గుంటూరు

జగన్ పర్యటనతో టిడిపి నేతల వెన్నులో చలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 21: వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి రాజధాని పర్యటన చేసిన ప్రతిసారి టిడిపి నేతల వెన్నులో చలి పుడుతోందని, కంటిమీద కునుకు కరవవుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. శనివారం అరండల్‌పేటలోని వైసిపి నగర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధికి వైసిపి అడ్డుకాదని, ఆ పేరుతో దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్నల పొలాలను అడ్డగోలుగా, దౌర్జన్యంగా తీసుకున్న పాలకుల తీరును మాత్రమే జగన్ ఎండగడుతున్నారన్నారు. జగన్‌పై అర్ధంపర్దం లేని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు మూడేళ్ల పాలనలో ప్రతీది తాత్కాలికమేనని, ప్రజలు అధికారాన్ని కట్టబెట్టింది తాత్కాలిక పనులు చేయడానికా అంటూ ప్రశ్నించారు. విలేఖర్ల సమావేశంలో వైసిపి నాయకులు రాతంశెట్టి సీతారామాంజనేయులు, జగన్ కోటి తదితరులు పాల్గొన్నారు.
చేనేతకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
మంగళగిరి, జనవరి 21: చేనేతకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పద్మశాలీ సాధికారత సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం స్థానిక చిల్లపల్లి కల్యాణ మండపంలో సంఘం ప్రతినిధులు ఎం వెంకటేశ్వరరావు, జె రామ్మోహనరావు, దామర్ల శివవెంకటరాజు, డీవీ శివన్నారాయణ, చిల్లపల్లి శ్రీనివాస్, తాటిపాముల సాంబశివరావు, సానా చౌడయ్యలతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వచ్చే నెల 20న మంగళగిరిలో చేనేత సత్యాగ్రహం, పద్మశాలీ గర్జన నిర్వహించనున్నట్లు తెలిపారు. సినీనటుడు పవన్ కల్యాణ్ ఈ గర్జన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. పద్మశాలీ కులస్తులకు శాసన మండలిలో సభ్వత్వం కల్పించి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, జిల్లాకో పద్మశాలీ భవన్ నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని , చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేయికోట్లు నిధి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇసుక రేవుల పునరుద్ధరణకు కార్యాచరణ
అమరావతి, జనవరి 21: అమరావతి మండల పరిధిలోని మల్లాది, దిడుగు, ధరణికోట, వైకుంఠపురం గ్రామాల్లోని ఇసుక రీచ్‌లను పునఃప్రారంభించేందుకు శనివారం రివర్ కన్జర్వేటింగ్ అధికారులు గనిభూగర్భశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఆయా రేవులను పరిశీలించారు. తహశీల్దార్ భాస్కరరావు మాట్లాడుతూ ఇసుక రేవుల పునఃప్రారంభానికి చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ సిద్ధంచేసి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించనున్నట్లు తెలిపారు.