గుంటూరు

నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 30: నగరంలోని ఎస్‌విఎన్ కాలనీ 5వ లైనులో చేపట్టనున్న భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులను సోమవారం ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, మహ్మద్ ముస్త్ఫా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మోదుగుల మాట్లాడుతూ 902 కోట్ల రూపాయలో చేపట్టనున్న మురుగునీటి పారుదల వ్యవస్థ పూరె్తైతే ఆరోగ్యకరమైన నగరంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ సహకారంతో గుంటూరు నగరానికి మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మించుకోవడం సంతోషదాయకమని, నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను, ప్రాజెక్టు కాంట్రాక్టర్ షాపూర్జీ పల్లోంజి కంపెనీ ప్రతినిధులను కోరారు. నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టు పనులను ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే మహ్మద్ ముస్త్ఫా మాట్లాడుతూ నగర ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఒక నిర్దిష్ట ప్రణాళికతో భూగర్భ మురుగునీటి పారుదల ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ నగరాన్ని 5 జోన్లుగా విభజించి, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు కింద సుమారు 1083 కిలోమీటర్ల మేర భూగర్భ మురుగునీరు పారుదల పైపులైన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. లక్షా 40 వేల గృహాల నుండి పైపులైన్ల ద్వారా ఈ ప్రాజెక్టును అనుసంధానం చేస్తున్నట్లు కమిషనర్ వివరించారు. ఇప్పటికే నగరంలో 400 కోట్ల రూపాయలతో తాగునీటి పథకం పనులు చేపట్టడం జరిగిందని, సుమారు 90 శాతం పనులు పూర్తయినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో పురపాలక శాఖ ఎస్‌ఇ గోపాలకృష్ణ, అమృత స్కీమ్ సలహాదారులు కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దాళి గిరి, ప్రాజెక్టు కాంట్రాక్టర్స్ షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధులు పురపాలకశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.