గుంటూరు

కళారంగానికి ప్రాధాన్యత మరింత పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, మార్చి 20:కళారంగానికి నేడు ప్రధాన్యత మరింతగా పెరిగిందని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఘంటసాల కళానిలయం 12వ వార్షికోత్సవ 7వ నాటకోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా ప్రసంగించారు. సినిమా, టివీల ప్రభావం ఎక్కువగావున్న ఈ రోజుల్లో నాటక రంగంపై ఆసక్తి తగ్గినప్పటికీ నాటక రంగంలో ప్రాధాన్యతను గుర్తించి గ్రామీణ ప్రాంతమైన సత్తెపల్లి పట్టణంలోని వడ్డవల్లిలో గంటసాల కళానిలయం అధ్యక్షుడు బుడగాల సుబ్బారావు ఆధ్వర్యంలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎపి సర్వీస్ కమిషన్ సభ్యులు గుబ్బా చంద్రశేఖర్ మాట్లాడుతూ నాటకాల ద్వారా నిజాన్ని నిర్భయంగా తెలియజేయవచ్చునని దీని వల్ల ప్రజలు పలు సమస్యలను అవగాహన చేసుకొని చైతన్యవంతులవుతారన్నారు. సోమవారం ఉదయం పట్టణ పోలీస్టేషన్‌లో ఘంటసాల కళానిలయం బృందం ఉత్తమ పోలీసు సేవా పురస్కారాన్ని పొందిన పట్టణ సిఐ సింగరేసు సాంబశివరావును పూలమాలలతో దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రగతి కళామండలి నాయకులు సత్యన్నారాయణ, వైసిపి రాష్ట్ర కార్యదర్శి కళ్ళం వీరభాస్కరరెడ్డి, జిల్లా కార్యదర్శి గార్లపాటి ప్రభాకర్, వైసిపి నాయకులు సయ్యద్ మాబు, పట్టణ అధ్యక్షులు నాగూల్‌మీరాన్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వల్లెం నరసింహారావు, సిపియం డివిజన్ కార్యదర్శి గుంటూరు విజయ్‌కుమార్ తదితరలు పాల్గొన్నారు.

21, 22 తేదీల్లో
అగ్రిగోల్డ్ బాధితుల రాష్టవ్య్రాప్త ఆందోళన
గుంటూరు (కొత్తపేట), మార్చి 20: రాష్ట్రప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే విషయంలో ముందుకు రాకపోవడంతో ఈనెల 21, 22 తేదీల్లో రాష్టవ్య్రాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులతో కలిసి ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు జంగాల అజయ్‌కుమార్ హెచ్చరించారు. సోమవారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు ఆమరణదీక్షలు, ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వానికి గానీ, శాసనసభ్యులకు గానీ బాధితుల గోడు పట్టడం లేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు ఆందోళనను ఉద్ధృతం చేస్తామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను దోపిడీ చేసిన కుటుంబం దర్జాగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం వారిని రక్షిస్తుందే తప్ప రికవరీ చేయడం లేదన్నారు. 32 లక్షల మంది బాధితులు రోడ్డున పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఇప్పటికైనా బాధితుల పక్షాన నిలిచి, అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎపి రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ముసునూరి రమేష్‌బాబు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పులి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.