గుంటూరు

ఇద్దరు తహశీల్దార్లు, వీఆర్వో సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 10: ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయటంతో పాటు పట్టాదారు పాస్‌పుస్తకాలు మంజూరు అడంగళ్‌లో మార్పులు, చేర్పులకు బాధ్యులైన ఇద్దరు తహశీల్దార్లు, ఓ వీర్వోను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కాంతీలాల్ దండే ఉత్తర్వులు జారీచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గురజాల మండలం గొట్టిముక్కల శివారు సమాధానంపేటలో సర్వే నెం. 607/2,3 640/3ఎ, 744/2, 674/3, 12/3, 718, 744/1, 712/5, 712/1 సర్వే నెంబర్లలోగల 56 ఎకరాల భూమికి సంబంధించి ప్రైవేటు, ప్రభుత్వ భూములకు కూడా గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. అప్పట్లో తహశీల్దార్లుగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్, వి.రఘురాం, వీఆర్వోగా పనిచేసిన మల్లెల కోటేశ్వరరావులు ప్రభుత్వ భూమిని రొండి సాంబయ్య, కుటుంబ సభ్యుల పేరిట దారాదత్తం చేశారు. సాంబయ్య పట్టాదారు పాస్‌పుస్తకం ఆధారంగా మాచర్ల హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నుంచి లక్షలాది రూపాయల రుణం తీసుకున్నారు. అనంతరం అదే భూమిని ఓ సిమెంట్ కంపెనీ యాజమాన్యానికి విక్రయించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని గురజాలకు చెందిన కాలంగి వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ జరిపారు. విచారణలో అవకతవకలు రుజువు కావడంతో ప్రస్తుతం పిట్టలవానిపాలెం తహశీల్దారుగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్, అమృతలూరులో తహశీల్దారు వి.రఘురాంతో పాటు ముప్పాళ్ల గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్న మల్లెల కోటేశ్వరరావులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. వీరిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జెసి వెంకటేశ్వర్లు శాఖాపరమైన విచారణ జరిపారు. ఇదిలా ఉండగా జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాలు, ప్రభుత్వ భూముల దారాదత్తం వ్యవహారాలకు సంబంధించి మరో ఇద్దరు తహశీల్దార్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. పిడుగురాళ్ల, బాపట్లలో ఇద్దరు రెవిన్యూ అధికారులకు ఇప్పటికే చార్జి మెమోలు దాఖలయ్యాయి. వీరిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన అనంతరం వేటుపడనున్నట్లు తెలిసింది.