం, గుంటూరు మార్కెట్‌యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, రవాణాశాఖ, పోలీసుశాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

శునక విశ్వాసంపై కోటిరెడ్డి వినూత్న ప్రచారం
సత్తెనపల్లి, జనవరి 19:మనిషికన్నా కుక్కకే విశ్వాసం ఎక్కువని, కుక్కని చులకన చేసి ఎవరూ మాట్లాడవద్దని, నీతి తప్పిన వ్యక్తులతో పోల్చుకుంటే కుక్క ఎంతో నయమని, మాట్లాడలేని ఈ మూగజీవికి అన్నీ తెలుసని, పట్టెడన్నం పెడితే తన జీవితాంతం తన యజమానికి విశ్వాసంతో మెలుగుతుందని తమ్మినేని చినకోటిరెడ్డి అన్నాడు. పట్టణానికి చెందిన కోటిరెడ్డి గడియారం స్తంభం సమీపంలో మిఠాయికొట్టును పెట్టుకొని వ్యాపారం చేస్తుంటాడు. గత రెండు సంవత్సరాలుగా కుక్కపిల్లను తెచ్చుకొని అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. మనిషికి మాదిరిగానే దానికీ మనసుంటుందని, అదికూడా షికారుగా అటు ఇటు వెళ్లాలనుకుంటుందని దానికోర్కెలను యజమాని గుర్తెరిగి నడుచుకోవాలని చినకోటిరెడ్డి వివరించాడు. బయటకు వచ్చిన సమయంలో ఊరిలోని ఊర కుక్కలు దీనిపై దాడి చేయకుండా చూసేందుకు ఏకంగా నాలుగు వేల రూపాయలను వెచ్చించి బల్ల రిక్షాను కొన్నాడు. దానిపైన మెత్తగావుండేందుకు బెడ్‌ను ఏర్పాటు చేసి ఆకుక్కను పట్టణంలోని పురవీధుల్లో కోటిరెడ్డికి తీరిక దొరికినప్పుడల్లా వీధుల్లో తిప్పడం పలువుర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనను చూడందే కుక్క అన్నం కూడా తినదని, తలనొప్పిగా బడలికగా వున్నా తనను ఏకాగ్రతతో చూస్తుంటుందని వివరించాడు. మాటతప్పే మనిషికన్నా విశ్వాసానికి మారుపేరైన కుక్కేనయం అనే నినాదాన్ని తన కుక్కద్వారా కోటిరెడ్డి ఇలా ప్రచారం చేస్తున్నాడు.
నాగార్జున కొండను సందర్శించిన
టిబెట్ బౌద్ధుల బృందం
విజయపురిసౌత్, జనవరి 19: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండను గురువారం టిబెట్ దేశానికి చెందిన బౌద్దుల బృందం సందర్శించారు. హైదరాబాద్ నుండి పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక వాహనాల్లో టిబెట్ బౌద్ధ బృందం సాగర్‌కు చేరుకున్నారు. అనంతరం నాగార్జునకొండకు వెళ్ళేందుకు లాంచీలో కొండకు చేరుకున్నారు. మ్యూజియంలో ఉన్న అత్యంత పురాతన రాతి పనిముట్లు, శిలాశాసనాలు, బుద్దుని పాలరాతి విగ్రహాన్ని తిలకించారు.

ప్రతిష్టాత్మకంగా జాతీయ క్రీడలు నిర్వహించాలి
నరసరావుపేట,జనవరి 19: భారత క్రీడాపటంలో నరసరావుపేట ప్రతిష్ట చిరస్ధాయిగా నిలిచిపోయేలా ఫిబ్రవరి నాలుగోతేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు జరిగే జాతీయస్థాయి అండర్-17 క్రీడా పోటీలు నిర్వహించేందుకు సమష్టిగా, సమర్థవంతంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, వివిధ వర్గాల ప్రజలు కృషి చేయాలని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. గురువారం స్ధానిక సత్తెనపల్లి రోడ్డులోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే, జేసీ-2వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ జాతీయ స్ధాయి క్రీడల్లో 29రాష్ట్రాల నుండి సుమారు మూడు వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. దీనికి సంబంధించి 14 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. క్రీడాకారులు నరసరావుపేటకు వచ్చిన నాటి నుండి తిరిగి వారి రాష్ట్రాలకు వెళ్ళే వరకు సమర్థవంతంగా కమిటీలు పనిచేయాలన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఫుడ్ కమిటీ ఆహారం ఏర్పాట్లలోనూ, పరిశుభ్రతలోనూ ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు. ఫుడ్ కమిటీ పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరలో కమిటీల బ్రోచర్‌ను విడుదల చేస్తామన్నారు. క్రీడాకారులకు ఆరు రోజుల పాటు నిర్దేశించిన కమిటీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ క్రీడలకు జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారని తెలిపారు.
* విరాళాల నగదును కలెక్టర్‌కు
అందచేసిన డాక్టర్ శివరామ్
నరసరావుపేటలో జరిగే జాతీయ స్ధాయి అండర్-17క్రీడాపోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పలువురు ముందుకు వచ్చి విరాళాలను ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ కోడెల శివరాం లక్ష రూపాయల విరాళం ప్రకటించి, జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండేకు లక్ష రూపాయల విరాళం చెక్కును అందచేశారు. అనంతరం బంగారం, వెండి వర్తకుల తరపున రాష్ట్ర బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కపలవాయి విజయకుమార్ రెండు లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున 1.10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వెంకటేష్ 50వేల రూపాయలు, ఇంటర్, డిగ్రీ కళాశాలల తరపున మైనీడి శ్రీనివాసరావు 50 వేల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కే నాగేశ్వరరావు, డీఈవో కెవి శ్రీనివాసరెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాసరావు, డెప్యూటీ డీఈవో ఉదయభాస్కర్, మున్సిపల్ కమీషనర్ భానూప్రతాప్, తహశీల్దార్ విజయజ్యోతి కుమారి, డిఆర్‌డిఏ పీడీ షేక్ హబీబ్‌బాషా,ప్రజారోగ్య శాఖ ఈఈ నాగమల్లేశ్వరరావు, సిఐలు వీరయ్య చౌదరి, సాంబశివరావు, ప్రభాకర్, కౌన్సిలర్లు అబ్దుల్ గఫార్, కొలిపాక చంద్రశేఖర్, షేక్ మస్తాన్‌వలి, మస్తాన్ షరీఫ్, జిలానీ మాలిక్, కోసూరి లక్ష్మీనారాయణ, మందాడి రవి, పిఈటీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

శునక విశ్వాసంపై కోటిరెడ్డి వినూత్న ప్రచారం
సత్తెనపల్లి, జనవరి 19:మనిషికన్నా కుక్కకే విశ్వాసం ఎక్కువని, కుక్కని చులకన చేసి ఎవరూ మాట్లాడవద్దని, నీతి తప్పిన వ్యక్తులతో పోల్చుకుంటే కుక్క ఎంతో నయమని, మాట్లాడలేని ఈ మూగజీవికి అన్నీ తెలుసని, పట్టెడన్నం పెడితే తన జీవితాంతం తన యజమానికి విశ్వాసంతో మెలుగుతుందని తమ్మినేని చినకోటిరెడ్డి అన్నాడు. పట్టణానికి చెందిన కోటిరెడ్డి గడియారం స్తంభం సమీపంలో మిఠాయికొట్టును పెట్టుకొని వ్యాపారం చేస్తుంటాడు. గత రెండు సంవత్సరాలుగా కుక్కపిల్లను తెచ్చుకొని అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. మనిషికి మాదిరిగానే దానికీ మనసుంటుందని, అదికూడా షికారుగా అటు ఇటు వెళ్లాలనుకుంటుందని దానికోర్కెలను యజమాని గుర్తెరిగి నడుచుకోవాలని చినకోటిరెడ్డి వివరించాడు. బయటకు వచ్చిన సమయంలో ఊరిలోని ఊర కుక్కలు దీనిపై దాడి చేయకుండా చూసేందుకు ఏకంగా నాలుగు వేల రూపాయలను వెచ్చించి బల్ల రిక్షాను కొన్నాడు. దానిపైన మెత్తగావుండేందుకు బెడ్‌ను ఏర్పాటు చేసి ఆకుక్కను పట్టణంలోని పురవీధుల్లో కోటిరెడ్డికి తీరిక దొరికినప్పుడల్లా వీధుల్లో తిప్పడం పలువుర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనను చూడందే కుక్క అన్నం కూడా తినదని, తలనొప్పిగా బడలికగా వున్నా తనను ఏకాగ్రతతో చూస్తుంటుందని వివరించాడు. మాటతప్పే మనిషికన్నా విశ్వాసానికి మారుపేరైన కుక్కేనయం అనే నినాదాన్ని తన కుక్కద్వారా కోటిరెడ్డి ఇలా ప్రచారం చేస్తున్నాడు.
నాగార్జున కొండను సందర్శించిన
టిబెట్ బౌద్ధుల బృందం
విజయపురిసౌత్, జనవరి 19: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండను గురువారం టిబెట్ దేశానికి చెందిన బౌద్దుల బృందం సందర్శించారు. హైదరాబాద్ నుండి పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక వాహనాల్లో టిబెట్ బౌద్ధ బృందం సాగర్‌కు చేరుకున్నారు. అనంతరం నాగార్జునకొండకు వెళ్ళేందుకు లాంచీలో కొండకు చేరుకున్నారు. మ్యూజియంలో ఉన్న అత్యంత పురాతన రాతి పనిముట్లు, శిలాశాసనాలు, బుద్దుని పాలరాతి విగ్రహాన్ని తిలకించారు.

అఖిలప్రియపై దాడి వైసిపి అరాచకానికి నిదర్శనం
గుంటూరు, జనవరి 19:రాజధాని అమరావతిలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కారుపై వైఎస్‌ఆర్ సిపి కార్యకర్తలు దాడిచేయడాన్ని టిడిపి ఎమ్మెల్యే వంగినపూడి అనిత తీవ్రంగా గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. వైసిపి నాయకులకు మహిళలపై ఉన్న గౌరవానికి ఈ సంఘటన అద్దం పడుతుందన్నారు. జగన్ అండ్ కో ఫ్యాక్షన్ ధోరణిని మరోసారి రుజువు చేశారన్నారు. దేశ విదేశాల నుంచి అమరావతికి వచ్చే పెట్టుబడులను అడ్డుకునేందుకు అఖిలప్రియపై దాడి ద్వారా అరాచకం సృష్టించేందుకు కుట్ర జరిగిందన్నారు. దీనిపై ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ జూపూడి ఖండన...
అఖిల ప్రియపై కార్యకర్తలు దాడిచేస్తే జగన్ వారిని మందలించక పోగా అబద్దపు ప్రచారానికి ఒడిగట్టారని టిడిపి ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. జగన్ జైలులో ఉన్నప్పుడు తల్లి, చెల్లి సేవలను వినియోగించుకుని బయటకు రాగానే కరివేపాకులా పక్కన పడేశారని, ఓడిపోయే స్థానంలో తల్లిని నిలబెట్టి అవమానించారని, మహిళలపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏ పాటితో దీన్నిబట్టి అర్ధమవుతుందన్నారు. ఈ దురాఘతానికి పాల్పడిన కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆర్‌టిఐపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
గుంటూరు, జనవరి 19: సమాచార హక్కు చట్టం నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతవారైన, ఏ అధికారైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర సమాచార కమిషనర్ పి విజయబాబు స్పష్టంచేశారు. గురువారం కలెక్టరేట్‌లో సమాచార హక్కు కేసుల విచారణను నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచారహక్కు చట్టంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇఎస్‌ఐ హాస్పిటల్‌లో థైరాయిడ్ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి బీమా సొమ్ము చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో లబ్ధిదారుడిని మానసిక ఆవేదనకు గురిచేసినందుకు గాను సెక్షన్ 6(3) కింద 20 వేల రూపాయల పరిహారం లబ్ధిదారుడికి చెల్లించాల్సిందిగా నోటీసు జారీచేశారు. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్న ఉద్యోగిని బెదిరించినందుకు పంచాయతీరాజ్ కమిషనర్ చిక్కుల్లో పడ్డారని గుర్తుచేశారు. సమాచారహక్కు చట్టం కేసుల విచారణ సందర్భంగా త్వరగా రాని పక్షంలో సస్పెండ్ చేస్తానంటూ ఫిర్యాదుదారుడ్ని పంచాయతీరాజ్ కమిషనర్ బెదిరించడంపై విజయబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సంబంధిత కమిషనర్‌పై సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 నిబంధన కింద సమన్లు జారీచేసి విచారణ జరిపించాలని ఆదేశించారు. ఇలా ఫిర్యాదుదారులను బెదిరిస్తే ఎంతటి ఉన్నతాధికారినైనా క్షమించబోమని, అటువంటి అధికారులను విచారించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా జిల్లా వీరులపాడుకు చెందిన ఓ వ్యక్తి సమాచారం అడిగినందుకు చంపుతామంటూ సర్పంచ్ భర్త, మరికొందరు కలిసి బెదిరింపులకు పాల్పడ్డారని, ఈ విషయమై విచారణ నిర్వహించిన కమిషనర్ చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. ఎపిఎస్‌పి 6వ బెటాలియన్ మంగళగిరిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సురేష్ విడాకులు ఇవ్వకుండా 2వ పెళ్లి చేసుకున్నాడని, దీనిపై బెటాలియన్ కమాండెంట్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోగా సమాచార హక్కు చట్టం కింద చేసుకున్న దరఖాస్తుపై నిర్లక్ష్యం వహించారని ఫిర్యాదుదారు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సంబంధిత కమాండెంట్‌పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎపిఎస్‌పి బెటాలియన్ ఉన్నతాధికారులను సమాచార కమిషనర్ విజయబాబు ఆదేశించారు.

రిజర్వేషన్ల సాధనే
ముద్రగడ పాదయాత్ర లక్ష్యం
* కాపు జెఎసి కన్వీనర్ ఏసు
గుంటూరు, జనవరి 19: ఎన్నికల సమయంలో కాపులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు కల్పిస్తామని మోసగించడం వల్లే కాపు నేత ముద్రగడ పద్మనాభం కాపు సత్యాగ్రహం పాదయాత్ర చేపట్టారని జెఎసి రాష్ట్ర కన్వీనర్ వాసిరెడ్డి ఏసుదాస్ స్పష్టంచేశారు. ఈనెల 25న రావులపాలెం నుంచి అంతర్వేది వరకు ముద్రగడ చేపట్టిన పాదయాత్ర కార్యక్రమంపై జిల్లా జెఎసి నాయకులతో గురువారం కెకెఆర్ ఫంక్షన్ ప్లాజాలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముద్రగడ చేపట్టిన పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నించడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కార్యక్రమాలను ఏ సామాజికవర్గ ఉద్యమాలకు లేని నియమ నిబంధనలు కాపులకు వర్తింపజేయడంలోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం వెనుక కాపులు కాపుకాశారనే నగ్నసత్యాన్ని చంద్రబాబు విస్మరించడం బాధాకరమన్నారు. అండగా నిలిచిన కాపులపై కుట్రపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. హామీల అమలుకై కాపులు చేస్తున్న ఉద్యమానికి అన్నివర్గాల ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోందన్నారు. ముద్రగడ దీక్ష సమయంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్, మంత్రి అచ్చెన్నాయుడు, శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరావులు మధ్యవర్తులుగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని జెఎసి నేత కిలారు రోశయ్య ప్రశ్నించారు. ఇప్పటికైనా హామీలను నెరవేర్చక పోతే ముఖ్యమంత్రి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జెఎసి నాయకులు మాదా రాధా, అడపా కాశీ, ఆళ్ల హరి, మంగిశెట్టి శ్రీనివాసరావు, తోట శ్రీనివాసరావు, కావటి విక్రమ్, విజయ్, శ్రీకాంత్, దాసరి రాము, సత్యం తదితరులు హెచ్చరించారు.