గుంటూరు

నేటి నుంచి టిడిపి సంస్థాగత ఎన్నికలకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), ఫిబ్రవరి 2: జిల్లాలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారుల శిక్షణా శిబిరం మూడో తేదీ నుండి ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశించినట్లు జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి కంచర్ల శివరామయ్య పేర్కొన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 20 మంది ఎన్నికల అధికారులను గుర్తించడమైందన్నారు. గుంటూరు డివిజన్ తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు, పెదకూరపాడు, గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఎన్నికల అధికారులకు జిల్లా పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి శిక్షణా శిబిరాలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. నరసరావుపేట, గురజాల, చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండ, మాచర్ల నియోజకవర్గాల ఎన్నికల అధికారులకు 4వ తేదీ చిలకలూరిపేట మార్కెట్ యార్డు నందు శిక్షణా కార్యక్రమం జరుగుతుందని వివరించారు. తెనాలి డివిజన్ తెనాలి, వేమూరు, పొన్నూరు, రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల వారికి తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 4వ తేదీ సాయంత్రం 3 గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు. శిక్షణా కార్యక్రమాలకు జిల్లా పార్టీ అధ్యక్షులు జివి ఆంజనేయులు ముఖ్యఅతిధిగా హాజరవుతారు. రాష్ట్ర పార్టీ పరిశీలకులుగా గుంటూరు డివిజన్‌కు పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ, తెనాలి డివిజన్‌కు రాష్ట్ర పార్టీ కార్యదర్శి కోమటి సుధాకర్, కృష్ణాజిల్లా బిసిసెల్ అధ్యక్షులు గురుమూర్తి, నరసరావుపేట గురజాల డివిజన్లకు రాష్టప్రార్టీ కార్యదర్శి నారంశెట్టి పాపారావు, నూకసాని బాలాజీ హాజరవుతారని గుంటూరు జిల్లా పార్టీ తరుపున శిక్షణా కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా గుంటూరు డివిజన్‌కు వెన్నా సాంబశివారెడ్డి, తెనాలి డివిజన్‌కు మానుకొండ శివప్రసాద్, నరసరావుపేట, గురజాల డివిజన్‌కు షేక్ లాల్‌వజీర్‌లు నియమితులయ్యారు.
మహిళా బిల్లుకు మోక్షం కల్పించాలి
గుంటూరు(కొత్తపేట), ఫిబ్రవరి 2: పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు పాస్ చేయించాలని టిడిపి మహిళా నాయకురాలు నన్నపనేని విజయలక్ష్మి , పద్మావతి, రమణమ్మలు కోరారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకర్లు సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో జరుగుతున్న ఈ సందర్బంలోనైనా మహిళలకు రిజర్వేషన్లలో ప్రాధాన్యత కల్పించాలన్నారు. గత ప్రభుత్వాలు మహిళా బిల్లుపై కాలయాపన చేసి, చట్టరూపం కావడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు. ప్రస్తుత బిజెపి ప్రభుత్వమైనా బిల్లు పాస్ చేయాలని కోరారు. అలాగే స్పీకర్ కోడెల శివప్రసాద్ మహిళా హక్కుల కోసం సభలు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా ఉందన్నారు. సమావేశంలో లంకా మాధవి, హేమలత, మేదరమెట్ల సుభద్ర, యార్లగడ్ల ప్రమీల, మల్లేశ్వరి , హనుమాయమ్మ తదితరులు పాల్గొన్నారు.