గుంటూరు

ఎఎన్‌యు ఎదుట చేనేత సత్యాగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఫిబ్రవరి 20: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ సాధికారత సంఘం ఆధ్వర్యాన సోమవారం ఆచార్య నాగార్జునా విశ్వ విద్యాలయం ఎదుట కాజ గ్రామపరధిలో విశాలమైన ప్రాంగణంలో 13 జిల్లాలకు చెందిన చేనేత కులాలవారు సుమారు 60 మంది చేనేత సత్యాగ్రహం జరిపారు. జాతీయజెండా చేతబూని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సత్యాగ్రహం చేశారు. సాధికారత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఎఎన్ మూర్తి, సంఘం నాయకులు మునగాల మల్లేశ్వరరావు, మునగపాటి వెంకటేశ్వరరావు తదితరులతో కలిపి 60 మంది వరకు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. సాయంత్రం జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు కె పవన్‌కల్యాణ్ సత్యాగ్రహం , చేనేత ఐక్యగర్జన ప్రాంగణానికి విచ్చేసి సత్యాగ్రహంలో ఉన్న మూర్తి తదితరులతో నిమ్మరసం అందించి చేనేత సమస్యల పట్ల తాను అండగా ఉంటానని ప్రకటించి విరమింపజేశారు. అంతకు ముందు పవన్‌కల్యాణ్ అక్కడ చేనేతపై వస్త్రం తయారుచేసే విధానాన్ని, తయారైన వస్త్రాన్ని రాట్నం వడకటం పరిశీలించారు. చేనేత వర్గాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సత్యాగ్రహం ప్రారంభానికి ముందు అధ్యక్షుడు కెఎఎన్ మూర్తి మాట్లాడుతూ ప్రజలకు నాగరికత నేర్పిన జాతి చేనేతని అన్నారు. దేశంలో అన్ని వర్గాలు సంపద సృష్టించుకున్నప్పటికీ చేనేత కార్మికులు వెనుకబడి ఉన్నారని, తలసరిసగటు ఆదాయం లక్షా 3 వేలు కాగా చేనేతలకు మాత్రం 29,700 రూపాయలుగా మాత్రమే ఉందని ఆయన అన్నారు. పాదయాత్రల సమయంలో రాజకీయ పార్టీలనేతలు చేనేత వర్గాల సమస్యలు తెలుసుకుని మొసలికన్నీరు కార్చడం తప్ప ఉద్ధరించిందేమీ లేదని మూర్తి అన్నారు. బట్టలునేసే వృత్తిలో ఉన్నవారికి ఒంటిపై బట్టకూడా ఉండని దుర్భరస్థితిలో చేనేత ఉందని, రైతుల తరువాత ఎక్కువమంది ఉపాధి చేనేత ద్వారానే పొందుతున్నారని, ఆత్మహత్యలు కూడా రైతుల తరువాత వీరిదేనని మూర్తి అన్నారు. ఆత్మహత్యలకు గురైన నేత కార్మికులకు ఎక్స్‌గ్రేషియాలు ఇవ్వడం కాకుండా పాలకులు దానికి కారణాలను శోధించి పరిష్కరించాలని ఆయన అన్నారు. కాపులకు, బ్రాహ్మణులకు, మరో 9 వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, పదేళ్లుగా అడుగుతున్నా చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కృష్జాణ, గోదావరి పుష్కరాలకు, విశాఖలో బీచ్ ఫెస్టివల్‌కు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని, చేనేత సంక్షేమానికి మాత్రం నిధులు కేటాయించేందుకు ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలున్నా , శాసనమండలిలో 56 మంది ఎమ్మెల్సీలున్నా ఒక్కరు కూడా చేనేత వర్గానికి చెందిన వారు లేరని, ఏ రాజకీయ పార్టీ వీరికి ప్రాధాన్యత ఇవ్వడంలేదన్నారు. టిడిపి ప్రభుత్వం చేనేత ఐక్యగర్జన విఫలం చేయడానికి ఎన్నో కుయుక్తులు పన్నిందని ఆయన ఆరోపించారు.