గుంటూరు

సిబార్ కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 20: వైద్యవిద్యార్థి డాక్టర్ ఇమ్రాన్‌ఖాన్ ఆత్మహత్యకు కారణమైన సిబార్ దంత వైద్య కళాశాల యాజమాన్యంపై ప్రభుత్వం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాలు, ముస్లిం మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షా శిబిరాన్ని బుధవారం రఘువీరారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన రెండేళ్ల కాలంలో 63 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఇమ్రాన్‌ఖాన్ ఆత్మహత్య బాధాకరమన్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలపై అధికమైన దాడులను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. థీసీస్ సమర్పించేందుకు కూడా హెచ్‌ఒడి వేధింపులకు గురిచేయడం వలనే ఇమ్రాన్ ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. యాజమాన్యానికి ప్రభుత్వం పరోక్షంగా అండగా నిలుస్తుందని రఘువీరా ఆరోపించారు. పూణేలో ఖాన్ ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కేసును ఇక్కడకు బదిలీ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.