గుంటూరు

అవిశ్రాంతంగా పనిచేస్తున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, మార్చి 20: పోలీసు అధికారులు, సిబ్బంది అవిశ్రాంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని, ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని గుంటూరుజిల్లా అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్టి త్రిపాఠి అభ్యర్ధించారు. సోమవారం పలాస ఎమ్మెల్యే రోడ్డుపై భైఠాయించిన విషయమై స్పందిస్తూ ప్రజాప్రతినిథులు సౌకర్యార్థం పోలీసు అధికారులు రూట్‌లు ఏర్పాటు చేశారని, తమ విధులకు ఆటంకం కలిగించకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. పోలీసులు ఉదయం నుండి సాయంత్రం వరకూ ఎదురుకాళ్లపై నిలబడి అటు ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలందిస్తున్నారని, అటువంటి తరుణంలో రహదారులపై పోలీసులకు అసౌకర్యం కలిగిస్తే పోలీసు విధులకు ఆటంకం కలిగించినవారవుతారన్నారు.
గుర్తు తెలియని
మృతదేహం లభ్యం
మేడికొండూరు, మార్చి 20: మండలంలోని పేరేచర్ల రైల్వే గుంటూరు బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని శవం లభ్యమైన సంఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎవరో గుర్తు తెలియని వ్యక్తి (పురుషుడు) శరీరంపై తెల్లని చొక్కా, సిమెంటు రంగు ప్యాంట్, చామనఛాయరంగు కలిగి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి ఎ ఎస్ ఐ లింగమూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు.