గుంటూరు

రైతుల్లో 85 శాతం చిన్నకారులే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడికొండ, మార్చి 9: వ్యవసాయం చేస్తున్న రైతుల్లో నూటికి 80 నుండి 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులేనని అచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛానల్సర్ బి రాజశేఖర్ అన్నారు. మండల పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంలో గురువారం కోస్తాతీర ప్రాంతాలలో వాతావరణం ఒడిదుడుకులను తట్టుకొనుటకు వ్యవసాయంలో అచరించవలసిన పద్ధతులు అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి రాజశేఖర్ హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ రాధాకృష్ణన్ కమిటీ ప్రకారం వ్యవసాయం చేస్తున్న 85 శాతం మంది రైతుల్లో 50 శాతం మంది కౌలు రైతులున్నారని పేర్నొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఆదాయాలు రెట్టింపు అయ్యేదిశగా పని చేస్తోందన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్య, పరిశోధన, విస్తరణ విభాగాలలో ముఖ్యమైన మార్పులు చేయవలసిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగం జాతీయ స్థూల ఉత్పత్తి (జిడిపి), రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జియస్‌డిపి) మరింత వాటా కలిగి ఉండాలన్నారు. ఈ సంవత్సరం 28 శాతం తక్కువ వర్షపాతం నమోదు అయిన్పటికీ జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 24.8 శాతంకి చేరిందన్నారు. అంతర్జాలం సేవలను రైతులకు చేరువ చేయాలన్నారు. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్వ కులపతి డాక్టరు సి రామస్వామి మాట్లాడుతూ భారతదేశంలో 60 శాతం వర్షాధారిత వ్యవసాయం ఉందన్నారు. వాతావరణం మార్పు వలన వర్షపాతం నమోదు అయిన రోజులు తగ్గిపోగా, అధిక వర్షపాతం నమోదు అయిన రోజులు పెరిగాయన్నారు. వాతావరణం మార్పువలన భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయన్నారు. వ్యవసాయ పరిశోధనల్లో కరవు, వరదను తట్టుకునే వివిధ పంట రకాలపై పరిశోధనలు జరపాలని, అందుకు ప్లాంట్ బ్రీడింగ్ వ్యూహాలను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. అచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్వపు కులపతి రఘవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఆహార భద్రత సాధించాలంటే వ్యవసాయరంగం ముఖ్య భూమిక పోషించాలని పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనలు 2050 సంవత్సరం కల్లా వాతావరణ మార్పును తట్టుకునే విధంగా ఫలితాలుంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ నాబార్డ్ ఛీప్ జనరల్ మేనేజరు సత్యన్నారాయణ మాట్లాడుతూ వాతావరణం మార్పు వలన బలహీనమైన మండలాలపై ప్రభావం ఉంటుందన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ డీన్ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఆమరణ నిరాహార దీక్షను
వాయిదావేయండి

* జూట్‌మిల్లు కార్మికులకు కలెక్టర్ విజ్ఞప్తి
గుంటూరు, మార్చి 9: జూట్‌మిల్లు సమస్యను ఆఖరిసారిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని, వారం రోజులు గడువు ఇవ్వాలని, అప్పటివరకు ఆమరణదీక్షకు వాయిదా వేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే జూట్‌మిల్లు పరిరక్షణ సమితి నాయకులకు విజ్ఞప్తిచేశారు. గురువారం జూట్‌మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో సమితి నేతలు, కార్మికులు కలెక్టర్‌ను కలిసి శుక్రవారం నుండి ఆమరణదీక్షకు దిగనున్నట్లు స్పష్టంచేశారు. స్పందించిన కలెక్టర్ ఆఖరిసారిగా తనకు గడువు ఇవ్వాలని సమస్యను పరిష్కరిస్తారమవుతుందన్న నమ్మకం తనకుందని తెలిపారు. అనంతరం సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కలెక్టర్ సూచన మేరకు వారం రోజులు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నూతన రాజధాని అమరావతి ఏర్పడిన నేపథ్యంలో మిల్లు నడిపితే వచ్చే లాభాల కంటే రియల్ ఎస్టేట్ చేస్తే మరింత లాభాలు పొందచ్చనే దురాశతో జూట్‌మిల్లుకు అక్రమ లాకౌట్ వేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు జూట్‌మిల్లు యాజమాన్యం మిల్లు నడుపుతుందో, లేదో ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. అక్రమ లాకౌట్ వేయకముందే మిల్లు స్థలాన్ని విక్రయించి రిజిష్టరు చేశారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, న్యాయవాది వైకె, మేరుగ నాగార్జున, మాల్యాద్రి, భావన్నారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ గౌస్, అంగిరేకుల వరప్రసాద్ తదితరులున్నారు.

నకలీ నోట్ల ముఠా అరెస్ట్
వినుకొండ, మార్చి 9: కలర్ జిరాక్స్ మిషన్‌తో రెండువేలు, ఐదొందలు ముద్రించి చలామణి చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను గురువారం అరెస్ట్ చేసినట్లు పట్టణ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా స్ధానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వివరాలు తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకి, సింగరకొండ పాలెంకు చెందిన సురభి శ్రీను, గద్దెల సాల్మన్‌రాజు, సురభి కోటేశ్వరరావు, చిలుకూరి మరియదాసు, పాలపర్తి మరియదాసు అనే ఐదుగురు ముఠాగా ఏర్పడి కలర్ జిరాక్స్ మిషన్‌తో ఒరిజనల్ రెండు వేలు,ఐదొందల రూపాయల నోట్లను జిరాక్స్ తీసి, వాటిని వినుకొండ, కోటప్పకొండలో చెలామణి చేసినట్లు వారు తెలిపారు. స్ధానిక పుచ్చకాయల వ్యాపారి ఎండ్లూరి మాచర్లయ్య వ్యక్తి వద్ద రెండు వేల రూపాయల దొంగనోట్లు ఇచ్చి రెండు వందల రూపాయలకు పుచ్చకాయలు కొని 1800 తీసుకుని వెళ్లారని తెలిపారు. వినుకొండలోని మీసేవలో కూడా నకిలీ నోట్లు తీసుకురాగా తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో రంగంలోకి దిగి నిందితులైన ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి, వారి నుండి కలర్ జిరాక్స్ మిషన్, నాలుగు రెండు వేల నోట్లు, రెండు ఐదొందల నోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గత నెల 24వ తేదీన జరిగిన కోటప్పకొండ తిరునాళ్ళలో చిరువ్యాపారులకు నకిలీ నోట్లు చెలామణి చేసినట్లు సిఐ తెలిపారు. నిందితులను స్ధానిక కోర్టులో హాజరు పరచినట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
బిల్లులు ఇవ్వలేదని పంచాయితీరాజ్ కార్యాలయంలో ఎమ్మెల్యే బైఠాయింపు
నరసరావుపేట, మార్చి 9: రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలెం గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు బిల్లులు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ గురువారం ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్ ముసలారెడ్డితో కలిసి స్ధానిక పంచాయితీరాజ్ కార్యాలయంలో భైఠాయించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బుచ్చిపాపన్నపాలెం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం గత ఏడాది డిసెంబర్‌లో పూర్తి అయినప్పటికీ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ ముసలారెడ్డి వైయస్సార్‌సీపీ సర్పంచ్ కావడం వల్లనే ప్రభుత్వం మంజూరు చేయడం లేదన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం విడుదల చేసే నిధులను తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయం చేస్తూ వైయస్సార్‌సీపీ సర్పంచ్‌లను ఆర్ధికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఈనెల 20వ తేదీలోపు ట్రెజరీలో బిల్లులు విడుదల చేయకపోతే, ఆ నిధులు వెనక్కి వెళతాయని అన్నారు. ఈ బిల్లుల విషయంపై డీఈని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ, కేవలం నాలుగు లక్షల రూపాయల బిల్లుల కోసం సర్పంచ్‌లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో అన్ని పంచాయితీలకు సీసీ రోడ్డు, సైడు కాల్వల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా, బిల్లుల చెల్లింపు విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఈ విషయంపై ఈఈ వీరాస్వామిని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ప్రశ్నించడంతో బిల్లు సంగతి ఎంబుక్‌లో రాయలేదని, మూడు రోజులు గడువిస్తే రాసిస్తానని సమాధానం చెప్పారు. దీంతో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈఈ ఛాంబర్‌లోనే భైఠాయించారు. దీంతో అధికారులు ఖంగుతిని, ఏఈ శేషయ్యను పంపించి, డిఈ విజయకుమార్‌తో మాట్లాడి, ఎంబుక్ తెప్పించి, ఎమ్మెల్యేకు చూపించారు. రెండు రోజులను అధికారులు గడువు కోరడంతో సంతృప్తి చెందని ఎమ్మెల్యే గురువారం సాయంత్రానికి బిల్లులు పూర్తి చేసి వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో డీఈ మీడియా సమక్షంలో శుక్రవారం సాయంత్రానికి పూర్తి చేస్తానని లిఖితపూర్వకంగా ఇచ్చారు. సంతృప్తి చెందిన ఎమ్మెల్యే కార్యాలయం నుండి వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో ఉత్తమరెడ్డి, రవీంద్రారెడ్డి, నర్సింహారెడ్డి, కోడూరు వెంకటేశ్వరరెడ్డి, న్యాయవాది సత్యనారాయణ రెడ్డి,వల్లెపు నాగేశ్వరావు, చెంచిరెడ్డి, రమణారెడ్డి, పిల్లి ఓబుల్‌రెడ్డి, జడ్‌పీటీసీ అక్తాబ్ తదితరులు పాల్గొన్నారు.

బిల్లులు ఇవ్వలేదని పంచాయితీరాజ్ కార్యాలయంలో ఎమ్మెల్యే బైఠాయింపు
నరసరావుపేట, మార్చి 9: రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలెం గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు బిల్లులు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ గురువారం ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్ ముసలారెడ్డితో కలిసి స్ధానిక పంచాయితీరాజ్ కార్యాలయంలో భైఠాయించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బుచ్చిపాపన్నపాలెం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం గత ఏడాది డిసెంబర్‌లో పూర్తి అయినప్పటికీ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ ముసలారెడ్డి వైయస్సార్‌సీపీ సర్పంచ్ కావడం వల్లనే ప్రభుత్వం మంజూరు చేయడం లేదన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం విడుదల చేసే నిధులను తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయం చేస్తూ వైయస్సార్‌సీపీ సర్పంచ్‌లను ఆర్ధికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఈనెల 20వ తేదీలోపు ట్రెజరీలో బిల్లులు విడుదల చేయకపోతే, ఆ నిధులు వెనక్కి వెళతాయని అన్నారు. ఈ బిల్లుల విషయంపై డీఈని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ, కేవలం నాలుగు లక్షల రూపాయల బిల్లుల కోసం సర్పంచ్‌లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో అన్ని పంచాయితీలకు సీసీ రోడ్డు, సైడు కాల్వల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా, బిల్లుల చెల్లింపు విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఈ విషయంపై ఈఈ వీరాస్వామిని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ప్రశ్నించడంతో బిల్లు సంగతి ఎంబుక్‌లో రాయలేదని, మూడు రోజులు గడువిస్తే రాసిస్తానని సమాధానం చెప్పారు. దీంతో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈఈ ఛాంబర్‌లోనే భైఠాయించారు. దీంతో అధికారులు ఖంగుతిని, ఏఈ శేషయ్యను పంపించి, డిఈ విజయకుమార్‌తో మాట్లాడి, ఎంబుక్ తెప్పించి, ఎమ్మెల్యేకు చూపించారు. రెండు రోజులను అధికారులు గడువు కోరడంతో సంతృప్తి చెందని ఎమ్మెల్యే గురువారం సాయంత్రానికి బిల్లులు పూర్తి చేసి వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో డీఈ మీడియా సమక్షంలో శుక్రవారం సాయంత్రానికి పూర్తి చేస్తానని లిఖితపూర్వకంగా ఇచ్చారు. సంతృప్తి చెందిన ఎమ్మెల్యే కార్యాలయం నుండి వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో ఉత్తమరెడ్డి, రవీంద్రారెడ్డి, నర్సింహారెడ్డి, కోడూరు వెంకటేశ్వరరెడ్డి, న్యాయవాది సత్యనారాయణ రెడ్డి,వల్లెపు నాగేశ్వరావు, చెంచిరెడ్డి, రమణారెడ్డి, పిల్లి ఓబుల్‌రెడ్డి, జడ్‌పీటీసీ అక్తాబ్ తదితరులు పాల్గొన్నారు.

అవినీతి రహిత భారతం సాకారం కావాలి
* ఎంపి వరుణ్‌గాంధీ
తాడేపల్లి, మార్చి 9: అవినీతి రహిత స్థాపనకు భారతీయ యువత నడుం బిగించాలని ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ ఎంపి వరుణ్‌గాంధీ యువతకు పిలుపునిచ్చారు. గురువారం కెఎల్ వర్శిటీలో ప్రారంభమైన జాతీయస్థాయి సాంకేతిక నిర్వహణా సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రాభివృద్ధిలో యువత పాత్ర కీలకమైందని, స్వాతంత్య్రానికి పూర్వం 1828 నుండి యువత అనేక అంశాల్లో సాధించిన ప్రగతిని, వారి పాత్రను ఆయన సోదాహరణంగా వివరించారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన ఇంటర్‌నెట్, సెల్‌ఫోన్, ట్విట్టర్ వంటి సాధనాల ద్వారా యువత ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో 41శాతం యువత ఉందని, 2020 నాటికి ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద యువత ఉన్న దేశంగా వెలుగొందుతుందని, యువత రాజకీయాల్లోకి సైతం రావాలని ఆయన పిలుపునిచ్చారు.
మిర్చికి గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు
గుంటూరు, మార్చి 9: మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు చేపడతామని, రైతుకు నష్టం కలగకుండా చూస్తామని గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు తెలిపారు. గురువారం యార్డుకు సరుకు తీసుకువచ్చిన కర్నూలు, ప్రకాశం జిల్లాలకు చెందిన రైతులతో మన్నవ మాట్లాడారు. అవసరమైతే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి ధరలు పతనం కాకుండా కాపాడుతామని పేర్కొన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులను కోరామని తెలిపారు. అన్ని పంటలకు కనీస మద్ధతు ధర ఉన్నట్లే మిర్చికి కూడా మద్ధతు ధర ఉండేలా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి పంటను పండిస్తే గిట్టుబాటు ధర లభించడం లేదని, కనీసం ఉత్పత్తి ఖర్చులైనా వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. రెండు మూడు రోజుల్లో జిల్లా మంత్రులు, కలెక్టర్, మార్కెటింగ్ కమిషనర్, మార్క్‌ఫెడ్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమీక్షిస్తామని చెప్పారు. మన్నవ వెంట యార్డు కార్యదర్శి ఎం దివాకర్, డైరెక్టర్ సింగంశెట్టి వీరయ్య, అధికారులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
బాబు లాంటి సిఎంను చూడలేదు... మరో 20 ఏళ్లు ఆయనే ముఖ్యమంత్రి

గుంటూరు, మార్చి 9: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా తాను మాట్లాడినట్లు దుష్ప్రచారం జరుగుతోందని నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు ఖండించారు. ఇటీవల కమ్మజన సేవా సమితి కార్యవర్గ సమావేశం సందర్భంగా తన మనోభావాలను బయటపెట్టిన ఆయన గురువారం స్వరం మార్చారు. అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కుటుంబ సభ్యులకు దూరంగా రాష్ట్భ్రావృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న బాబు లాంటి సిఎంను తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. పోలవరానికి జాతీయ హోదా, ప్రత్యేక ప్యాకేజీ, నదుల అనుసంధానం, మూడేళ్లలో రాజధాని నిర్మాణం ఆయనకే సాధ్యమైందన్నారు. గతంలో సిఎంలు ఢిల్లీకి సొంత పనులపై వెళ్లేవారని, విభజన హక్కుల సాధనకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు జరుపుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రావసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం బాబుకే సాధ్యమన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వంద జన్మలెత్తినా చంద్రబాబును విమర్శించే అర్హత రాదన్నారు. అభివృద్ధికి బాబు బాటలు వేస్తుంటే అక్రమ సంపాదన కోసం జగన్ తాపత్రయపడుతున్నారని విమర్శించారు.

కోర్టు ఆదేశాలను లెక్కచేయని సంగం డెయిరీ పాలకమండలి
పొన్నూరు, మార్చి 9: వడ్లమూడి సంగం డెయిరీకి చెందిన స్థలంలో జరుపుతున్న నిర్మాణాన్ని నిలిపివేయాలని కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ జారీచేసినా పెడచెవిన పెట్టి, ఆ స్థలంలో నిర్మాణాన్ని కొనసాగిస్తున్న డెయిరీ పాలకవర్గం ధిక్కార వైఖరి చాటుతుందని వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి బొనిగల రాజారావు ఆరోపించారు. పొన్నూరులోని ఆయన కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో కోర్టు ఆదేశాలను తోసిపుచ్చి ఎమ్మెల్యే నరేంద్రకుమార్ ఆధ్వర్యంలో డెయిరీ పాలకమండలి అనుసరిస్తున్న తీరును గర్హించారు. రైతుల తోడ్పాటు కోసం వడ్లమూడి వద్ద ఏర్పాటుచేసిన సంగం డెయిరీ చైర్మన్ నరేంద్రకుమార్ అధ్యక్షతన కొనసాగుతున్న పాలకమండలి డెయిరీకి చెందిన 10 ఎకరాల స్థలంలో వెటర్నరీ ఆసుపత్రికి గతంలో నిశ్చయించుకుని, అందుకు అనుమతులు కూడా పొందడం జరిగిందన్నారు. ఆ నిర్ణయానికి భిన్నంగా ఆ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు నేడు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఆ నిర్ణయాన్ని గర్హిస్తూ సంగం డెయిరీకి చెందిన నూతలపాటి వెంకట శివరామకృష్ణతో పాటు మరో 8 మంది 12వ అదనపు జిల్లా కోర్టు (్ఫ్యమిలీకోర్టు) కేసు దాఖలు చేయడం కూడా జరిగిందన్నారు. విచారణ స్వీకరించిన కోర్టు కేసు తేలే వరకు ఎలాంటి నిర్మాణాలు జరపవద్దని ఇంజక్షన్ ఆర్డర్ జారీచేసిందన్నారు. కాగా కోర్టు ఆదేశాలను సైతం తోసిపుచ్చి ఆ స్థలంలో తిరిగి నిర్మాణాన్ని కొనసాగించడం ధిక్కార చర్య అని, కోర్టులపై వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరిని చాటుతుందని రాజారావు విమర్శించారు. అనుచితంగా వ్యవహరిస్తున్న సంగం డెయిరీ పాలకమండలిపై కేసు నమోదు చేసి న్యాయ పోరాటం చేస్తామన్నారు. పాలకమండలి శిక్ష అనుభవించే సమయం ముందుందన్నారు. విలేఖర్ల సమావేశంలో వైసిపి విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి జొన్నకూటి లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

నృసింహ భక్తుల
కలశజ్యోతి ఊరేగింపు
మంగళగిరి, మార్చి 9: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి మాలధారణ భక్తబృందం ఆధ్వర్యాన గురువారం రాత్రి పురవీధుల్లో కలశజ్యోతి ఉత్సవ ఊరేగింపు నిర్వహించారు. ఆంజనేయ స్వామి మిద్దె సెంటర్లో గల గణపతి ఆలయంలో గురుస్వామి మాల్యవంతం శ్రీనివాసాచార్యులు పూజా కార్యక్రమం నిర్వహించి ఉత్సవాన్ని ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో కలశజ్యోతి ఊరేగింపు ప్రధాన వీధులగుండా లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి చేరింది. అనంతరం స్వామివారికి, రాజ్యలక్ష్మీ అమ్మవారికి మాలాధారణ స్వాములు పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు జరిపారు. డోగిపర్తి శ్రీనివాసరావు, శివారెడ్డి, టి శ్రీను, గాజుల శ్రీనివాస్ తదితరులు పర్యవేక్షించారు.

అమరేశ్వరునికి కుంభాభిషేకం
అమరావతి, మార్చి 9: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో గత 11 రోజులుగా ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ బ్రాహ్మణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న అతిరుద్ర మహాయజ్ఞం గురువారంతో ముగిసింది. ఉదయం పూర్ణాహుతి కార్యక్రమాన్ని జంధ్యాల జగన్నాధశాస్ర్తీ నిర్వహించారు. అలాగే అమరేశ్వరస్వామి ప్రధాన గోపురంపై ఉన్న కలశానికి మహాకుంభాభిషేకం నిర్వహించారు. శ్రీశ్రీ విద్యాశంకర భారతీస్వామి కుంభాభిషేకాన్ని నిర్వహించి, ఆ జలాన్ని భక్తులకు అందజేశారు. అన్ని ఆలయాలను కుంభాభిషేకం జలంతో సంప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులకు విశేషంగా అన్నదానం నిర్వహించారు.

హంసవాహనంపై ఊరేగిన నృసింహుడు
మంగళగిరి, మార్చి 9: స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారు హంసవాహనంపై పురవీధుల్లో విహరించారు. ఆలయ ఉపప్రధాన అర్చకులు నల్లూరి శ్రీరామచంద్ర భట్టాచార్యులు ఆధ్వర్యంలో హంసవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహ స్వామివారి ఉత్సవమూర్తులను వివిధ రకాల పూలతో శోభాయమానంగా అలంకరించి ఉత్సవం నిర్వహించారు. ఆలయ ట్రస్ట్‌బోర్డు సభ్యుడు శివనాగరాజు, వివి రమణ, శ్రీనివాససింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇఓ మండెపూడి పానకాలరావు పర్యవేక్షించారు.
పోలీసులు ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు
గుంటూరు (పట్నంబజారు), మార్చి 9: నిత్యం విధి నిర్వహణలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న పోలీసులు తమ ఆరోగ్యం పట్ల అలక్ష్యం ప్రదర్శించకూడదని గుంటూరు రూరల్ ఎస్‌పి నారాయణ నాయక్ సూచించారు. గురువారం వరల్డ్ కిడ్నీడే సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో వేదాంత హాస్పిటల్స్ ఆధ్వర్యాన ఉచిత కిడ్నీ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. శిబిరంలో జిల్లాలోని 160 మంది పోలీసు సిబ్బంది, అధికారులు, కుటుంబ సభ్యులు హాజరై బిపి, షుగర్, కిడ్నీ సంబంధిత, రక్తపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐడి ఎస్‌పి మోహనరావు, వేదాంత హాస్పిటల్ ఎండి డాక్టర్ చింతా రామకృష్ణతో పాటు పోలీసు అధికారులు సంకురయ్య, సూరిబాబు, సత్యనారాయణ, బట్టు ప్రసాద్, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.
సింగిల్‌నెంబర్ లాటరీ నిర్వాహకుల అరెస్ట్
గుంటూరు (పట్నంబజారు), మార్చి 9: గుంటూరు నగరంలో సింగిల్ నెంబర్ లాటరీ (మట్కా) జూదం నిర్వహిస్తున్న 17 మందిని గురువారం జిల్లా అర్బన్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 52,609 రూపాయలను, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ జూదం కారణంగా విద్యార్థులు, యువత ముఖ్యంగా దినసరి కూలిపనులు చేసుకునే వారు నష్టపోతున్నారని, ఇకపై ఎవరైనా ఈ జూదం నిర్వహించినట్లు తెలిస్తే క్రిమినల్ చర్యలతో పాటు రౌడీషీటు తెరుస్తామని స్పష్టంచేశారు.