గుంటూరు

వైభవంగా వెంకటేశ్వరుని నగరోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు కల్చరల్, మార్చి 11: బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి ఆలయం 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.. శనివారం ఉదయం నిత్యపూజల అనంతరం శ్రీవారిని గరుడ వాహనంపై ఊరేగించి నగరోత్సవం నిర్వహించారు. ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి లంకా విజయబాబు, భారతీ థార్మిక విజ్ఞాన పరిషత్ ప్రతినిధి బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో 900 మంది సువాసినులచే ప్రత్యేక పూజలు, లలితా సహస్రనామ పారాయణ, అన్నసంతర్పణ చేశారు. ఆలయ ప్రాంగణంలో 15 మంది రుత్విక్కులతో శత చండీయాగం నిర్వహించారు.
ప్రభాకరరావుకు ఘన నివాళి
గుంటూరు (పట్నంబజార్), మార్చి 11: రాష్ట్ర కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం శనివారం తెలగ, బలిజ, కాపు ఐక్య కార్యాచరణ వేదిక (టిబికె-జెఎసి) కన్వీనర్ దాసరి రాము, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. గత పదిరోజుల క్రితం రాము తండ్రి దాసరి ప్రభాకరరావు మృతిచెందారు.. ఆయన చిత్రపటానికి ముద్రగడ పూలమాలలువేసి నివాళులర్పించారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, నగర టిడిపి నాయకులు అడపా బాబు, యర్రగోవు నాగేశ్వరరావు, కాపు జెఎసి నేతలు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, కల్వకొలను తాతాజీ, కిలారి రోశయ్య, మలిశెట్టి సుబ్బారావు, అడపా కాశీవిశ్వనాధం తదితరులు స్థానిక ఆర్ అగ్రహారం లోని దాసరి రాము నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభాకర్‌రావు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ ఫిర్యాదుల పరిష్కారానికి ‘వాట్సప్’
గుంటూరు (కొత్తపేట), మార్చి 11: ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఫొటోలు, మెసేజ్‌ల ద్వారా తెలియజేసేందుకు బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ వాట్సప్ నెంబర్లకు పంపించాలని ఆర్టీరీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి పేర్కొన్నారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ బస్సుల వేగ నియంత్రణ, బస్సుల శుభ్రత, సిబ్బంది ప్రవర్తన ఇలా పలు సమస్యలు, అసౌకర్యాలను వాట్సప్ నెంబర్లకు ఫొటోలు, వీడియోల ద్వారా పంపించవచ్చన్నారు. ప్రతి రోజూ ఎప్పటికప్పుడు ప్రయాణికులు, సిబ్బంది తెలియపర్చే సమస్యలు పరిష్కరించబడతాయని, దీని ద్వారా ప్రయాణికులకు సంస్థపై నమ్మకం బలపడుతుందన్నారు. సమస్యలు తెలియజేయడానికి 9959229869 నెంబర్‌కు వాట్సప్ ద్వారా, సమాచారం కొరకు 0863-2255837, బస్టాండ్ ఆన్ డ్యూటీ కంట్రోలర్ ఫోన్ నెంబర్ 9959225444, బస్‌స్టేషన్ మేనేజర్ నెంబర్ 9959225267 నెంబర్లకు తెలియపర్చాలన్నారు. దూర ప్రాంత రిజర్వేషన్ల కొరకు 9959061597లో సంప్రదించాలని సూచించారు. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రవేశపెడుతున్న నూతన పద్ధతులను వినియోగించుకోవాలని ఆర్‌ఎం శ్రీహరి కోరారు.