గుంటూరు

ప్రతి ఆర్టీసీ డిపోలో ధ్యాన మందిరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, ఏప్రిల్ 15:జిల్లాలోని ప్రతి ఆర్టీసీ డిపోలో కార్మికుల కోసం ప్రత్యేక ధ్యాన మందిర్‌లను 10 రోజుల్లో ప్రారంభించనున్నట్లు గుంటూరు రీజినల్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు. శనివారం ఆయన స్థానిక డిపో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ శిక్షల కన్నా శిక్షణ మిన్నగా భావించి ఈ మందిర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఉద్యోగులు, కార్మికులు వత్తిడికి లోను కాకుండా డ్యూటీకి వెళ్లేముందు 10 నిమిషాలపాటు ధ్యానం చేస్తే వత్తిళ్ళను అధిగమించవచ్చునన్నారు. రెండు విడతల డ్యూటీని నూతనంగా ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. సత్తెనపల్లి నుండి గోరంట్ల, అమరావతి, నరసరనావుపేట, సతైనపల్లికి వచ్చి డ్యూటీ దిగేలా ప్లాన్ చేశామన్నారు. వేసవిలో కార్మికులకు కొంత సమయం విశ్రాంతి కల్పించాలన్న వుద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా నుండి ప్రప్రధమంగా ప్రవేశపెట్టినట్లు వివరించారు. ప్రధాన మార్గాల్లో సుదూర మార్గాలకు వెళ్లే బస్సుల్లో మంచినీటి సదుపాయాన్ని కల్పించనున్నట్లు తెలిపారు.
బస్సు ఆపకుంటే సస్పెండ్ ఖాయం
ప్రయాణికులు చెయ్యెత్తితే బస్సు ఆపాల్సిందేనని, అలా ఆపకుండా వెళితే అటువంటి సిబ్బందిని సస్పెండ్ చేస్తామని ఆర్‌యం శ్రీహరి హెచ్చరించారు. ఆర్టీసీ నష్టాలపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా రవాణాశాఖకు చెందిన అధికారులు ప్రైవేటు వాహనాలను నియంత్రించకుంటే నష్టాలు ఇంకా చవిచూడాల్సివుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాదాపు 99 శాతం రూట్లను జాతీయం చేసిన ఏకైక రాష్ట్రం ఏపి ఒక్కటేనని తెలిపారు. కావున కార్మికులు, ఉద్యోగులు, అధికారులు సమస్థలను లాభాల బాటలో పయనింపచేయాలంటే అందరి కృషి అవసరంమని అన్నారు. సమావేశంలో సిటియం చెవుల వెంకటేశ్వరరావు, డియం మంత్రూనాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
‘పురసేవ యాప్’తో సమస్యల పరిష్కారం
గుంటూరు, ఏప్రిల్ 15: స్థానిక సంస్థల పరిధిలో ప్రజలకు వౌలిక వసతుల కల్పనలో ఎదురయ్యే సమస్యల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పురసేవ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ నాగలక్ష్మి కోరారు. శనివారం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి 103 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే ఈ యాప్ నగరపాలక సంస్థకు అనుసంధానం చేశామన్నారు. దీనిద్వారా ఫిర్యాదుల నమోదు, పరిష్కార స్థాయి, నూతన నిర్మాణాలకు ఆస్తిపన్ను మదింపు, ఆస్తిపన్నుల వివరాలు, చెల్లింపులు, పున పరిశీలన, ఖాళీస్థలాల బకాయిలు, ఆన్‌లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతుల వివరాలు, కుళాయి కనెక్షన్లు, డ్వాక్రా సంఘాల పురోగతి వరకు 91 రకాల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. జనన, మరణ ధృవీకరణ పత్రాలు కూడా యాప్ ద్వారా దాఖలుచేసి పొందవచ్చని సూచించారు. యాప్‌లో ప్రజా ఫిర్యాదులు నేరుగా సంబంధిత అధికారికి చేరతాయన్నారు. జాప్యం జరిగితే పై స్థాయి అధికారి ఆపై ఉన్నతాధికారి నుంచి చివరి దశలో ముఖ్యమంత్రి వరకు చేరుతుందని ఫిర్యాదు క్రమాన్ని గుర్తించి నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. దీనివల్ల ఉద్యోగుల పనితీరులో మార్పుతో పాటు సమస్యల సత్వర పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందన్నారు. నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.