గుంటూరు

ఇలాగైతే వేసవి దాహార్తి తీరేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదనందిపాడు, మార్చి 2: వేసవి దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం విడుదల చేసిన సాగర్‌జలాలు మూడు రోజులకే స్తంభించాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని చెరువులకు మాత్రమే నీరు అందగా, చివరిప్రాంతాల చెరువులకు అసలు తాగునీరు అందలేదు. పెదనందిపాడు, కాకుమాను మండలాలకు మల్లాయపాలెం, పెదనందిపాడు మేజర్ ఎన్‌ఎస్‌పి కాల్వల ద్వారా చెరువులకు నీరు అందాల్సి ఉంది. అధికారులు చెప్పే కాకిలెక్కలకు క్షేత్రస్థాయిలో ప్రవహించిన నీటికి పొంతన లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి పొంచి ఉంది. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారుల చిరునామా గల్లతైంది. గ్రామాల్లో దాదాపు 40 చెరువులకు తాగునీరు అందాల్సి ఉంది. ఏప్రిల్ 18న కొండపాటూరులో శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల జరగనుంది. రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు మొక్కుబడులు తీర్చుకునేందుకు వచ్చి వెళ్తుంటారు. కానీ నేడు మంచినీటి చెరువులు పూర్తిగా అడుగంటిపోవడంతో తాగునీటి కోసం వాటర్‌క్యాన్‌లు తీసుకుని ఇతర గ్రామాలకు వలస వెళ్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే తిరునాళ్ల పరిస్థితి ఏంటన్నది అంతుపట్టకుండా ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో తాగునీరు ప్రశ్నార్ధకంగా మారిన తరుణంలో ఎన్‌ఎస్‌పి ఎఇని ప్రశ్నించగా తాగునీటిని నిలుపుదల చేయడం జరిగిందని, వేసవి అవసరాల దృష్ట్యా మరోమారు సరఫరా చేస్తామని తెలిపారు.
జాతీయ క్రీడ హాకీ ప్రాధాన్యతను నిలబెట్టాలి
గుంటూరు (పట్నంబజారు), మార్చి 2: క్రీడారంగంలో భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పిన హాకీ క్రీడ ప్రభావాన్ని యువ క్రీడాకారులు నిలబెట్టాలని ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ కమిషనర్ ఎస్‌కె రెహమాన్, రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరి ఎల్‌వి సుబ్రహ్మణ్యంలు పేర్కొన్నారు. హాకీ గుంటూరు సంఘం ఆధ్వర్యంలో స్థానిక బిఆర్ స్టేడియంలో ఆరు రోజుల పాటు జరిగిన అమరావతి స్టేట్‌లీగ్ రెండవ హాకీ టోర్నమెంటు క్రీడాపోటీలు గురువారంతో ముగిశాయి. బహుమతి ప్రదానోత్సవ సభలో రెహమాన్, సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ పతకాల పరంగా బంగారు పతకాలతో భారతదేశ ప్రతిష్ఠ, గౌరవం నిలబెట్టిన హాకీ క్రీడ ప్రస్తుతం కొంతమేర నిరాదరణ, నిర్లక్ష్యానికి గురవుతుందని, మరలా జీవం పోసి ఈ క్రీడకు జాతీయస్థాయిలో పూర్వవైభవాన్ని తీసుకురావాల్సిన బాధ్యత హాకీ సంఘాలు, స్పోర్ట్స్ అధారిటీలపై ఉందన్నారు. హాకీలో ఆంధ్రప్రదేశ్ నుంచి మరికొంతమంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తయారు కావాలని ఆకాంక్షించారు. హాకీ క్రీడాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఎపి క్రీడావిధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ ఎండి ఎన్ బంగారురాజు మాట్లాడుతూ హాకీని ప్రోత్సహించడానికి మరిన్ని టోర్నమెంటులు జరగాలన్నారు. ఏపి హాకీ జనరల్ సెక్రటరి ఎం నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతియేడాది ఇటువంటి పోటీలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. అనంతరం విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ టోర్నమెంటులో ఇన్‌కమ్‌ట్యాక్స్, ఏపి పోలీసు, ఆర్‌డిటి స్పోర్ట్స్ అకాడమి, విశాఖ, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల హాకీ జట్లు రౌండ్‌రాబిన్‌లీగ్ పద్ధతిలో ఆడాయి. ఓవరాల్ ఛాంపియన్ షిప్‌ను విశాఖ హాకీ జట్టు కైవసం చేసుకోగా రన్నర్‌గా గుంటూరు జట్టు నిలిచింది. ఈ కార్యక్రమంలో ధ్యాన్‌చంద్ జాతీయ అవార్డు గ్రహీత సత్తిగీత, హాకీ ఆంధ్రప్రదేశ్ లైఫ్ ప్యాట్రన్ సిపికె దత్తు, కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ కె రాజశేఖరరెడ్డి, హర్షవర్ధన్, క్రాంతికుమార్, గుమ్మడి సీతారామయ్చ చౌదరి తదితరులు పాల్గొన్నారు.