గుంటూరు

పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 27: పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో గ్రామాలన్నింటికీ తాగునీటిని అందించేలా సిద్ధం చేసిన వాటర్ గ్రిడ్ ప్రతిపాదన త్వరగా కేంద్రానికి చేరేలా చూడాలని నర్సరావుపేట రాయపాటి సాంబశివరావు కోరారు. ఈ మేరకు సోమవారం సిఎం చంద్రబాబును అసెంబ్లీ ఆవరణలోని సిఎం చాంబర్‌లో కలిసి మాట్లాడారు. 640 కోట్ల రూపాయల అంచనాతో రూపొందించిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కేంద్రానికి పంపడంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జాప్యం వహిస్తుందని ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధమైందన్నారు. కానీ రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులతో కలిపి దీనిని పంపాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు యోచిస్తున్నారని తెలిపారు. ప్రపంచ బ్యాంకు లేదా జైకా నుండి రుణం పొందడం ద్వారా నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుండి 90 శాతం నిధులు సబ్సిడీ రూపంలో అందుతాయని సిఎం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మాచర్ల నియోజకవర్గంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద 2.63 కోట్ల రూపాయలు తక్షణం మంజూరు చేసి బోర్‌వెల్స్ వేయాలని కోరారు. 38 కోట్ల రూపాయల వ్యయం కానున్న ధర్మవరం లిఫ్డ్ ఇరిగేషన్ స్కీం రాష్ట్ర ఆర్థికశాఖకు చేరిందని, దీనిని వెంటనే క్లియర్ చేయాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందస్తుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్చం అందజేశారు. సిఎంను కలిసిన వారిలో ఎంపి రాయపాటితో పాటు ఆయన తనయుడు రాయపాటి రంగారావు, జెడ్‌ఆర్‌యుసి మెంబర్ కనుమూరి బాజిచౌదరి తదితరులు పాల్గొన్నారు.