గుంటూరు

కార్పొరేట్ ఆస్పత్రులు మెరుగైన సేవలందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 30: కార్పొరేట్ హాస్పిటల్స్ సైతం పేదలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్యసేవలు అందించేలా చూడాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం కొత్తపేటలోని శ్రీ బాలాజీ హాస్పిటల్‌ను మంత్రి కామినేని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్‌టిఆర్ వైద్య సేవ కింద పేదలతో పాటు ఉద్యోగులు, జర్నలిస్టులకు నగదు రహిత వైద్యసేవలను ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. ఫిబ్రవరి 1 నుండి రాష్టవ్య్రాప్తంగా 432 ఆషా, ఆప్నా ఆసుపత్రులు వైద్యసేవలు అందించేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. రాష్టవ్య్రాప్తంగా త్వరలో 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, జర్నలిస్టులకు హెల్త్‌కార్డుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నగదు రహిత వైద్యసేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాస్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, మహ్మద్ ముస్త్ఫా, ఆసుపత్రి ఎండి డాక్టర్ భావనాశి కాశీవిశ్వనాథం, వైద్యులు అమర్‌నాథ్, సిహెచ్ శివరామకృష్ణ, ఎస్‌బిఐ రీజనల్ మేనేజర్ వాకా శ్రీనివాసులురెడ్డి, క్రేన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జివిఎస్‌ఎల్ కాంతారావు, టిడిపి నాయకులు మద్దాళి గిరిధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలి
గుంటూరు (కొత్తపేట), జనవరి 30: ఉపాధ్యాయులు తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించాలని ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక బ్రాడీపేటలోని దేశభక్త భవన్‌లో దక్షిణభారత దేశంలో వివిధ నవోదయ విద్యాలయాల్లో పనిచేస్తున్న గ్రంథాలయ అధికారులకు 5 రోజుల శిక్షణా శిబిరం ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభకు నవోదయ విద్యాసంస్థల జిల్లా డైరెక్టర్ జంధ్యాల వెంకటరమణ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి ఎఎస్ రామకృష్ణ మాట్లాడుతూ నేటి కంప్యూటర్ యుగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా గ్రంథాలయ అధికారులు నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు. మేరీ స్టెల్లా కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ రాణీశ్యామలాంబ, ఎపిఆర్‌ఐ లైబ్రేరియన్ డాక్టర్ మల్లేశ్వర్, కృష్ణా జిల్లా నవోదయ విద్యాలయ లైబ్రేరియన్ ఎం కృష్ణారెడ్డి, కోగంటి విజయబాబు, సిరిపురపు కోటేశ్వరరావు, కో ఆర్డినేటర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.