గుంటూరు

విద్యార్థుల భవిత ఉపాధ్యాయులదే: కోడెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, ఏప్రిల్ 17: విద్యార్థులందరూ చదువులో రాణించి ప్రయోజకులు కావాలంటే తల్లిదండ్రులకన్నా ఉపాధ్యాయుల బోధనపైన వారి భవిత ఆధారపడి వుంటుందని సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆదివారం పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో కోటి 25 లక్షల రూపాయల నిధులతో నిర్హించిన నూతన కస్తూరిబా బాంధి బాలికా విద్యాలయం ప్రారంబోత్సవ కార్యక్రమంలో సభాపతి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కష్టపడి కాకుండా ఇష్టంగా విద్యను అభ్యసించాలని తద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్ధినులకు సభాపతి సూచించారు. ఈ సందర్భంగా పాటశాల చుట్టూ ప్రహరీగోడ అవసరమని ప్రత్యేక అధికారి ఎస్ బ్లెస్సీ దైవ సృజన సభాలతి దృష్టికి తీసుకువాచ్చారు. స్పందించిన కోడెల పాఠశాలకు అవసరమైన వౌలిక సదుపాయాలను సమకూరుస్తానని హామీనిచ్చారు. విద్యార్థినిలు చేసిన స్వాగత సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, మార్కెట్‌యార్డు చైర్మన్ ఆళ్ళ సాంబయ్య, ఎంపీపీ బొర్రా కోటేశ్వరరావు, ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్ కుమార్, జీసీడీ శేషుబాబు, ఎం అంతయ్య, భీమనేని వందనాదేవి, ముప్ఫాళ్ళ ప్రత్యేక అధికారి టి ఉషారాణి, కౌన్సిలర్లు బచ్చు మనోహర్, సాయిలీల, కమీషనర్ సాంబశివరావు, అట్లూరి కోటేశ్వరరావు, సర్పంచ్ కట్టా రమేష్ తదితరులు పాల్గొన్నారు.