గుంటూరు

విద్యార్థి దశ నుంచి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 20: విద్యార్థి దశ నుంచి రహదారి భద్రతా సూత్రాలను అనుసరించడంలో అవగాహన కలిగి ఉండాలని, వీటిని తప్పనిసరిగా పాటించాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ జిసి రాజారత్నం పేర్కొన్నారు. శుక్రవారం వింజనంపాడులోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో రవాణాశాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతా నిబంధనలపై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజారత్నం మాట్లాడుతూ విద్యార్థులు ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్తుంటారని, ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలు కాపాడేది హెల్మెట్టేనని గుర్తుచేశారు. లైసెన్స్ పొందిన తరువాతే వాహనాన్ని నడపాలని సూచించారు. అనంతరం విద్యార్థుల చేత రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కిట్స్ కళాశాల ప్రిన్సిపాల్ బాబురావు, మోటారు వెహికల్ ఇన్స్‌పెక్టర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అఖిలప్రియపై దాడి కేసులో అనుమానితుల అరెస్టు

గుంటూరు, జనవరి 20: అధికార పార్టీకి చెందిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కారుపై దాడి కేసులో 8 మంది అనుమానితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సిసి కెమేరాలలో నిక్షిప్తమైన వీడియో ఫుటేజి ఆధారంగా దాడికి పాల్పడిన వైసిపి కార్యకర్తలను గుర్తించారు. జరిగిన ఘటనపై తుళ్లూరు పోలీసులు 145, 146 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదార్లు ఆల శ్రీనాధ్, బపుద్ధ రాజేష్, మేరిగా రాజీవ్, చెరుకూరి రాజేష్, ధారావత్ గోపి నాయక్, పూసల బిపిన్ దత్తశర్మ, కర్రి సుధాకర్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెలగపూడి సచివాలయం రోడ్డులో ర్యాలీకి ఎలాంటి ముందస్తు అనుమతులులేవని, ఓ మహిళా ఎమ్మెల్యే కారును అడ్డుకుని దాడికి దిగిన నేపథ్యంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటాన్ని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆక్షేపిస్తున్నారు. గన్‌మెన్ కాల్పులు జరుపుతామని హెచ్చరికలు జారీ చేయకపోతే పరిస్థితి అదుపుతప్పేదని చెప్తున్నారు.