గుంటూరు

మంగళగిరి వైస్‌చైర్మన్ బాలాజీగుప్తా రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జనవరి 21: మంగళగిరి మున్సిపల్ వైస్‌చైర్మన్ సంకా బాలాజీగుప్తా (టిడిపి) శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావుకు బాలాజీగుప్తా అందజేశారు. బాలాజీగుప్తా రాజీనామా లేఖ అందిందని, వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ఆయన పేర్కొన్నారని కమిషనర్ టీవీ రంగారావు శనివారం రాత్రి తెలిపారు. టిడిపిలో సీనియర్ నేతగా ఉన్న బాలాజీగుప్తా రెండున్నరేళ్లపాటు మున్సిపల్ వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. ఎన్నికల సమయంలో టిడిపి, వామపక్షాల మధ్య వైస్‌చైర్మన్ పదవిపై ఉన్న ఒప్పందం మేరకు బాలాజీగుప్తా రాజీనామా చేసినట్లు టిడిపి వర్గాలు వెల్లడిచాయి.

నియమాలు పాటించకపోవడంతో
పెరుగుతున్న ప్రమాదాలు
అమరావతి, జనవరి 21: రోడ్డు భద్రతా నియమాలు పాటించక పోవడం మూలంగానే తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎందరో మృత్యువాత పడుతున్నారని, అమరావతి సిఐ టి మురళీకృష్ణ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక ఆర్‌వివిఎన్ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతా వారోత్సవాలపై అవగాహన కల్గించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ రమేష్‌బాబు అధ్యక్షత వహించారు. సిఐ మురళీకృష్ణ మాట్లాడుతూ అతివేగం, అధిక బరువు మూలంగా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మద్యం సేవించి, సెల్‌ఫోన్ వాడుతూ వాహనాలు నడపటం, హెల్మెట్ ధరించక పోవడం వల్ల ఎంతో మంది బలైపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ చేకూరి జాజిబాబు, ఎస్‌ఐ కె వెంకటప్రసాద్ పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా హరిహరనాథశర్మ
గుంటూరు (లీగల్), జనవరి 21: గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎ హరిహరనాథశర్మను నియమిస్తూ శనివారం ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు రిజిష్ట్రారు ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు గుంటూరు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన చిలుకూరు సుమలతను రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమి డైరెక్టర్‌గా నియమించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా న్యాయ వ్యవస్థలో అనూహ్యమార్పులు తీసుకురావడంతో పాటు సిబ్బంది సకాలంలో విధులకు హాజరుకావడం, పారదర్శకంగా సేవలు అందించేలా చూడటంతో పాటు, కక్షిదారులకు అవసరమైన సమాచారాన్ని తక్షణమే అందించేలా ఆమె పలు చర్యలు తీసుకున్నారు. విధులు సరిగా నిర్వర్తించని పలువురిని సస్పెండ్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఏడాది తిరగకముందే ఆమె బదిలీకావడం న్యాయవాద వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇలా ఉండగా ఇప్పటివరకు ఖాళీగా ఉన్న గుంటూరు 1వ అదనపు జిల్లా కోర్టుకు న్యాయమూర్తిగా జ్యుడిషియల్ అకాడమిగా అదనపు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఎన్ నరసింగరావును నియమిస్తూ ఉత్వర్వులు జారీ అయ్యాయి.