గుంటూరు

కొండవీడు కోటలో త్వరలో అంతర్గత రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యడ్లపాడు, ఫిబ్రవరి 23: గుంటూరు జిల్లా కొండవీడులోని చారిత్రాత్మక కొండవీడు కోటలో త్వరలో అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గురువారం మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, కొండవీడుకోట పరిసరాలను పరిశీలించారు. కొండపైకి ఘాట్‌రోడ్డు నిర్మాణం 80 శాతం పూరె్తైందని, కొండపై 121 హెక్టార్ల అటవీభూమి అభివృద్ధి చేయాల్సి ఉందని, ఈ భూమిని డీనోటిఫై అయిన తర్వాత పనులు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. కోట ప్రాచుర్యాన్ని ప్రజలకు తెలిసేలా ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొదటిదశలో 35 కోట్ల రూపాయలతో 5 కిలోమీటర్ల నిడివిన కొండవీడు కోటకు ఘాట్‌రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. సిఆర్‌డిఎ పరిధిలో 38 హెక్టార్ల భూమి ఉందని, మిగిలిన భూమి అటవీశాఖ నుండి తీసుకోవాల్సి ఉందన్నారు. రాబోవు 45 రోజుల్లో ఘాట్‌రోడ్డు నుండి కొండవీడుకోట లోపలికి రోడ్ల నిర్మాణానికి అవసరమైన 5 హెక్టార్ల అటవీభూమిని తీసుకుని పనులు ప్రారంభించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు. కొండవీడుకోట మైదాన ప్రాంతంలో 6 దేవాలయాలు, 3 చెరువులను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. కొండపై పర్యాటకుల కోసం 5 నక్షత్రాల హోటల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొండవీడు ప్రాచుర్యాన్ని తెలిపే విధంగా త్వరలో కొండవీడు ఉత్సవాలను ప్రారంభిస్తామని తెలిపారు. కొండవీడు నుంచి కోట వరకు లైటింగ్, తాగునీరు తదితర సదుపాయాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిరంగిపురం నుండి కొత్తపాలెం గ్రామం మీదుగా కొండవీడు వరకు 8 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కొండవీడుకోట కట్టడాలను కాపాడి గత వైభవ చిహ్నాలుగా ముందుతరాలకు అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మంత్రి చెప్పారు. మంత్రి రావెల కిషోర్‌బాబు కొండవీడు కోటను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.

ప్రియునితో కలిసి
భర్తను హత్య చేసిన భార్య
కొల్లిపర, ఫిబ్రవరి 23: ప్రియుడితో కలిసి భార్య తన భర్తను హత్యచేసిన సంఘటన మండల కేంద్రమైన కొల్లిపర దళితవాడలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. తెనాలి డిఎస్పీ జివి రమణమూర్తి కధనం ప్రకారం కొల్లిపర గ్రామానికి చెందిన నూతక్కి దీనప్రసాద్ (30)కు అమృతలూరుకు చెందిన సౌజన్యతో 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈపెండ్లికి ముందే సౌజన్య అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ సజ్జా నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో నాగరాజు బుధవారం అర్ధరాత్రి సమయంలో కొల్లిపరలోని దీనప్రసాద్ ఇంటికి రాగా నాగరాజు, దీనప్రసాద్‌ల మధ్య వాగ్వివాదం అనంతరం ఘర్షణ జరిగింది. ఈ సమయంలో సౌజన్య ప్రియుడు నాగరాజుకు సహకరించటంతో ఇరువురు కలిసి పదునైన కత్తితో ప్రసాద్ గొంతుకోసి హతమార్చారు. రక్తపు మడుగులోపడి గిలగిలా తన్నుకుంటూ ప్రసాద్ అక్కడికి అక్కడే మృతి చెందాడు. భర్తను భార్య చంపిన సంఘటన ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారి కావటంతో సంచలనమైంది. దీనప్రసాద్‌కు ఇద్దరు పిల్లలున్నారు. సంఘటన సమాచారం అందుకున్న డిఎస్పీ రమణమూర్తి, రూరల్ సిఐ చినమల్లయ్య, దుగ్గిరాల ఎస్‌ఐ మురళీలు తమ సిబ్బందితో సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని ప్రాథమిక సమాచారం సేకరించారు. శవ పంచానామా అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్ నిమిత్తం తెనాలి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుని తల్లి నాగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ చెప్పారు. కాగా ప్రసాద్ భార్య సౌజన్యను పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రియుడు నాగరాజు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కోటప్పకొండ తిరునాళ్ళకు సర్వం సిద్ధం

నరసరావుపేట,్ఫబ్రవరి 23: మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని కోటప్పకొండ దేవస్థానం వద్ద జరిగే తిరునాళ్ళకు అన్ని శాఖల అధికారులు సర్వం సిద్ధం చేశారు. కోటప్పకొండ తిరునాళ్ళ రాష్ట్ర పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పటికే 25 లక్షల రూపాయలు దేవస్థానానికి అందాయి. మరో 25 లక్షల రూపాయలు అవసరమవుతాయని దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే కొండకు పోలీసు బలగాలు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. దేవస్థానంలో అన్ని క్యూలైన్లు ఏర్పాటు చేశారు. లక్షలాది రూపాయల వ్యయంతో దేవాలయ ప్రాంగణంలో బెంగుళూరు, ఊటీ నుండి వచ్చిన పూలతో అందంగా అలంకరించారు. షామియానాలు, పందిళ్లను మెట్ల మార్గంలోనూ, కొండ పైభాగంలోనూ ఏర్పాటు చేశారు. విద్యుద్దీపాలతో దేవాలయాన్ని సుందరంగా అలకరించారు. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాలుగు రకాల క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ధర్మదర్శనం, శీఘ్రదర్శనం, ప్రత్యేక దర్శనం, మండపాల అభిషేకం ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 1.75 లక్షల లడ్డూలు, 75వేల అరిసె ప్రసాదాన్ని తయారు చేశారు. లక్ష మంచినీటి ప్యాకెట్లను భక్తుల కోసం నిలవ ఉంచారు. దేవాయలం ఎగువ, దిగువ ప్రాంతాల్లో అధికంగా కుళాయిలను ఏర్పాటు చేశారు. వివిధ భక్త సమాజాల వారు, సేవా సంస్థల నిర్వాహకులు, కెసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ వారు, సద్గురు సేవాసంస్థ, శ్రీనివాస సేవాసమితి నిర్వాహకులు రానున్న భక్తుల కోసం పులిహోర, చక్కెర పొంగలి, దద్యోదనం, మజ్జిగ, రస్నా వంటివి సిద్ధంగా ఉంచారు. స్కౌట్స్ అండ్ గైడ్స్, జెఎన్‌టీయూకె వలంటీర్లు, 60 మంది ప్రత్యేకమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి చెత్తచెదారం లేకుండా ఉండేందుకు అధిక సంఖ్యలో శానిటరీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. భక్తులు తల నీలాలు ఇచ్చేందుకు షెడ్డుల్లో మంచినీరు, బయట వైపున కుళాయిలను ఏర్పాటు చేశారు. నేటి రాత్రి నుండి ప్రైవేట్ వాహనాలను కొండపైకి అనుమతించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. అర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో కొండపైకి వెళ్లాల్సి ఉంది. వీఐపీ, వీవీఐపీలు కూడా కొండపైన స్వామి వారి దర్శనం కోసం ఆర్టీసీ బస్సులోనే వెళ్లాల్సిన పరిస్థితి. ఎగువ సన్నిధానంకు వృద్ధులు, వికలాంగులు వచ్చేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజాము రెండు గంటల సమయంలో స్వామివారికి బిందె తీర్థం తీసుకురావడం జరుగుతుందన్నారు. ఉదయం రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాలో స్వామివారికి పట్టు వస్త్రాలు అందచేయనున్నారు. రాత్రి పది గంటలకు విఘ్నేశ్వరపూజతో ప్రారంభమై లింగోద్భవ అభిషేకాలు అర్ధరాత్రి 12 గంటలకు మొదలై, తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొనసాగుతాయన్నారు. అదే విధంగా బొల్లెపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో యాగశాలలో రుద్రయాగం, చండీహోమం, శుక్రవారం అర్ధరాత్రి జరిగే పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది.
* కోటప్పకొండ తిరునాళ్ళ బందోబస్తుకు మూడువేల మంది పోలీసులు
కోటప్పకొండ తిరునాళ్ళకు మూడువేల మంది పోలీస్ సిబ్బంది పనిచేస్తుందని నరసరావుపేట డిఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా నలుగురు అడిషనల్ ఎస్పీలు, 16 మంది డిఎస్పీలు, 50 మంది సిఐలు, 150 మంది ఎస్‌ఐలు, 2,780 మంది ఇతర సిబ్బంది పాల్గొంటున్నారని అన్నారు. అదే విధంగా నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాల నుండి కోటప్పకొండకు 46 ప్రభలకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుండి 18, నరసరావుపేట నియోజకవర్గం నుండి 28 ప్రభలకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు. కొండ దిగువ ప్రాంతంలోని నాలుగు రోడ్ల కూడళ్ళలో తాత్కాలిక పోలీస్‌స్టేషన్, కొండ ఎగువ ప్రాంతంలో అవుట్‌పోస్టును ఏర్పాటు చేశారు.
* దేవాలయానికి చేరుకున్న జెయింట్‌వీల్స్,ఆటవస్తువులు, చెరుకుగడలు
మరి కొద్ది గంటల్లో కోటప్పకొండ తిరునాళ్ళ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొండ వద్ద పలు అంగళ్ళు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా వందలాది అంగళ్ళను ఏర్పాటు చేసి, వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. చెరుకుగడల స్టాల్స్, జెయింట్ వీల్స్, బొమ్మల స్టాల్స్, బూందీ, జిలేబీ దుకాణాలు రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. తిరునాళ్లకు వచ్చే భక్తులు, ప్రజలు ఈ తినుబండారాలను కొనుగోలు చేయడమే కాక, తిరిగి గృహాలకు వెళ్ళే సమయంలో ఇంటికి తీసుకెళ్ళడం ఆనవాయితీగా ఉంటుంది. కూల్‌డ్రింక్స్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.
ఏసిబి వలలో
కొలకలూరు పంచాయతీ కార్యదర్శి
* ఇంటిపన్ను పేరు మార్పుకోసం రూ 10 వేలు డిమాండ్
* సొమ్ము తీసుకుంటూ అడ్డంగా దొరికిన వైనం
తెనాలి రూరల్, ఫిబ్రవరి 23: అవినీతి నిరోదకశాఖ వలలో కొలకలూరు పంచాయితీ కార్యదర్శి ఇంటిపన్ను పేరుమార్పుకోసం 10వేల రూపాయల లంచం డిమాండ్ చేసి ఏసిబి అధికారులకు అడ్డంగా బుక్కైయ్యారు. ఏసిబి డిఎస్పీ శాంతో కధనం ప్రకారం తెనాలి మండలం కొలకలూరు గ్రామ పంచాయితీ పరిదిలోని ఖాజీపేట గ్రామస్తుడు గద్దే వెంకట సత్యనారాయణ తన తాత జానయ్య పేరుతో ఉన్న ఇంటి పన్ను డిమాండ్‌ను తన తండ్రి ఏడుకొండలు పేరుతో మార్పు చేయాలని సంబందిత దృవపత్రాలతో కార్యదర్శి చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు. అయితే సదరు పంచాయతీ కార్యదర్శి బంగారు శ్రీనివాసరావు పన్ను రశీదులో పేరు మార్చేందుకు ముందుగా 500, తరువాత 4000 రూపాయలు తీసుకున్నట్లు బాదితుడు తెలిపాడు. కాగా బుధవారం రాత్రి 10వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయటంతో దిక్కుతోచక గుంటూరు ఏసిబి అధికారులను ఆశ్రయించినట్లు చెప్పాడు. గురువారం మధ్యాహ్న సమయంలో పంచాయతీ కార్యదర్శి తన కార్యాలయంలో 10వేల రూపాయలు బాధితుని నుండి తీసుకొంటుండగా ఏసిబి అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. అతడి నుండి నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుని విజయవాడ ఏసిబి కోర్టులో అప్పగించనున్నట్లు డిఎస్పీ శాంతో చెప్పారు. ఈదాడిలో సిఐ వెంకటేశ్వర్లు సిబ్బంది ఉన్నారు.
ఉయ్యందన దుర్ఘటన బాధాకరం
సత్తెనపల్లి, ఫిబ్రవరి 23:క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామంలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడడం అత్యంత బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి అవేదనను వెలిబుచ్చారు. గురువారం అమె సత్తెనపల్లి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ సంఘటనపై మాట్లాడుతూ కంటనీరు పెట్టారు. ఎటువంటి సంఘటనలపై మహిళాలోకం ఆవేదన చెందుతుందని, ప్రతి పురుషుడు ఇటువంటి సంఘటనపై ఆలోచించాలన్నారు. మీకు ఆడబిడ్డలు, అక్కాచెల్లెల్లు లేరా మీరే అలోచించండి సభ్య సమాజం సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారన్నారు. చైర్‌పర్సన్‌గా వుండికూడా నేను ఏమీ చేయలేని పరిస్థితి అన్నారు. నిందితులకు శిక్ష పడేవరకు రాజకీయలకు అతీతంగా వారికి ఎవ్వరూ సహకరించవద్దని, న్యాయవాదులు సైతం దోషులకు శిక్షపడేవిధంగా చూడాలని వేడుకున్నారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి పీతల సుజాతతో మాట్లాడి బాలికకు అన్నివిధాలా న్యాయం జరిగేందుకు కృహి చేస్తానని తెలిపారు. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకొనేలా చూస్తాననని అన్నారు. ఈ సంఘటన గురించి గుంటూరు వైద్యులతో బాలికతో తల్లిడండ్రులతో చర్చించానని తెలిపారు. వారి కుటుంబంలోని ఇద్దరు పిల్లల్ని మహిళా కమీషన్ తరుపున చదివిస్తానని హామినిచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న బాలిక తల్లిడండ్రులు ఈ దుర్గటన మరెవ్వరికీ జరక్కూడదని కన్నీటిపర్యంతమయ్యారు.
కాలచక్ర భూముల సేకరణకు కార్యాచరణ సిద్ధం
అమరావతి, ఫిబ్రవరి 23: మండల కేంద్రమైన అమరావతిలో ధ్యానబుద్ధ ప్రాజెక్టు ఎదురుగా గల 16.80 ఎకరాల కాలచక్ర ప్రాంగణం స్థలాన్ని ప్రభుత్వం తీసుకుని పరిహారం చెల్లించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుందని సిఆర్‌డిఎ ల్యాండ్ ఎక్విజేషన్ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మనోరమ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆ భూముల్లో ఉన్న రైతుల నుండి అర్జీలను స్వీకరించారు. ఎవరిపేర ఎంత పొలం ఉందో నిర్ధారించి ప్రభుత్వ నిబంధనల మేరకు వారికి రావాల్సిన దామాషా ప్రకారం మరో వారం రోజుల్లో పరిహారం చెల్లించడం జరుగుతుందని వివరించారు. రైతులంతా తమ తమ పొలాల వివరాలు, తమకు రావాల్సిన ధర గురించి అర్జీల రూపంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఆర్‌డిఎ తహశీల్దార్ పుల్లయ్య, కలెక్టర్ కార్యాలయం తహశీల్దార్ సోమేశ్వరరావు, సిఆర్‌డిఎ సర్వేయర్ పార్ధసారధి, అమరావతి తహశీల్దార్ భాస్కరరావు, ఆర్‌ఐ దేవదాసు తదితరులు పాల్గొన్నారు.
నీరుకొండ రైతు భూములపై విజిలెన్స్ విచారణ
మంగళగిరి, ఫిబ్రవరి 23: మండల పరిధిలోని నీరుకొండ గ్రామానికి చెందిన రైతు కోటేశ్వరరావుకు చెందిన నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లోని భూములపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీ శోభామంజరి పర్యవేక్షణలో అధికారులు విచారణ జరుపుతున్నారు. నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లోని కొన్ని సర్వే నెంబర్లకు చెందిన భూమికి నకిలీ పాసుపుస్తకాలు పెట్టి నిబంధనలకు విరుద్ధంగా లబ్ది పొందినట్లు తేలడంతో విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ పాస్‌పుస్తకాలను వాణిజ్య సహకార బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందినట్లు అందిన సమాచారం మేరకు బ్యాంకులు, సహకార సంఘాల్లో అధికారులు విచారణ జరుపుతున్నారు.
మహాశివరాత్రి మహోత్సవానికి సిద్ధమైన ప్రధాన శివాలయాలు
గుంటూరు (కల్చరల్), ఫిబ్రవరి 23: లయకారకుడైన శివపరమాత్మ లింగరూపంలో అవతరించే మహాశివరాత్రి రానేవచ్చింది. మాఘమాసం శుక్రవారం ప్రభాతవేళ నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు శివరాత్రి మహోత్సవాన్ని మహావైభవంగా జరుపుకోవడానికి నగరంలోని శివభక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరులోని 12 ప్రధాన శివాలయాలు, శివరాత్రి వేడుకలకు సుందరంగా ముస్తాబైనాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సంప్రదాయబద్ధంగా అభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహిస్తారు. ప్రధానంగా లింగోద్భవవేళ అర్ధరాత్రి సమయాన కైలాసనాధుడు లింగరూపంలో అవతరించే శుభఘడియలలో పానవట్టంపై వేంచేసియున్న సదాశివునికి మహాభిషేకాలు నిర్వహించేందుకై విస్తృత ఏర్పాట్లను ఆయా దేవస్థానాల అధికారులు, ప్రతినిధులు, అర్చక బృందం చేసింది. పాత గుంటూరులోని వేలకొలది సంవత్సరాల క్రితం శ్రీ అగస్త్య మహాముని స్వయంగా ప్రతిష్ఠించిన శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి శనివారం ఉదయం వరకు విశేషమైన కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ అధికారులు గురువారం ఈ విలేఖరికి తెలిపారు. ఆర్ అగ్రహారంలోని 350 యేళ్ల నాటి చరిత్ర కల్గిన శ్రీ గంగాభ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని శివరాత్రి ఉత్సవం కోసం అందంగా తీర్చిదిద్దారు. అరండల్‌పేటలోని శ్రీ గంగామీనాక్షి సమేత సోమసుందర స్వామి దేవస్థానం, బ్రాడీపేటలోని కుర్తాళం సిద్ధేశ్వరీపీట దత్తత ఓంకారక్షేత్రం, అదే ప్రాంతంలోని స్వాతంత్య్రానికి ముందు మోహన్‌దాస్ కరమ్‌చంద్‌గాంధీ స్వయంగా దర్శించి నామకరణం చేసిన గౌరీవిశే్వశ్వరాలయం, జూట్‌మిల్లు శివాలయం, మారుతినగర్ గంగా గౌరీశంకర స్వామి దేవాలయం, శ్యామలానగర్‌లోని ఇష్టకామేశ్వరీ సహిత ఉమామహేశ్వరాలయం, పట్ట్భాపురం కంచికామకోటి పీఠ హరిహరదత్తక్షేత్రం, నగరానికి సమీపంలోని లాం శివాలయాలు, అన్ని ప్రాంతాల్లోని మహాశివుడు కొలువైయున్న దేవస్థానాల్లో మహాశివరాత్రిని శివతత్వం ఉట్టిపడేలా నిర్వహించడానికి ఆయా భక్తబృందాలు విస్తృతమైన ఏర్పాట్లు చేశాయి. మహాభిషేకం అనంతరం అన్ని ముఖ్య శివాలయాల్లో ఉమామహేశ్వరులకు కళ్యాణోత్సవాలను కనుల పండువగా జరపనున్నామని తెలిపారు.

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
* ఎంపి జయదేవ్
గుంటూరు (కొత్తపేట), ఫిబ్రవరి 23: తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తోందని గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ పేర్కొన్నారు. గురువారం తూర్పు నియోజకవర్గంలోని స్థానిక మాయాబజారు సెంటర్‌లో ఇటీవల తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్న ఎమ్మెల్సీ మహ్మద్ జానిని, కార్పొరేషన్ స్టాండింట్ కమిటీ మాజీ చైర్మన్ షౌకత్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, టిడిపిపై నమ్మకంతో పార్టీలో చేరుతున్న ముస్లిం, మైనార్టీ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నామన్నారు. తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దాళి గిరి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతగానో దోహదం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్, ముస్లిం, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి మహోత్సవానికి సిద్ధమైన ప్రధాన శివాలయాలు
గుంటూరు (కల్చరల్), ఫిబ్రవరి 23: లయకారకుడైన శివపరమాత్మ లింగరూపంలో అవతరించే మహాశివరాత్రి రానేవచ్చింది. మాఘమాసం శుక్రవారం ప్రభాతవేళ నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు శివరాత్రి మహోత్సవాన్ని మహావైభవంగా జరుపుకోవడానికి నగరంలోని శివభక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరులోని 12 ప్రధాన శివాలయాలు, శివరాత్రి వేడుకలకు సుందరంగా ముస్తాబైనాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సంప్రదాయబద్ధంగా అభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహిస్తారు. ప్రధానంగా లింగోద్భవవేళ అర్ధరాత్రి సమయాన కైలాసనాధుడు లింగరూపంలో అవతరించే శుభఘడియలలో పానవట్టంపై వేంచేసియున్న సదాశివునికి మహాభిషేకాలు నిర్వహించేందుకై విస్తృత ఏర్పాట్లను ఆయా దేవస్థానాల అధికారులు, ప్రతినిధులు, అర్చక బృందం చేసింది. పాత గుంటూరులోని వేలకొలది సంవత్సరాల క్రితం శ్రీ అగస్త్య మహాముని స్వయంగా ప్రతిష్ఠించిన శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి శనివారం ఉదయం వరకు విశేషమైన కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ అధికారులు గురువారం ఈ విలేఖరికి తెలిపారు. ఆర్ అగ్రహారంలోని 350 యేళ్ల నాటి చరిత్ర కల్గిన శ్రీ గంగాభ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని శివరాత్రి ఉత్సవం కోసం అందంగా తీర్చిదిద్దారు. అరండల్‌పేటలోని శ్రీ గంగామీనాక్షి సమేత సోమసుందర స్వామి దేవస్థానం, బ్రాడీపేటలోని కుర్తాళం సిద్ధేశ్వరీపీట దత్తత ఓంకారక్షేత్రం, అదే ప్రాంతంలోని స్వాతంత్య్రానికి ముందు మోహన్‌దాస్ కరమ్‌చంద్‌గాంధీ స్వయంగా దర్శించి నామకరణం చేసిన గౌరీవిశే్వశ్వరాలయం, జూట్‌మిల్లు శివాలయం, మారుతినగర్ గంగా గౌరీశంకర స్వామి దేవాలయం, శ్యామలానగర్‌లోని ఇష్టకామేశ్వరీ సహిత ఉమామహేశ్వరాలయం, పట్ట్భాపురం కంచికామకోటి పీఠ హరిహరదత్తక్షేత్రం, నగరానికి సమీపంలోని లాం శివాలయాలు, అన్ని ప్రాంతాల్లోని మహాశివుడు కొలువైయున్న దేవస్థానాల్లో మహాశివరాత్రిని శివతత్వం ఉట్టిపడేలా నిర్వహించడానికి ఆయా భక్తబృందాలు విస్తృతమైన ఏర్పాట్లు చేశాయి. మహాభిషేకం అనంతరం అన్ని ముఖ్య శివాలయాల్లో ఉమామహేశ్వరులకు కళ్యాణోత్సవాలను కనుల పండువగా జరపనున్నామని తెలిపారు.

మెతుకు విలువ తెలిసినోళ్లు జూట్‌మిల్లును తెరిపిస్తారు..
గుంటూరు, ఫిబ్రవరి 23: మెతుకు విలువ తెలిసినవాళ్లెవ్వరూ కార్మికుల బతుకులను చిన్నాభిన్నం చేయరని, కష్టాన్ని నమ్ముకున్న కార్మికుల కడుపును మాడ్చవద్దని భజరంగ్ జూట్‌మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం అరండల్‌పేటలోని స్ఫూర్తి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అప్పిరెడ్డి మాట్లాడుతూ చేసిన జాప్యం చాలని, ఇప్పటికైనా జూట్‌మిల్లును తెరిపించి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. బేషజాలు, పార్టీ వేదాలను పక్కనబెట్టి సిఎం చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈనెల 26వ తేదీన అన్ని రాజకీయపార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటుచేసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. జూట్‌మిల్లు యాజమాన్యం దురాలోచనతో మిల్లు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. మిల్లు అక్రమ లాకౌట్‌కు ముందే మిల్లుకు చెందిన 7.79 ఎకరాలను దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ చేయించారని, అందుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే అధికారులకు అందజేశామన్నారు. సాక్షాత్తు సిఎం చంద్రబాబు జూట్‌మిల్లు వద్దకు వచ్చి మిల్లును తెరిపించి, కార్మికులకు పని కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నెరవేర్చమని అడుగుతన్నామే తప్ప గొంతెమ్మకోర్కెలేమీ కోరడం లేదన్నారు. విలేఖర్ల సమావేశంలో పరిరక్షణ సమితి సభ్యులు భావన్నారాయణ, రాయ నాగేశ్వరరావు, న్యాయవాది వైకె, ఎబ్బూరి పాండురంగ తదితరులు పాల్గొన్నారు.