గుంటూరు

రైతన్న, నేతన్నల కన్నీరు సుభిక్షం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఫిబ్రవరి 20: అన్నం పెట్టే రైతన్న, వస్త్రం నేసే నేతన్న కన్నీరు కార్చడం దేశానికి సుభిక్షం కాదని , వారి సమస్యల పరిష్కారానికి పాలకులు చొరవ చూపాలని సినీనటుడు, జనసేన పార్టీ అధినేత కె పవన్ కల్యాణ్ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట కాజ గ్రామ పరిధిలో విశాలమైన ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలీయ సాధికారత సంఘం ఆధ్వర్యాన సోమవారం జరిగిన చేనేత సత్యాగ్రహం, చేనేత ఐక్యగర్జన సభలో ఆయన ముఖ్య అతిధిగా ప్రసంగించారు. సభకు సాధికారత సంఘం అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అన్నంపెట్టే రైతన్న, బట్టలు తయారు చేసే నేతన్న, సరిహద్దులో కాపలాకాసే జవాను అంటే తనకు ఎనలేని గౌరవమని, బట్టలు నేసే వారిని తాను కార్మికుడిగా చూడనని, చేనేత కళాకారుడిగా భావిస్తానని, చీరాలలో ఉన్నప్పుడు వారి కష్టాలు స్వయంగా చూశానని ఆయన అన్నారు. పారిశ్రామికవేత్తలు తయారు చేసే వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటే తనకు కోట్ల రూపాయలు వస్తాయని, ఐతే దాన్ని కాదనుకుని చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని చెప్పానని, అదే తనకు సంతృప్తి, కోట్ల సంపాదన అని ఆయన అన్నారు. విస్తరాకులు ఎత్తేసే వారంటూ తనను కొందరు కించపరిచే విధంగా మాట్లాడారని, ఐతే విస్తరాకులు ఎత్తివేసే వృత్తిని తాను గర్వపడతానని, చెత్తను శుభ్రం చేయకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయని పవన్‌కల్యాణ్ అన్నారు. 11 రకాల వస్త్రాలు చేనేత వృత్తిదారులే చేయాలని చట్టం ఉన్నప్పటికీ పవర్‌లూమ్‌ల నుంచి అవి తయారవుతుంటే పాలకులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. సినిమాకి పైరసీ నియంత్రణ మాదిరిగా ఒక ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఎంతో నైపుణ్యమున్న చేనేత కళాకారులు సరైన ఆదాయం కరువై కూలిపనులకు వెళ్లాల్సి రావడం దురదృష్టకరమన్నారు. పాలకులు ఇచ్చిన హామీల అమలుకు చేనేత కార్మికసంఘాలు ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి హామీలు ఎంతవరకు అమలవుతున్నాయో పరిశీలించాలని ఆయన అన్నారు. క్రికెట్, టెన్నిస్‌లాంటి క్రీడల్లో రాణించే వారికి ఇస్తున్న మాదిరిగా చేనేత కార్మికులకు నగదు ప్రోత్సాహం ఇస్తే బాగుంటుందని పవన్‌కల్యాణ్ అన్నారు. అధికారం కోసం తాను జనసేన పార్టీ పెట్టలేదని, ఆపదలో ఉన్నవారికి అండగా ఉండేందుకు పార్టీ పెట్టానని, 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీచేస్తుందని, చట్టసభలో చేనేత సమస్యలు విన్పించేందుకు ముందుంటామని ఆయన అన్నారు. తెలుగువారంతా వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలని, పంచెకట్టి మెడలో కండువా వేసుకోవటాన్ని తాను గర్వపడతానని ఆయన పేర్కొంటూ గాంధీ వడికిర చేనేతకు ఆఖరి శ్వాసవరకు నిలబడతానని పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే మార్చి 14కు జనసేన పార్టీ ఏర్పడి మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతోందని, ఈ పార్టీకి ప్రజలే బలమని, తుపాకులు ఎదురైనా నిలబడే దమ్మున్న నేతల కోసం ఎదురు చూస్తున్నామని అటువంటి వారితోనే పార్టీ నిర్మాణం జరుగుతుందని, యువరక్తం జనసేనలోకి రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మార్చి 14న జనసేన పార్టీ వెబ్‌సైట్ ప్రారంభిస్తామని, చేనేత, మైనింగ్, వ్యవసాయ, ఇతర ఎటువంటి సమస్యలైనా తెలియ జేయవచ్చని, అలా సమస్యలు తెలుసుకుని 2019 ఎన్నికల మేనిఫెస్టో తయారు చేస్తామని పవన్‌కల్యాణ్ అన్నారు. స్వర్ణకార వృత్తిదారులకు తాను అండగా ఉంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. సభకు అధ్యక్షత వహించిన పద్మశాలీ సాధికారత సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారపు శ్రీనివాసరావు మాట్లాడుతూ పవర్‌లూమ్స్ వలన చేనేత దెబ్బతింటోందని అన్నారు. చేనేత కార్మికుల బతుకులు మెరుగు పడాలంటే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో చేనేత వస్త్రాలు విక్రయించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు, హాస్టళ్లల్లో వాడే వస్త్రాలను చేనేతవి వాడే విధంగా జిఓ ఇవ్వాలని, రాష్ట్ర రాజధానిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటుకు 50 ఎకరాల స్థలం కేటాయించాలని, జిల్లాకో చేనేత భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వేదికపై సాధికారత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఎఎన్ మూర్తిమాట్లాడుతూ రాష్ట్రంలో 14 శాతంగా ఉన్న చేనేత జనాభా వెనుకబడి ఉందని, వేయికోట్ల మూలధనంతో చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పవన్‌కల్యాణ్ అండగా ఉంటే చేనేత వర్గాలకు కోటిమందికి అండగా ఉన్నట్లేనని ఆయన అన్నారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వేలకోట్ల రూపాయల వస్త్ర వ్యాపారం జరుగుతోందని, ప్రభుత్వం నిర్వహించే ఆప్కోలో మాత్రం వందలకోట్ల వ్యాపారం మాత్రమే జరుగుతోందని, ఈ పరిస్థితికి కారణాలను ప్రభుత్వం శోధించాలని కోరారు. ఈ సభ అంతం కాదు ఆరంభం అని, చేనేత సమస్యలపై ప్రభుత్వాలు నిండు మనసుతో ఆలోచించాలని, తన వంతుగా ఇటీవల రాజ్యసభలో చేనేత సమస్యలు ప్రస్తావించానని ఆనందభాస్కర్ అన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగ్గారపు రామ్మోహనరావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బివి శివన్నారాయణ, కర్నాటక ఎమ్మెల్సీ కేసీ కొండయ్య, సమ్మారావు, చిల్లపల్లి మోహనరావు, చిల్లపల్లి శ్రీనివాసరావు, కొలను కృష్ణ, రామకృష్ణ, బూదాటి రాఘవయ్య, విజయలక్ష్మి, యడ్ల గీత, పి లక్ష్మణస్వామి, సిహెచ్ వరదయ్య, దామర్ల శివశెంకటరాజు, దివి రాము తదితరులు మాట్లాడారు. వేదికపై పవన్ కల్యాణ్‌ను గజమాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.

మహిళ ఆత్మహత్య
రాజుపాలెం, ఫిబ్రవరి 10: మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కొండమోడు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గత 20 సంవత్సరాల క్రితం శివరాత్రి సాంబ్రాజ్యం (40) అనే మహిళకు నర్సరావుపేట, ఉప్పలపాడు గ్రామానికి చెందిన రామయ్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. గత ఐదేళ్లుగా మానసిక స్థితి సరిగా లేకపోవడంతో సాంబ్రాజ్యం గతంలో కూడా ఆత్మహత్యకు యత్నించింది. రెండు రోజులుగా సాంబ్రాజ్యంకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో భర్త ఆమెను పుట్టింటికి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఒక పాస్టర్ చేత ప్రార్థన చేయించుకుందామని ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకుని కొంతసేపు ఉంటానని వెనుకగదిలోకి వెళ్లిన ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మృతిచెందింది. ఆమెకు ముగ్గురు పిల్లలు కలదు. బంధువల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.