గుంటూరు

తప్పుడు సర్వే నంబర్లతో ప్రభుత్వ స్థలాల విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనల్లి, ఫిబ్రవరి 2:ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించి సుమారు రెండు ఎకరాలను ప్లాట్లగా విక్రయించిన సంఘటన సత్తెనపల్లిలో ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది. ఓ ప్రముఖ వ్యక్తి నమ్మకంగా పట్టణంలోని చాలామందిని నిమ్మించి ప్రభుత్వ స్థలాన్ని తన స్థలంగా అమ్మేశాడు ఆ ప్రబుద్ధుడు. అతని ఘరానా మోసం బయట పడేసరికి కొంత అప్పులు చేసి లక్షలు వెచ్చించి గత ఎనిమిది సంవత్సరాల క్రితం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని చివరకి ఇది ప్రభుత్వ భూమని ఇటీవల మున్సిపల్ అధికారులు పేద ప్రజలకు ఈ స్థలాన్ని కేటాయించడంతో అసలు నిజం బట్టబయలైంది. దీనితీ బాధితులు పోలీసుల్ని, లాయర్లని ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయడంలో సంబంధిత రిజిస్ట్రార్‌కి బారీగానే ముడుపులు ముట్టాయని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాలప్రకారం నందిగామ డొంక రోడ్డులోని సర్వే నెంబర్ 336-2 ఎకరాలను సత్తెనపల్లి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి ఈ దారుణానికి వడికాట్టాడని బాధితులు వాపోయారు. మున్సిపల్ కమిషనర్ జి సాంబశివరావును సంప్రదించగా సదరు వ్యక్తి తప్పుడు సర్వే నంబర్లలో ఆ స్థలాన్ని విక్రయించాడని, ఇది ప్రభుత్వ స్థలమని ప్రభుత్వ అబివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దీనిపై ప్రభుత్వం బాధితుల తరపున నిలబడి తగు న్యాయం చేయాలని కోరుతున్నారు.
పింఛన్లు ఐదు రెట్లు పెంచిన ఘనత బాబుదే...
వేమూరు, ఫిబ్రవరి 2: వృద్ధులకు పింఛన్లు ఐదు రెట్లు పెంచి కుటుంబానికి పెద్దదిక్కుగా చంద్రబాబు మారారని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. గురువారం మండల పరిషత్ మీటింగ్ హాలులో ఎంపిపి కె నరసింహారావు అధ్యక్షతన కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిధి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా 4 లక్షల 60 వేల మందికి పెన్షన్ల కోసం 6వేల కోట్లు రూపాయలు హెచ్చిస్తున్నట్లు చెప్పారు. మండలంలో 5208 మందికి ఇస్తున్నట్లు, కొత్తగా 358మందికి ఇస్తున్నట్లు, అర్హులైన మరో 300 మందికి కూడా రాబోవు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్లు మంజూరు చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన రాష్ట్రం 16వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా, రైతుల పక్షపాతి కావడంతో 24వేల కోట్లు రుణమాఫీ చేసి రైతుబాంధవుడుగా చంద్రబాబు ఆదుకున్నారన్నారు. వైసిపికి చెందిన ఎంపిపి చవ్వాకుల రాఘవరావు మాట్లాడుతూ నిత్యవసర వస్తువులు పెరగటంతో పింఛన్ వెయ్యి చేశారని, జన్మభూమి కమిటీ సభ్యులు న్యాయంగా, ధర్మంగా కొత్త వారిని ఎంపిక చేసి ఉంటారని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్ జొన్నలగడ్డ విజయ్‌బాబు, జిల్లా టిడిపి నాయకులు కోగంటి లవ్‌కుమార్, మండల టిడిపి అధ్యక్షుడు గాజుల కృష్ణమూర్తి, దళిత నాయకులు మిరియాల జాన్‌రాజేంద్రబాబు, వెన్నం నాగరాజు, ఎంపిటిసిలు గవిని రామకృష్ణప్రసాద్, గోగినేని కేశవరావు, డిటి శర్మ, పెరవలిపాలెం, పోతుమర్రు, అబ్బనగూడవల్లి, పెరవలి సర్పంచ్‌లు పుసులూరి సాంబశివరావు, చుక్కా ఏసురత్నం, భాగ్యలక్ష్మి, లంకపల్లి వేణుమ్మ, ఫించన్‌దారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత తహశీల్దార్ కార్యాలయ సమీపంలో పట్టుపరిశ్రమల పెంపకం భవనం ఎమ్మెల్యే ప్రారంబించారు.